ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాకు కేటాయించబడిన ఆయిల్ పాం కంపెనీ అయినటువంటి కే.ఎన్ బయో సైన్సెస్ వారి నర్సరీ ని సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం, రైతుల వివరాలు, రాయితీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నర్సరీలను తిమ్మాపూర్ లో 10 ఎకరాలలో, సెంట్రల్ జైలు ఆవరణలో 21 ఎకరాలలో నిర్వహిస్తున్నారని తెలిపారు. నర్సరీలలో మొక్కలను పెంచడానికి అవసరమైన విత్తనాలను కోస్టారికా, ఇండోనేషియా నుండి దిగుమతి చేయడం జరుగుతుందని, దిగుమతి చేసిన విత్తనాలను మొదట షేడ్ నెట్ కింద నాలుగు నెలలు పెంచి, ఆ తర్వాత నాలుగు నెలల వయసున్న మొక్కలను బయట సెకండరీ నర్సరీలో 8 నెలలు పించి, ఆ ఎదిగిన మొక్కలను రైతులకు రాయితీపై సరఫరా చేస్తారనీ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నర్సరీలో కలిపి 3 లక్షల 75 వేల మొక్కలు పెంచుతున్నారనీ అన్నారు.
రైతులకు ఒక ఎకరానికి మొక్కలపై రాయితీ రూ.11000, తోట యజమాన్యం ఎరువులకు రూ. 2100, అంతర పంటలకు రూ. 2100, బిందు సేద్యం ఎకరమునకు 15,000 నుండి 16,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఆపై రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు ఎకరానికి 4,200 చొప్పున రాయితీ ఇస్తారనీ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లా లక్ష్యం 5900 ఎకరాలు. (ఇందులో కేఎన్ బయో సైన్సెస్ వారి లక్ష్యం 3500 ఎకరాలు, రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ వారి లక్ష్యం 2400 ఎకరాలు)
ఇప్పటివరకు 630 ఎకరాలు మంజూరు చేసి, రైతులకు మొక్కలు సరఫరా చేయగ రైతులు మొక్కలు నాటుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్శనలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ఆర్ శ్రీనివాస్ రావు, ఉద్యానవన అధికారులు, ఎస్. శంకర్, బి. మానస, కే.ఎన్ బయో సైన్సెస్ కంపెనీ ప్రతినిధులు పివి కుశాల్ రెడ్డి, నర్సరీ యజమానులు, సెంట్రల్ జైలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: