ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ పరిధిలో కొనసాగనున్న,కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ,బల్దియా కమిషనర్ రిజ్వాన్ భాషా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా 49వ డివిజన్ లో గల బంధం చెరువు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మించనున్న ల్యాండ్ స్కేప్, లైటింగ్, వాక్ వే పనులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్.టి.పి.యందు పర్యటించి దెబ్బతిన్న రోడ్ లను పునరుద్ధరించాలని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు.
గాంధీ నగర్ లో ఇటీవల ఏర్పాటు చేసిన నమూనా వైకుంఠ ధామాన్ని పరిశీలించారు.
అనంతరం తులసి బార్ ప్రాంతం లో నిర్మిస్తున్న డక్ట్ పనులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న 4% పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్ లు మానస రామ్ ప్రసాద్, సిరంగి సునీల్ కుమార్, బల్దియా ఎస్. ఈ. ప్రవీణ్ చంద్ర, సి.ఎం.హెచ్. ఓ.డా.రాజేష్,సి.హెచ్. ఓ.శ్రీనివాస రావు, ఈ.ఈ.రాజయ్య,ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: