April 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

2023 హైదరాబాద్ నార్సింగ్ ది అడ్రస్ కన్వెన్షనల్ హాల్ లో ఫోటోఫీనా వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఫోటో గ్రాఫర్స్ పండుగలో భాగంగా రెండవ రోజు భారీ సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ మరియు ఫోటోగ్రఫీ ప్రియులు హాజరయ్యారు , అందులో భాగంగాటిపివిపిఎ తెలంగాణ ఫోటో వీడియో ప్రొఫెష్నల్స్ అసోసియేషన్ ముఖ్య అధ్యక్షులు సోమరపు అరుణ్ కుమార్ కు భీష్మ పురస్కరం తో సత్కరించారు. వారు చేస్తున్న సేవలు మరియ అన్ని వేళలో ఫోటోగ్రాఫర్స్ కి తోడుగా ఉన్నందుకు రాష్ట్ర అధ్యక్షులు svs వెంకట్ మరియు ఫోటోఫిన ఎడిట్ పాయింట్ ఆఫ్ ఇండియా వ్యవస్తపకులు డా౹౹ఇప్పలపల్లి రమేష్, ప్రముఖ సైకాలజిస్టు సుదీర్ సండ్ర కన్నా, గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షులు పరికిపండ్ల వివేక్, శ్రీనివాస్ రెడ్డి, బత్తుల రాజు వారి కి కృతజ్ఞతలు తెలియజేశారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మాజీ  ఆర్ టిసి ఛైర్మెన్  మాజీ  ఎమ్మెల్యే  రామగుండము  అభివృద్ధి  ప్రదాత  సోమారపు సత్యనారాయణ  మరియు పెద్దపల్లి జిల్లా  రావుల  రాజేందర్    మరియు  ఇతర పెద్దపల్లి  జిల్లా  పెద్దల సూచనల  మేరకు  రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్  తమిళ్ సై సౌందర్య రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిసి సింగరేణి సంస్థ లోని కార్మికులు కార్మిక కుటుంబలు చాలా సంవత్సరాల నుండి  మారూ పేర్ల సమస్యల తో ఎదుర్కుంటున్న సమస్యలను గవర్నర్  దృష్టికి  కి తీసుకువెళ్లడం జరిగింది.అదే విధంగా రామగుండము  ఆర్ ఫ్ సి ల్  కుంభకోణం లో  మోసపోయిన నిరుద్యోగ యువత బాధితులు  ఎదుర్కొంటున్న సమస్యలను  మరోసారి  గవర్నర్  తమిళ్ సై సౌందర్య రాజన్   దృష్టికి  తీసుకోని  వెళ్లడం  జరిగింది బి ర్ స్  ప్రభుత్వ నిర్లక్ష్యం  తో  గ్రూప్ 1 మరియు ఇతర పరీక్ష పేపర్ల లీకేజీ వలన నిరుద్యోగ యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో లో నిరుద్యోగ యువత కి న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఇట్టి   విషయాలకు సానుకూలంగా  చాల సానుకూలంగా స్పందించి  సమస్యలను  పరిష్కారిస్తాము  అని    తెలంగాణ  రాష్ట్ర  గవర్నర్  తమిళసై  సౌందర్య  రాజన్   హామీ  ఇవ్వడం  జరిగింది  ఈ కార్యక్రమం లో భారతీయ జనతా యువమోర్చ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్ పటేల్,జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్,రాష్ట్ర మెడికల్ సెల్ కొ కన్వీనర్ పడాల ప్రియదర్శిని మరియు పెద్దపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రామగిరి అఖిల్ కుమార్  పాల్గొనడం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తెలంగాణ రాష్ట్ర

     ప్రభుత్వ *మస్త్య శాఖ సంచాలకులు "లచ్చిరాజం భూక్య కు వినతి పత్రం అందజేసిన గంగపుత్రులు

  రామగుండం గంగపుత్రులు పలు సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  మత్స్యశాఖ కమిషనర్ హైదరాబాద్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది.

  వినతి పత్రంలో పొందుపరిచిన విషయాలు ఏమనగా

1. చాలా రోజుల తరబడి పెండింగ్లో ఉన్న సొసైటీలను వెంటనే పూర్తి చేయాలని.

2. ఇటీవల సంభవించిన వరదల్లో గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టుల్లో చేపల వేట కోసం  వేసిన వలలు, తెప్పెలు, ఐస్ బాక్స్ లు కొట్టుకొని పోయినవి కావున స్కీం లాంటిది త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే సబ్సిడీ పై వలలు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని.

3. ఇప్పుడు ఉన్న జీవన విధానాల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న సందర్భంలో షుగర్ గాని బీపీ గాని పలు హృద్రోక సమస్యలతో గోదావరిలో చేపల వేటకు వెళ్ళిన వారు కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి చేరుకొని అందులోనే పడి మృతి చెందుతున్న సందర్భంలో వారికి లైవ్ జాకెట్లు  పంపిణీ చేయడం వల్ల వారి కి ఎలాంటి ప్రాణ హనీ ఉండదని తెలియజేశారు.

4. సొసైటీ సభ్యులు వృత్తిరీత్యా అకాల మరణం చెందినట్లయితే వారికి అందే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ని త్వరగా పూర్తి చేసి నెలరోజుల లోపే వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయాలని తెలియజేశారు.

5. పేద మహిళలకు ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చే విధంగా మహిళా మార్కెట్ సొసైటీని ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలదొక్కునే వెసులుబాటును కల్పించాలని తెలియజేశారు.

డీసీసీ అధ్యక్షులు  మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సూచన మేరకు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మత్య శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ప్రేమ్ కుమార్ రవి

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

జయదుర్గ దేవి ఆలయ  (10)వ వార్షికోత్సవం సందర్భంగా మహ చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనన్నారు. అమ్మవారి దయతో ప్రజలు కార్మికులు కర్షకులు అందరు సంతోషంగా జీవించేలా అమ్మవారు దివించాలన్నారు. శ్రీ బహ్మంగారి ఆలయంలో జరిగిన ఆరాధన ఉత్సవాల్లో మంత్రి రామగుండం ఎమ్మెల్యే  పాల్గొన్నారు. ఆలయ నిర్వహకులు వారినిఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ జడ్పీటీసీ అముల నారాయణ కార్పోరేటర్లు పెంట రాజేష్ దాతు శ్రీనివాస్ కవిత సరోజిని బాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు  సోమరపు సత్యనారాయణ పూజా హోమం కార్యక్రమం లో పాల్గొన్నారు వారికి ఆలయ కమిటీ సభ్యులు కుల సంఘం సభ్యులు సోమారపు సత్యనారాయణ  నీ శాలువాతో సన్మానించారు మరియు రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ నీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అందే రాజ్ కుమార్ అందే రమేష్ మామిడి వీరేశం భాష బోయిన వాసు బుంగ మహేష్ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు ఏకకాలం లో 2 లక్షల రుణ మాఫీ నిరుద్యోగులకు 3016/- నిరుద్యోగ భృతి కల్పిస్తాం.

పాలకుర్తి మండల విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్.

పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామగుండం కాంగ్రెస్ నాయకులు జనక్ ప్రసాద్ మాట్లాడుతూ .రామగుండం నియోజకవర్గం అత్యద్భుత వనరులు నైసర్గికస్వరూపంలో ఇక్కడ 50 సంవత్సరాలకు సరిపోయే బొగ్గు నిల్వలు , నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించగల వనరులు , 250 మెగా వాట్ల ఎన్ టి పి సి విద్యుత్ ,1600 కిలో మీటర్లు పొడవు ప్రవహించే గోదావరి నది , బసంత్ నగర్ విమానాశ్రమం , మద్రాసు టూ న్యూ ఢిల్లీ రైల్వే లైను , హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ జాతీయ రహదారి ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకొని రామగుండం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చునని కాని ఇక్కడి పాలకుల చేతకాని తనం వల్ల అనుకున్న స్థాయిలో అభివృధ్ధి జరగలేదని .

ఈ సారి అధిష్టాన నిర్ణయం ప్రకారం కార్మిక కుటుంబాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఐ ఎన్ టి యు సి కార్మిక నాయకునిగా కాంగ్రెస్ పార్టీ లో 40 ఏళ్లుగా పని చేసిన అనుభవం తో రామగుండం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని ప్రజలు ఆదరించాలని కోరారు .అలాగే ఇక్కడ అనేక అనుబంధ సంస్థలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని , సింగరేణి సంస్థ సి ఎస్ ఆర్ , డి ఎం ఎఫ్ నిధులు మన ప్రాంతం లో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.*అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తె రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ , నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు కల్పిస్తాం అలాగే సొంత స్థలం ఉన్న నిరుపేద ప్రజలకు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం అని అలాగే అంతార్గాం , పాలకుర్తి మండలాల రైతులకు ప్రజలకు సాగు నీరు, తాగు నీరు వచ్చేలా కృషి చేస్తాం అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులను ప్రజలను కోరారు .రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్ గారి నాయకత్వములో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంచార్జ్ వికాస్ కుమార్ యాదవ్ ,సెంట్రల్ సెక్రెటరీ ఎట్టం కృష్ణ ,బ్రాంచ్ సెక్రెటరీ మహేష్ బాబు , ఆంజనేయులు , అల్లావుద్దీన్ ,తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు .

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండలం పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా  ఈరోజు అంతర్గా మండల కేంద్రంలో చేపట్టిన సమ్మెలో భాగంగా సంపూర్ణ మద్దతు తెలిపిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గ్రామాలని ఆదర్శవంత గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతగల పంచాయతీ కార్యదర్శులను గౌరవం లేకుండా వెట్టి చాకిరి చేపిస్తున్న ప్రభుత్వం, 4 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వీరికి ఎలాంటి వసతులు లేకుండా 4 సంవత్సరాల నుండి కాలం గడుపుతు మాయమాటలు  మాటలు చెప్పు మోసం చేస్తున్న ప్రభుత్వం,  వీరిని గుర్తించి జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లని మరియు ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులేరేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం,, ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, మాజీ వైస్ ఎంపీపీ ఉరిమెట్ల రాయలింగం, మండల ఇన్చార్జి పెండ్రు హనుమాన్ రెడ్డి, అధికార ప్రతినిధి మద్ది తిరుపతి గౌడ్, తాళ్లపల్లి యుగంధర్,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్ ఎంపీటీసీ,కొక్కెర రమేష్, సింగం కిరణ్ గౌడ్, కోలా రమేష్,మడ్డి కమల్,దొబ్బల తరుణ్, పన్నాల తిరుపతి,గజ్జెల నాగరాజు,దొరిశెట్టి బోజన్న, గద్దెల మధునయ్య,కాంపెల్లి సంతు,మస్కం భాస్కర్,కోలా మోహన్, ఐలవేణి నరేష్, జీడికంటి పోచం, నరేష్, తదితరులు పాల్గొన్నారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తమ అక్రమ భూదందా కు అడ్డువస్తున్నరని పేదల గుడిసెలు తగుల బెట్టారు,.    భూకబ్జా దారులు తమ పద్ధతి మార్చుకొకపోతే ప్రజలచే గుణ పాఠం తప్పదు.సీపీఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి.      2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో గత 40రోజులు గా సీపీఎం అధ్వర్యంలో ఇండ్ల స్థలాల పోరాటo చేస్తున్న క్రమంలో భూకబ్జా దారులు తమ అక్రమ ప్లాట్స్ కు నష్టం వాటిల్లుతుందని ప్రారంభం నుండి అడ్డుపడుతున్నారు. ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని విసిగి వేసారి,ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారు.అదే ప్రాంతం లో అక్రమ ప్లాట్స్ దందా దారులు ఉన్న కాస్త భూమిని కబ్జా చేసి లక్షల్లో అర్జించే ప్రణాళికకు అడ్డు వస్తున్నారని గుడిసెలు పీకడం భయపెట్టే విధంగా నిన్న రాత్రి గుడిసెల కు నిప్పు అంటించారు ఇది దుర్మార్గమైన చర్య అని నాయకులు అన్నారు.తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలనుండి తగు గుణ పాఠం తప్పదనీ అన్నా రు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి రామాచారి నాయకులు ఎన్ బిక్షపతి రమణ ఎం.సంపత్,స్వప్న,R మనో హర్,కైలాస్ బాగ్,భవాని,ఎడ్ల పద్మ పాల్గొన్నారు.*

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎన్ టి పి సి.... టి టి ఎస్.లో ఆల్ ఇండియా. రేడియో. ఎఫ్. ఎం. స్టేషన్ వర్చువల్ ఓపెనింగ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చేతుల మీదుగా వర్చువల్... ఓపెనింగ్ చేసిన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు  సోమరపు సత్యనారాయణ  జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ . జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ . పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి పిడుగు కృష్ణ ముదిరాజ్. మిట్టపల్లి సతీష్ కుమార్ సాగిని కిషన్ రావు మాతంగి రేణుక మామిడి రాజేష్ గాండ్ల ధర్మపురి. దెబ్బట కమలాకర్. ప్రతాప్. మంద శ్రీనివాస్. రాంబాబు.  మామిడి వీరేశం భాష బోయిన వాసు బుంగ మహేష్ ఈదునూరి చిరంజీవి ఈదునూరి శ్రీకాంత్ .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆల్ ఇండియా రేడియో ఎఫ్ ఎం స్టేషన్ వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని గంగానగర్ లోని నాక్ సెంటర్లో కార్మికుల ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పని విధానాల గురించి సంపూర్ణంగా తెలియదు కాబట్టి నిర్మాణరంగ కార్మికులు వివిధ పని సంబంధ ప్రమాదాల గురవుతుంటారు అంతేకాకుండా పనిచేసే చోట భౌతిక రసాయన జైవిక మానసిక సామాజిక అపాయాలు ఉంటాయి అనేకమంది నిర్మాణరంగ కార్మికులు కండర ఎముకల డిజార్డర్లు వినికిడి కోల్పోవుట చేయి బహు కుదుపులు చర్మా మరియు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు అందువల్ల ఎప్పటికప్పుడు భవన నిర్మాణ కార్మికులు 50 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల దీర్ఘకాల వ్యాధులను కనిపెట్టడానికి తమ ఉపాధి సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి తమ సంపాదనను పరిరక్షించుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోగలుగుతారని డాక్టర్లు తెలియజేశారు భవన నిర్మాణ కార్డు కలిగిన కార్మికులు దీనిని ఉపయోగించుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని మెరుగైన జీవితం కోసం ఆరోగ్య సంరక్షణ మరియు క్షేమంగా ఉండాలని డాక్టర్లు కోరారు ఈ కార్యక్రమం రిజిస్టర్ చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులందరికీ సంపూర్ణ ఆరోగ్యం సంక్షేమం కల్పిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గ్రేటర్ వరంగల్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్యా లు అధికారులను ఆదేశించారు.

గురువారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో బల్దియా,  కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కలెక్టర్లు సమావేశమై  వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పురోగతిని  సమీక్షించారు.

జి డబుల్ ఎంసీ ద్వారా నిర్వహించే అభివృద్ధి పనులపై వారు సమీక్షిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా 4 ప్రాంతాలలో ఒక్కొక్కటి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మినీ స్టేడియాలునిర్మించుటకు  గాను టెండర్ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.  బంధం చెరువు అభివృద్ధి, సుందరీకరణ కొరకు 3.2 కోట్ల రూపాయలు మంజూరై టెండర్ కూడా పూర్తయినందున పనులు చేపట్టాలన్నారు.  వేసవిలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలలో త్రాగునీరు ప్రతిరోజు సక్రమంగా అందేలా నిత్యం చర్యలు తీసుకుంటు పర్యవేక్షించాలని,  నీటి సరఫరా నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ కు వచ్చే లీకేజీలు,  నీటి సంబంధం సమస్యలు, ఫిర్యాదులను   తక్షణమే పరిష్కరించాలన్నారు.

 ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరగాలని ఏదైనా ఆటంకం ఏర్పడినచో ప్రత్యాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలన్నారు.

ముంపు నివారణ చర్యలు భాగంగా మహా నగరంలోని నాలుగు ప్రధాన నాలాలైన నయీమ్ నగర్, భద్రకాళి, బొంది వాగు, శాఖరాజకుంట,  తోపాటు  వాటికి అనుసంధానంగా ఉన్న ప్రధాన అంతర్గత నాలాల పూడికతీత పనులలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే మే చివరి నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. 

నాలాల వెంబడి నాలా మెయిన్ చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  అదేవిధంగా రహదారులలో ఉన్న అన్ని మ్యాన్ హోల్ లకు  మూతలు ఉండేలా చూడాలన్నారు.

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కొనసాగుతున్న కాలోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్ రెండో తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.  భద్రకాళీ మాడవీధుల ఏర్పాటుకు వెంటనే టెండర్ ప్రక్రియ  పూర్తి చేయాలన్నారు. 

వరంగల్ బస్ స్టేషన్ నూతనంగా నిర్మించుటకు గాను వచ్చే నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హనంకొండ, వరంగల్ కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో బల్దియా ఎస్ ఈలు ప్రవీణ్ చంద్ర, కృష్ణారావు,  కుడా , బల్దియా ఈ ఈ భీమ్రావు,  రాజయ్య,  ఏ సి పి ప్రకాశ్ రెడ్డి,  డి ఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

నీడ_పెన్సషన్*ద్వారా *నిస్సహాయ, నిరుపేద పేషంట్ల *#కన్నీళ్లు తుడుస్తున్న *#నీడ_సేవలు అమోఘం  కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి_స్వామిరెండు కిడ్నీలు చెడిపోయిన పేషెంట్ల కోసం ఏర్పాటుచేసిన  నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ రెన్యూవల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి  *#జనగామ గ్రామానికి చెందిన నిలి కనకయ్య అనే  నిరుపేద డయాలసిస్ పేషెంట్ కు  నీడ ఆరోగ్యమస్తు  పెన్షన్ కార్డ్  మరియు ఏప్రిల్ నెల పెన్షన్ 521 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ  సుమారు 100 మంది పేషెంట్లకు ప్రతి సంవత్సరం నీడ చేస్తున్న సేవలు ఆనిర్వచనీయమని 

గత కొన్ని సంవత్సరాలుగా నీడ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే గర్వకారణమని పార్టీలకు అతీతంగా నీడ చేస్తున్న సేవలు ఆదర్శమని  కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గారు అన్నారు. నీడ సoస్థకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

తమ తోటి కేబుల్ ఆపరేటర్ కూతురు ఆపదలో ఉన్న విషయం తెలుసుకుని 26వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ సేవా గుణాన్ని ఔదార్యాన్ని చాటుకున్నారు ఉమ్మడి రామగుండం మండలం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు. అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామ కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు మానస గత మూడు నెలలుగా నరాలు సంబంధిత వ్యాధితో ఆర్థిక భారంతో వైద్యం చేయించుకోలేక, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ LOC ఇప్పించినప్పటికీ దారి, వసతి ఖర్చులు కూడా లేక ఇబ్బందులు పడుతుండడంతో విషయం తెలుసుకున్న రామగుండం సిటీ కేబుల్ ఎండి, 28 డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్, ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు, ఇతర జిల్లాలు, హైదరాబాద్ నుండి కేబుల్ ఆపరేటర్లు సైతం స్పందించి అందించిన 26 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని  రమణయ్య, మానసలకు అందజేశారు. ఈసందర్భంగా సిటీకేబుల్ ఎండి ఇంజపురి పులెందర్, ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సమస్య తెలిసిన వెంటనే సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలపడంతోపాటు, కేబుల్ ఆపరేటర్లు, దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని ఆర్థిక సహాయాన్ని అందించే దాతలు 9700333385 ఫోన్ పే లేదా జిపే ద్వారా అందించాలని కోరారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం మంథని నియోజకవర్గం.లోని అన్ని గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాలలో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్  ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు  సోమరపు సత్యనారాయణ  జిల్లా ఇన్చార్జి రావుల రామనాధ్  బిజెపి నాయకులు గొట్టేముక్కులు సురేష్ రెడ్డి  చందుపట్ల సునీల్ రెడ్డి . పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్ . పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ జాడి సంతోష్ యాదవ్. రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్. పిడుగు కృష్ణ ముదిరాజ్. మంథని అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్. తంగడి రాజేశ్వరరావు. కౌన్సిలర్ మహంతా కృష్ణ. కందుల సదానందం . కందుల రాజేందర్. అన్వేష్. మామిడి వీరేశం భాష బోయిన వాసు గాండ్ల స్వరూప. బిజెపి నాయకులు విధమోర్చాల నాయకులు తదితరులు. కలెక్టర్ కు నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేయాలని వినతి పత్రం. ఇచ్చినారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నేను మీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్*కాంగ్రెస్ పార్టీ*రామగుండం నియోజకవర్గం ఎంత కష్టమొచ్చినా ,నష్టమొచ్చినా..... గత ఇరవై ఐదేళ్లుగా ఎన్నికల్లో  అందరికీ ఆమోదయోగ్యమైన విజయం నాకు రాకున్నా సరే , మన రామగుండం నియోజకవర్గ సామాన్య ప్రజల విషయంలో నా అభిప్రాయం మారలేదు. ప్రజల హృదయాలు గెలవాలన్న లక్ష్యం ఎప్పుడూ నాకు చెదరలేదు.

నిత్యం రామగుండం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటున్నాను ... మీకు ఏ కష్టం వచ్చినా ఇంటి పెద్ద కొడుకులా ముందుంటాను . మీ సమస్యల పట్ల నిజాయతీగా పోరాటం చేస్తున్నాను . నా శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తూ.. అనుక్షణం రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తుంటాను అని అన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


మహాదేవపూర్: మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం లో, బుధవారం రోజున జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో, పి నారాయణ బాబు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి చేత, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది.ఈ క్లినిక్ లో రైతు సమస్యల పరిష్కారం కోసం, భూ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నకిలీ విత్తనాలు,పురుగుమందుల సమస్యలు,అధిక ధరలకు విక్రయాలు, పంట నష్టం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్కెట్లో పంట అమ్మడానికి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు న్యాయపరమైన సూచనలు సలహాలు ఉచితంగా పొందవచ్చని తెలియజేశారు. ఈ క్లినిక్ కోసం పారా లీగల్ వాలెంటర్స్ ని నియమించడం జరుగుతుంది. వారు రైతుల యొక్క సమస్యను దరఖాస్తు రూపంలో సేకరించి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె జయరాం రెడ్డి సీనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి, ఎన్. రామ్చంద్ర రావు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, ఎం.విజయ భాస్కర్ జిల్లా వ్యవసాయ అధికారి,  ఏదులాపురం శ్రీనివాస్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ భూపాలపల్లి, పగడాల ఆనందరావు జనరల్ సెక్రెటరీ బార్ అసోసియేషన్, ఆర్ కె శ్రీనివాసరాజు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కిరణ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహాదేవపూర్, బాన్సోడ రాణి భాయ్ ఎంపీపీ, గుడాల అరుణ జెడ్పిటిసి, బండం లక్ష్మారెడ్డి రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్, శ్రీపతి బాబు సర్పంచ్, రాజ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ప్రభావతి మండల వ్యవసాయ అధికారి, సిహెచ్ ధర్మేందర్ వ్యవసాయ విస్తరణ అధికారి, వివిధ శాఖ అధికారులు, మండల అడ్వకేట్లు, పాత్రికేయులు, రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని, ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 

గురువారం ఉదయం 

చెట్ పల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. నిందితుల నుండి ఒక కత్తి, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన మహేష్ తో యువతికి కొన్నాళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఏడాది క్రితం యువతికి మరో యువకుడితో వివాహం జరిగింది. సోషల్ మీడియాలో యువతి ప్రైవేటు ఫోటోలు, వీడియోలను మహేష్ వైరల్ చేసాడని చెప్పారు. వీడియోలు బహిర్గతం కావడంతో మనస్తాపంతో శృతి భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. భర్త ఆత్మహత్య తర్వాత యువతి పుట్టింటికి వచ్చి ఉంటోంది. మళ్లీ కొన్నాళ్లుగా యువతిని మహేష్ వేధిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు మహేష్ ను బండరాళ్లతో కొట్టి, గొంతు కోసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హత్యకు పాల్పడిన పెద్దపల్లి కనకయ్య, పెద్దపల్లి పద్మ, పెద్దపల్లి సాయి, పెద్దపల్లి శ్రుతి, పెద్దపల్లి శ్వేతను అరెస్ట్ చేసినట్లు ఎసిపి నరేందర్ వెల్లడించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

హ‌న్మ‌కొండ జిల్లా: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేర‌కు కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, ఆలియాస్ మున్నా, ఆలియాస్ సూర్యా, అత‌డి భార్య మడివి సోమిడి అలియాస్ కల్పనను మీడియా ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు. ఏపీలోని పల్నాడు జిల్లా, మాచర్ల మండలం, కంభంపాడు గ్రామానికి చెందిన కాసరనేని రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్,మణుగూరు ఎల్.ఓ.ఎస్ కమాండర్‌గా ఉన్నాడు. అత‌డి భార్య మడివి సోమిడి చర్ల మండలానికి చెందిన‌వారు. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్‌గా, మణుగూరు ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్‌గా కొన‌సాగుతున్నారు. కాగా విప్ల‌వ సిద్ధాంతాలు న‌చ్చ‌కపోవ‌డంతోపాటు అనారోగ్యం కార‌ణంగా లొంగిపోయిన‌ట్లు సీపీ వెల్ల‌డించారు.

ర‌వికుమార్ ప్ర‌స్థానం..

స్వగ్రామంలో పదో తరగతి వరకు చదువుకున్న రవికుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపివేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంటిలో కొద్ది సంవత్సరాలు నివాసం వున్నాడు. ఇదే సమయంలో విప్లవ భావాలు కలిగి గ‌ల రవికుమార్ 2012 సంవత్సరంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ డ్రేడ్ యూనియన్లో జాయిన్ అయ్యాడు. అనంతరం కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికకై ఆతర్వాత పీడీఎస్‌యూలో చేరాడు. 2016 సంవత్సరంలో మావోయి స్టుల సిద్ధాంతాలకు ఆకర్షితుడై రవికుమార్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ పోత్సహంతో పార్టీ సభ్యుడిగా చేరారు. చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పనిచేశాడు. 2017 సంవత్సరంలో డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన రవికుమార్ 2019 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ మణుగూరు ఎల్.ఓ.ఎస్ ఏసీఎం మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. రవికుమార్‌పై ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది.

మడివి సామిడి అలియాస్ కల్పన ప్రస్థానం..

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలైన కల్పన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018 సంవత్సరంలో చర్ల ఎల్.ఓ.ఎస్ సభ్యురాలిగా, 2020 సంవత్సరంలో ఏసిఎం, మణుగూరు ఎలోఓఎస్. డిప్యూటీ కమాండర్‌గా పనిచేసింది. 2021 సంవత్సరంలో సుక్మా జిల్లా, జీరమతీ గ్రామంలో పోలీసు బలగాలపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితురాలు. ఈమెపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెద్దంపేట గ్రామం భగత్ సింగ్ విగ్రహం వద్ద 138వ మే డే వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ జిల్లా నాయకులు మార్త రామన్న   మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పని గంటలకు వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా 138 సంవత్సరాల క్రితమే చికాగో పోరాటం ఫలితంగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించిన రోజు అనేక హక్కులను సాధించడం కోసం ఎంతోమంది కార్మిక నేతలు అమరులై తమ రక్తంతో తడిసిన జెండాను ఎర్రజెండాను కార్మికుల పోరాటాల జెండాగా అందించిన మే డే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ మేడే నిర్వహించాలని పిలుపునిచ్చారు కార్మికులకు కనీస వేతనాలు పని భద్రత 12 తగ్గింపు చేయాలని డిమాండ్ చేశారు నిజజీవితంలో సరిపడే వేతనాలు ఇవ్వడం లేదన్నారు స్థానికంగా ఉన్న ఎన్ టి పి సి ఆర్ఎఫ్సిఎల్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ సింగరేణిలో వందలాదిమంది కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు వారికి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని అన్నారు ఎల్లంపల్లి పంప్ హౌస్లలో ప్రాజెక్టుల పైన పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు  ఇవ్వకపోవడంతో పోషించుకోలేకపోతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఉడత శ్రీను

 తుళ్ల గట్టయ్య టీ కొమురయ్య మంథని శ్రీనివాస్ శ్రీనివాస్ మంద శ్రీనివాస్  లు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవ్ పూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామం లో ఇటీవల అనారోగ్య సమస్యలతో మృతి చెందిన  కాటారపు దుర్గయ్య గౌడ్, ఔసలి జగదాంబ, బుర్ర సులోచన గార్ల  కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, వారి వెంట అసెంబ్లీ కో కన్వినర్ నాంపల్లి రమేష్, మండల ఇంచార్జ్ ఉడుముల విజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లం కిషన్, మండల ఉప అధ్యక్షులు గోమాస సంతోష్, వేముల పున్నం గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు, ఎస్ స్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ కిష్టయ్య, బూత్ అధ్యక్షులు బానేష్,కార్యదర్శి సుంకరి మహేష్ , పోటు శ్రవణ్ రెడ్డి,లస్మయ్య, గోక లక్ష్మణ్,పానకంటి రాజయ్య , సుంకరి శ్రీనివాస్,సిద్దు , శ్రీనివాస్,వెన్నపురెడ్డి సుకుమార్ రెడ్డి, బూత్ ఉప అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్  హంసలి తేజ, దేవేందర్, సురేష్, గట్టయ్య తదితరులు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం, మరియు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ల ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలో ఏ క్లాస్ పూర్, వీసంపేట్ పొట్యాల ఆకే నపల్లి సోమన్ పల్లి గ్రామాలలో ఐకెపి సెంటర్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోకుండా నట్టేట ముంచుతున్నాయన్నారు వాతావరణ కేంద్రాలు బారీ వర్షాలు ఉన్నాయని ముందుగానే హెచ్చరిక చేస్తున పట్టించుకోవడం లేదు

 15 రోజులకు పైగా ఐకెపి సెంటర్లకు వరి ధాన్యం వచ్చి నిలువలు ఉండడంతో అకాల వర్షం రావడం వలన వరి పూర్తిగా తడిసి నీళ్లల్లో ముద్దగా మారి మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడింది అయినా నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు ప్రారంభించిన ఒక లారీ కూడా కాంట పెట్టి బయటకు పంపలేదు అప్పులు సప్పులు చేసి అనేక రోగాల బారి నుండి వరి పంటను కాపాడుకొని తీరా చేతికి వచ్చే సమయానికి వర్షం పాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు ఉరిమిన మెరిసిన కంటిమీద కునుక్కు లేకుండా కల్లాల మీద పండుకొని వర్షంలో తడుసుకుంట కూడా వరి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు కానీ అధికారులు ప్రభుత్వం మాత్రం నేటికీ రైతుల దగ్గరకొచ్చి వరి పొలాల దగ్గరికి వచ్చి భరోసానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మిల్లర్లు ఆడుతున్న నాటకాలకు అడ్డుకట్ట వేయాలని ఐకెపి సెంటర్లకు వచ్చిన వడ్లను వచ్చినట్టే కాంటపెట్టుకొని తీసుకుపోవాలని మద్దతు ధర ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరియు పూర్తిగా వర్షములో మునిగిన వరి రైతుకు వివిధ పంటలు పండించే రైతులకు నష్టపరిహారం అధికారులు అం చన వేసి కాలయాపన చేయకుండా తక్షణమే రైతుల కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం బ్యాంకు రుణాలు కూడా నేటికీ మాపి కాలేదు వాటిని తక్షణమే మాఫీ చేయాలని కోరుతున్నాం

ఈ కార్యక్రమంలో ప్రజాపంథా డివిజన్ నాయకులు టీగుట్ల రాములు శ్రీనివాస్ రాజయ్య సాగర్ లచ్చయ్య సుధాకర్ మల్లయ్య రవి తిరుపతి సత్తయ్య లింగమూర్తి పోశయ్య రాజేశం లతోపాటు రైతులు పాల్గొన్నారు,

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పత్రిక ప్రకటన ఎన్టీపీసీ జ్యోతి నగర్  హమాలి కార్మికుల చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల.      హమాలి కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే దర్ణలో హమాలి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ  వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం రామాచారి కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హమాలి కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. భవన నిర్మాణ కార్మికుల లాగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 55స.లు దాటిన హమాలీలకు రూ.6000/- పెన్సన్ అమలుచేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు వర్తింప చేయాలని ఐ ఎల్ ఓ నిర్ణయం ప్రకారం 50కి.బరువు కలిగిన బస్తాలు రాకూడదని తదితర డిమాండ్లతో ఏప్రిల్ 29న హైదరా బాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా లో బజారు,మార్కెట్ ,ఐకేపీ తదితర రకాల హమాలి కార్మికులు పాల్గొని విజయ వంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి హమాలీ సంఘం నాయకులు అంజయ్య కొమరయ్య తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

మంథని: పట్టణం లోని  బీజేపీ పార్టీ ఆఫీస్ లో అడవి సోమనపల్లి కి చెందిన పలువురు, బిజెపి రాష్ట్ర నాయకులు, మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో, నేటి బుధవారం రోజు బిజెపి పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన, దేశ అభివృద్ధిని చూసి, యువ నాయకుడు సునీల్ రెడ్డితో కలిసి పార్టీ కోసం పని  చేస్తూ, మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలనే లక్ష్యం తోనే బిజెపి పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. అనంతరం ఈ సందర్భంగా సునీల్  మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలు విసుగుచెంది మార్పు కోరుకుంటున్నారని, 40 సంవత్సరాలు కాంగ్రెస్, 9 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలించిన ఈ మంథని ప్రాంతం అంతా అవినీతిమయమే తప్ప,  ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, తెల్లారి లేస్తే ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శనస్త్రాలు, తిట్టు కోవడం తప్ప, మంథని కి చేసిన అభివృద్ధి ఏమిటి.? ప్రజలు బిజెపి పార్టీని ఆదరిస్తున్నారని, కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో  మంథనితో పాటు రాష్ట్రంలో కూడా బిజెపి గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లిక్,చెరుకుతోట సురేష్,బూడిద తిరుపతి,ఎల్క సదానందం, కనుకుంట్ల సుధాకర్,కుర్మ శేఖర్,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈదురు గాలులు వచ్చి బట్టారి రవి. ఇల్లు కరెంట్ షాట్  సర్కూట్ తో ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇంట్లోనే వస్తువులు బియ్యం నిత్యవసరకులు మరియు బట్టలు పూర్తిగా మంటల్లో కాలిపోయి నట్లు స్థానికులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా మంటల్లో దగ్ధం అయిన ఇంటి కుటుంబ సభ్యుల పరిస్థితి  తెలుపగానే వెంటనే స్పందించి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కరరావు గారి సహకారంతో బాధిత కుటుంబానికి బుధవారం రోజున 25 కిలో బియ్యం ఫౌండేషన్ సభ్యులు నిమ్మరాజుల రవి ద్వారా. బట్టారి రవి కుటుంబానికి అందజేసినట్లు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి నిమ్మ రాజుల రవి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఏ పేదవారికి ఆపద వచ్చిన ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు ఈనాటి దాత చింతల భాస్కరరావు కు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరోనా కష్టాకాలంలో కూడా మా గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చి వండుకోలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు 14 రోజులపాటు బాధిత కుటుంబాలకు భోజనాలు  అందజేశారని అలాగే మా గ్రామం లోని ఉపాధి హామీ కూలీలకు మాస్క్ లను కూడా పంపించి మా గ్రామ ప్రజలను ఆదుకున్నారని నిమ్మ రాజుల రవి గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో  నుంచి ఇప్పటివరకు అలుపెరుగని సేవలందిస్తున్న సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు నాతోటి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా మరొక్కసారి మా లింగాపూర్ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని 

నిమ్మ రాజుల రవి తెలిపారు ఈ కార్యక్రమంలో పులి శ్రీనివాస్. కన్నం మోహన్. ఆర్కుటి తిరుపతి. కనుమల్ల నర్సయ్య. తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని పట్టణంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డ నేతకానిలకు సంక్షేమ భవనం నిర్మించాలని, నేత వృత్తి ధ్వంసమై ఎటువంటి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేతకాని దళితులకు నూటికి నూరు శాతం దళిత బంధు అమలు చేయాలని టిఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కి సమత సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకానిలు చేతి వృత్తి ధ్వంసమై ఎటువంటి ఉపాధి లేక ఆర్థికంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన చెందారు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యాదవులకు గొర్రెలు మత్స్యకారులకు చేపలు ఇలా వారి వారి కులాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లే నేతకాని దళితులకు దళిత బంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా అందరికీ సంక్షేమ భవనాలు నిర్మించినట్లు గోదావరిఖని పట్టణ కేంద్రంలో నేతకాని సంక్షేమ భవనం నిర్మించాలని కోరారు. అందుకు టిఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అమలు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు... 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


బిఆర్ఎస్ పార్టి అవిర్బావ దినోత్సవం పురస్కరించుకుని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ గ్ర్యాండ్ సక్సెస్ అయ్యంది. రామగుండం ప్రారిశ్రామిక ప్రాంతమంతా గులాభి మయంగా మరిపోయుంది. 5 వేల మంది గులాభీ సైనికులతో జిఎం కాలనీ మైదానం కిక్కిరిసిపోయుంది.  సభ ప్రంగణంలో ముందుగా బిఆర్ఎస్ పార్టీ జెండాను రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్  జిల్లా ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్  అవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూల మాల వేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయన్నారు. కేసీఆర్‌ నాయకత్వం లో ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ముఖంలో ఆనందం నింపుతున్నరన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు. 

"తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవనిధర్నాలు, సమ్మెలు లేకుండా సస్యశ్యామలంగా విరాజిల్లుతుందన్నారు. 

విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరగాలని గురుకులాలను ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు వరకు అదోగతి గా ఉన్న రాష్ట్రం రాష్ట్ర జిడిపి 12 నుండి 13.2 కి పెరిగి దేశ జిడిపి లో 10.3 కు తగ్గింది అంటే సిఎం కేసీఆర్ పాలన తెలుస్తుందన్నారు. 

రైతు సంక్షేమానికి సిఎం ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. తూర్పున ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళు ఒడిసి పట్టి ఎంతో గోప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రాష్ట్రానికి నిల్లందిస్తున్న జల ప్రధాత  కేసీఆర్ అన్నారు. ‌ అన్నదాతలకు సిఎం కేసీఆర్‌  వెన్నుముకగా మారారని రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి రైతు బందు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రుణ మాఫీ, చెరువుల పునరుద్దరణ , కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ తో రైతు పక్ష పాతిగా నిలిచారు కేసీఆర్ నిలిచారన్నారు. గత ప్రభుత్వాలు రామగుండం నియోజకవర్గపై పగబట్టారని అంతర్గాం సిన్నింగ్ మిల్ ఎ పవరహౌజ్ మూసి వేశారన్నారు. తాము రామగుండం ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి 

రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకువేళ్తున్నమని చెప్పారు. రామగుండం ప్రజల దశాబ్దాల కళ అయున మెడికల్ కళాశాలను సిఎం కేసీఆర్‌ ను ఒప్పించి మెప్పించి ఎర్పాటు చెయుంచామన్నారు. వైద్య కళాశాల ఎర్పాటుతో కార్ఫోరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గోదావరిఖని పట్టణంలో సివిల్ జడ్జి కోర్టు ఎర్పాటు చేయుంచామన్నారు. 

ఈ ప్రాంత ప్రజలు రిజిస్టర్ ల కోసం  పెద్దపల్లికి వెళ్లాల్సి రావడం వారికి అర్దికంగా ప్రయాణ సమాయాన్ని తగ్గించేందుకు రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకువచ్చామన్నారు. లింగపూర్ కుందనపల్లి వీలీన గ్రామాలకి విముక్తి కల్గించామని, ఎన్నో ఎళ్లుగా పెండుంగ్ లో ఉన్న కుందనపల్లి రైల్వే ఓవర్ బిడ్జిని పనులు ప్రారంభించామని చెప్పారు.  గత కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసిందని ఇక్కడి రైతులు సాగునీరు అందించలేదన్నారు.  రామగుండం నియోజకవర్గానికి పంట పోలాలకు సాగునీరు అందించేందుకు బ్రాహ్మణపల్లి వద్ద 80 కోట్లతో లిప్ట్ ఎర్పాటు చేశారని 27 ఎల్, 16 ఎల్ ద్వారా ప్రతి పోలాని సాగునీరు అందించడం జగుతుందన్నారు. 6500 మందికి కళ్యాణ లక్ష్మి షాదిముభారక్ పధకం ద్వారా ఓక్కో కుటుంభానికి ప్రభుత్వం ద్వారా 1లక్ష నూట పదహారు రూపాయలు అందించామన్నారు. నియోజకవర్గం లోని  అవ్వలకు వితంతులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు 28 వెల మందికి ఆసరా ఫించన్లు అందించడఁ జరుగుతుందన్నారు. 

రామగుండం నియోజకవర్గం లో తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు.. "సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నరని అన్నారు. నిత్యం  18 గంటలు ప్రజ సేవకే యమ జీవితం అంకితం చేశామని 2018 ఎన్నికల  సమయంలో నాకు సంజీవిని అందించిన నా ప్రజల కోసం ఎంతాటి త్యాగానికైనా సిద్దమని నా బలం బలగం నా జనమేనని నాకు  ప్రజలిచ్చిన ధైర్యంతో రామగుండం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి  చేస్తానన్నారు.*అనంతరం 18 అంశాలతో పట్టణ ప్రగతి..

సింగరేణి పై సమస్యల పై

పెరిగిన ధరల మీద

పార్లమెంట్ లో అంబేడ్కర్ 

మహిళా సంక్షేమం 

సచివాలయం కు అంబేడ్కర్ పేరు

గురుకుల పాఠశాల

పల్లె ప్రగతి

రైతు సంక్షేమం

బిసి సంక్షేమం

ఎస్టీ 

ఉద్యోగ అవకాశాలు

ముస్లిం మైనారి

ఆసరా ఫించన్ కళ్యాణ లక్ష్మి షాదిముభారక్ పధకాలపై సిఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మాణాలు ప్రవేశపెట్టి అమెాదించారు. 

ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్  నడిపల్లి అభిషేక్ రావు, అంతర్గం జడ్పిటిసి  ఆముల నారాయణ, ఎంపీపీ  దుర్గం విజయ,  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి టిబిజికఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య చిరుమల్ల రాకేశ్ వైస్ ఎంపీపీ  మట్ట లక్ష్మి, ఎర్రం స్వామి  పాలకుర్తి మండల అధ్యక్షులు ఇంజపూరి నవీన్, అంతర్గ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, కార్పొరేటర్లు సాగంటి శంకర్  ఇంజపురి పూలెందేర్, కుమ్మరి శ్రీనివాస్, బోడ్డు రజిత రవీందర్ నీల పద్మ గణేష్  బాల రాజ్ కుమార్, పెంట రాజేష్, కన్నూరి సతీశ్ కుమార్ దొంత శ్రీనివాస్, దాత శ్రీనివాస్,కోమ్ము వేణుగోపాల్ జంగపల్లి సరోజన  కలువల శిరీష సంజీవ్, కల్వచర్ల కృష్ణవేణి, రమణ రెడ్డి  జనగామ కవితా సరోజిని, పొన్నం విద్యా-లక్ష్మణ్, జెట్టి జ్యోతి రమేష్, రాకం లతా దామోదర్, బాదె అంజలి దేవి, వేగోళపు రమాదేవి- గంగ శ్రీను శంకర్ నాయక్  తాళ్ల అమృతమ్మ రాజయ్య శివకుమార్ జంజర్ల మౌనిక జే.వి రాజు పాముకుంట్ల భాస్కర్ మేకల సదానందం కో ఆప్షన్ మెంబెర్లు రఫిక్, వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డి, తస్నీమ్ భాను- జహీద్ పాషా, తానిపర్తి విజయ లక్ష్మి సర్పంచ్ లు ధర్మాజి కృష్ణా తుంగపిండి సతీష్ ధరని రాజేష్ స్వామి బండారి ప్రవీన్ రవీందర్ మేరుగు కోల్లురి సత్య సతీష్ వేణుగోపాల్ రావు మల్లేత్తుల శ్రీనివాస్ కొల లత లక్ష్మిపతి   పోశం  నాయకులు పిటి స్వామి,తోడేటి శంకర్ గౌడ్  పర్లపల్లి రవి, దీటి బాలరాజు  చెప్యాల రామారావు నారాయణదాసు మారుతి, మాదాసు రామ మూర్తి అయులి శ్రీనివాస్ అల్లం రాజన్న మామిడాల ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డి  అమరేందర్ నడిపెల్లి మురళీదర్ రావు తానిపర్తి గోపాల్ రావు  అచ్చే వేణు చెలకలపల్లి శ్రీనివాస్ గండ్ర దామెాదర్ రావు నూతి తిరుపతి మేతుకు దేవరాజ్ మేడి సదయ్య గౌస్ పాషా తోకల రమేష్ పిల్లి రమేష్ అనుముల కళావతి సమ్మారావు మండ రమేష్ చల్లా రవీందర్ రెడ్డి గొపు అయులయ్య యాదవ్ చల్లగురుగుల మెగిళి   మేకల పోశం బెంద్రం రాజిరెడ్డి కుమ్మరి శారదా  దోమ్మెటి వాసు భాస్కర్ సాగర్ కొల సంతోష్ కోప్పు రాజేశం ఎదులపూరం వెంకటేష్  జనగామ నర్సయ్య మెహిద్ సన్ని శ్రీనివాస్ రెడ్డి సంధ్యా రెడ్డి దాసరి ఎల్లయ్య ఇరుగురాళ్ల శ్రావన్ మేకల అబ్బాస్ మామిడాల రాము భూరుగు వంశీకృష్ణ మధుకర రెడ్డి  గుంపుల ఓదేలు రాములు మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండలం పరిధిలోని సోమనపల్లి గ్రామానికి చెందిన ఐట్ల వేణు ప్రైవేట్ జాబ్ చేస్తూ భార్య, ఒక్క అబ్బాయి తో జీవనం సాగిస్తున్న,

ఆకెనపల్లి బస్టాండ్ నుండి గ్రామం లోపలికి వస్తుండగా వాటర్ ట్యాంక్ దగ్గర మూలమలుపు వద్ద బ్రేకులు అదుపుతప్పి గేటు వాల్ కుండీలో పడి తలకు తీవ్రమైన గాయాలు అయి, ప్రమాదం స్థలంలో పడడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వేణు మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించగా,

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఐట్ల వేణును పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు #రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ హాస్పిటల్ కు వెళ్లి బాధితుడిని పరామర్శించి, 

ధైర్యం చెప్పి, మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ల తో మాట్లాడి మరియు 

హాస్పిటల్ బిల్లులను కూడా తగ్గించాలని నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు..

అనంతరం వేణు కుటుంబ సభ్యులకు నేను మీకు అండగా ఉన్నాను మీరు అధైర్య పడద్దని బాధితులకు భరోసా కల్పించారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో  ఓబీసీ కాంగ్రెస్ పార్టీ సమావేశం పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు అధ్యక్షతన జరుగిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల ప్రాతిపదికన ఓబీసీ సెన్సస్ చేపడతామని మాజీ ఏ.ఐ.సి.సి అధ్యక్షులు *రాహుల్ గాంధీ చారిత్రాత్మక ప్రకటన చేశారు.

అదే విధంగా ఇన్నాళ్ళుగా అమలుకు నోచుకోని  ఓబీసీ రేజర్వేషన్లు కూడా చేపడతామని హామీ ఇచ్చారు. 

రాహుల్ గాంధీ 

ఈ చారిత్రాత్మక ఓబీసీల నిర్ణయంపై  హైదరాబాద్ లోని  ఇంద్ర భవన్ (గాంధీ భవన్) లో ఓబీసీ ల సమావేశం లో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

వేల్పుల కుమారస్వామి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్.టి.పి.సి.లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది.దీకికి వేల్పుల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మార్చి 18 నుండి సిపిఎం అధ్వర్యంలో 4 కేంద్రాల్లో భూ పోరాటం కొనసాగుతుందని అన్నారు.సుమారు రెండు వేల మంది తో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించి 6050 దరఖాస్తులు అందివ్వడం జరిగింది.ఈ క్రమంలో 2వ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ కాలనీ,పి.కే.రామయ్య కాలనీ లల్లో కూడా భూ పోరాటం కొనసాగుతుందని అన్నారు. 

39 రోజుల నుండి పేదలు భూ పోరాటం చేస్తూ నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే స్థానిక బి.అర్.ఎస్.పార్టీ కార్పొరేటర్  రమణా రెడ్డి  తన అనుచరులుగా చెప్పుకుంటూ తిరుగుతున్న సుద్దాల గోపాల్, సౌజన్య, వసంత, కవితారెడ్డి, శ్రీను,దుర్గ తదితరులు కలిసి గుడిసెలు పీకేసారని అన్నారు. పేద ప్రజలకు పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న రమణా రెడ్డి గుడిసెలు తీసేయించడం ఎంటని ప్రశ్నించారు.

ఇప్పటికే ఇందిరమ్మ కాలనీ లో వీరు సుమారు 3 వందల ప్లాట్లు కబ్జా చేశారని అన్నారు.రెవెన్యూ స్టాంప్ లు తయారు చేసి నకిలీ పట్టాలు సృష్టించి ఒక ప్లాట్ నలుగురికి అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అన్నారు.అసలు ప్లాటు దారుల వచ్చి ఇది నా ప్లాటు అంటే వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అన్నారు.పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుదామంటే పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా భయపడుతున్నారు అంటే 

రమణా రెడ్డి ఎంత భయ బ్రంతులకు గురిచేస్తున్నడో అర్దం చేసుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ చేస్తున్న భూ పోరాటాలకు భయపడి తనకు రావాల్సిన ఆదాయం ఎక్కడ పోతుందో అనే భయంతోనే భూ పోరాటాలను అడ్డుకుంటున్నారని అన్నారు.సిపిఎం లేకపోతే తను ఇందిరమ్మ కాలనీ లో ఎతెచ్చగా భూ కబ్జా చేసి లక్షలు సంపాదించవచ్చని భావిస్తున్నారని అన్నారు. రమణా రెడ్డి మరియు అతని అనుచరల ఆటలు సాగనివ్వమని అన్నారు.ఇప్పటి కైనా రమణా రెడ్డి అతని అనుచరులు తమ తప్పుడు విదానాలను మానుకోకపోతే గుడిసెలు వేసుకున్న పేదలతో రమణా రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.తహశీల్దారు  నకిలీ పట్టాలు ఉన్నాయని వాటిని గుర్తించడం,తప్పుడు పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికైనా ప్రకటించడం సంతోషం అన్నారు.

పేదల గుడిసెలు పీకేసిన రమణా రెడ్డి మరియు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.రామాచారి.జిల్లా కమిటీ సభ్యులు ఎన్.శంకర్,నాయకులు బిక్షపతి,లక్ష్మారెడ్డి,ఉపేందర్,రమణ,మల్లేష్,కనుకయ్యా,దేవి,భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం లోని తబిత ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి లగిశెట్టి చంద్రమౌళి కుటుంబ సభ్యులు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ, వీరేందర్ తన కూతురు తబితను కోల్పోయినా ఎందరో అనాధలను తన పిల్లలుగా పెంచుతున్న మానవతామూర్తి ,స్పూర్తి ప్రదాతలని కొనియాడారు.ఎవ్వరూ లేని అనాధలైన ఆ పిల్లలకు తన వంతు బాధ్యతగా వారందరికి దాదాపు 200 డ్రెస్ లను అందించడం చంద్రమౌళి సహృదయంకు నిదర్శనమని, సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు . తల్లితండ్రులు లేని ఇ లాంటి వారికి ప్రతి ఒక్కరం మన పిల్లలుగా భావించి తమ వంతుగా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సదాశయ బాద్యులు నారాయణ, లింగమూర్తి, చంద్రమౌళి పాల్గొన్నారు,.ఇట్టి సమాజహితమైన కార్యక్రమం నిర్వహించిన . చంద్ర మౌళి కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సలహాదారులు నూక రమేష్, సాన రామకృష్ణ రెడ్డి,మారెల్లి రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ చంద్రమౌళి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమునిపట్నం కు చెందిన సార్ల అంజయ్య ట్రాలీ నడుపుతూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న అంజయ్య ఆదివారం రోజున.మంచిర్యాల కు వెళుతుండగా ఇందారం ప్లైఓవర్ బ్రడ్జి దగ్గర అంజయ్య నడుపుతున్న ఆటో ట్రాలీ వెనుకాల కారు డీ కొట్టడంతో అంజయ్య చెయ్యి ప్రమాదం స్థలంలో తెగి పడడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న అంజయ్య ను మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అంజయ్య ను పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ హాస్పిటల్ కు వెళ్లి  బాధితుని పరామర్శించి ధైర్యం చెప్పి మెరుగైన చికిత్స అందించాలని యశోద డాక్టర్ల తో మాట్లాడి హాస్పిటల్ బిల్లు కూడా తగ్గించాలని యశోద హాస్పిటల్ వారికి చూసించారు అనంతరం అంజయ్య కుటుంబ సభ్యులకు నేను మీకు అండగా ఉన్నాను మీరు ఆదర్యా పడద్దు అని బాధితులకు భరోసా ఇచ్చారు.రామగుండం నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ లో ఏ పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ ఉన్నా వెళ్లి చూసి ఔదార్యం చాటుతూ బాధితులకు అండగా ఉంటారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. చికిత్స పొందుతున్న బాధితున్నీ పరామర్శించిన వారిలో సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అనుముల వేణు మాధవ్ పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఎస్ సి సి డబ్ల్యూ యు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గోదావరిఖనిలో పవర్ హౌస్ జోన్ లో గేట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మే డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. *ఈ సందర్భంగా పాల్గొన్న ఐ ఎఫ్ టి యు నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మే డే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. 8 గంటల పని ధినం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాన్ని అవమానపరుస్తున్నది. దానిలో భాగంగానే 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెడుతుంది. కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులపై దాడిని కొనసాగిస్తున్నది. కనీస వేతనాల జీవోలను సైతం సవరించకుండా ఏండ్ల తరబడి పెండింగ్లో పెడుతుంది. మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాలే. చికాగో అమరుల స్ఫూర్తితో మేడే వారసత్వాన్ని కొనసాగించాలని, కనీస వేతనాల అమలుకై పోరాడాలని పిలుపునిచ్చారు మే ఒకటో తేదీన వాడవాడలా కార్మిక క్షేత్రంలో ఎర్రజెండాలు ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. *ఈ కార్యక్రమంలోఎస్ సి సి డబ్ల్యూయు ఐఎఫ్టియు నాయకులు డి రాంబాబు, బొంత హరి, సిహెచ్ రాజేశ్వరి, కే లక్ష్మి, బి సంపత్, శేఖర్, మమత , లక్ష్మి, స్వరూప, రాజు, పోచమ్మ, మీనా, కొమురయ్య, మంగ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గం మండలం లోని మద్దిర్యలా, పోట్యాల, ఎగ్లస్పుర్, ఆకెనపల్లి, సోమనపల్లి, బ్రాహ్మణపల్లి, ఎల్లంపల్లి, ముర్మర్ ,లింగాపుర్  గ్రామాలలో అంతర్గం మండలం వ్యవసాయ సాహకరసంఘం అద్యక్షులు మామిడిల ప్రభకర్ అద్యక్షతన జరగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆ మూల నారాయణముఖ్య అతితిగా హజరై వడ్ల కోనుగోలు కేంద్రాలాను ప్రారంభం చెసారు , ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసిఆర్  రైతులను ఎల్లప్పుడు అన్నివిధములుగా ప్రభుత్వ పరంగా అధుకుందని , మరియు దేశంలో తెలంగాణ రాష్టం పంటల దిగుబడిలో రెండవ స్తానం లో వున్నదంటె ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనె సాద్యం అయిందని తెలియజెప్పారు ..

ఈ కార్యక్రమంలో యంపిపి దుర్గంవిజయ, సర్పంచ్లు బాదరవేణి స్వామి , గుమ్ముల రవిందర్ ,ప్రవీణ్, పోషం, ఎదులాపురంనీరజ వెంకటెష్,సందెల దివ్య , దెవక్కరామన్, బీఆర్ఎస్ నాయకులు  రైతులు పాల్గోన్నారు …

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                           



                              పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:24:సొంత జాగ...నిలువ నీడ లేదు,అద్దె కొంపలు ఇవ్వట్లే..ఇస్తే డబుల్ కిరాయిలు.మొరాలకించి..ఇంటి స్థలాలు ఇవ్వాలి.ట్రాన్స్ జెండర్ల వేడుకోలు.మాకు సొంత జాగల్లేవ్..నిలువడానికి నీడ లేదు...ఉండడానికి అద్దె కొంపలు ఇవ్వట్లేదు..ఇస్తే రెండింతల కిరాయి కావాలంటున్నారు...మా మోరాలకించించి..ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు కేటాయిస్తే..ఏదో ఉండడానికి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని..ధర్మ భిక్షాటనతో బతుకుతాం..ఇది పెద్దపల్లి జిల్లా(రామగుండం)గోదావరిఖని ప్రాంతనికి చెందిన 20 మంది,ట్రాన్స్ జెండర్ల ఆవేదన.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చినట్లే మాకు కూడా ఇండ్ల జాగ ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీతకు వినతిపత్రం అందజేశారు.ధర్మ భిక్షాటన చేసి బతికే మాకు డబ్బులు పెట్టి జాగలు కొనుక్కునే స్థోమత లేదని(గోదావరిఖని)మా ప్రాంతంలో ఉచితంగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తే అందులో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటామని మీడియాకు వెల్లడించారు.అద్దె ఇండ్లలో ఉండడానికి ఇంటి యజమానులు అద్దెకివ్వడం లేదని వాపోయారు.కొందరు డబుల్ కిరాయిలు చెల్లిస్తేనే ఇండ్లిస్తున్నారని ఆ ఆవేదన వ్యక్తంచేశారు.సమాజంలో మాపట్లచిన్న చూపు చూస్తున్నారని,ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయిస్తే గౌరవంగా బతుకుతామని పేర్కోన్నారు.మా పట్ల అధికారులు,ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ట్రాన్స్ జెండర్లు విజ్ఞప్తి చేశారుక.ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు ఈ.కామేశ్వరి,ఎన్.కావ్య,ఆర్.ధరణి దుర్గ,జీ.షైనీ,డి.లక్ష్మీ,నీలిమ,లాస్య,అనూష, అనుశ్రీ,ప్రియమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

 ఇటీవల విడుదలై ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్న సినిమా బలగం సినిమా ఉచిత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న మానవతా విలువలను గుర్తు చేస్తూ మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేపథ్యంలో ఐక్యమత్యమే మహాబలం అని అదే బలగమని నిరూపించిన సినిమా ప్రదర్శన ఉచితంగా చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని సందర్భంగా హనుమంత్ రెడ్డ్ ని అభినందించారు గోలివడ గ్రామ అక్కలు చెల్లెలు అమ్మలు గడప గడప నుండి తండోపతండాలుగా తరలివచ్చి సుమారు 500 మంది సినిమా చూస్తుండగా వారితో పాటే కూర్చొని బలగం సినిమా చూస్తా ఉంటే మీరంతా నా బలగం అని ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన హనుమంత్ రెడ్డి ను మరొకసారి అభినందిస్తున్నారని తెలియజేశారు*

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పలు గ్రామ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గోలివడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి పిలుపుమేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు *కౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి దగ్ధం చేయడం జరిగింది..

ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ & కౌటం సతీష్ మాట్లాడుతూ,దేవుని మాన్యాల భూముల్ని అక్రమంగా కబ్జా చేసిన ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన, అనంతరం తన భూకబ్జాల నుండి మరియు అక్రమ కోళ్ల ఫారాల నిర్వహణల నుండి తప్పించుకొనుటకు బిజెపి పార్టీలో చేరి, నేటి వరకు తనకు బిజెపి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదని అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో కొట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై నిరూపణలేని, అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం మరియు ప్రజల పక్షాన ఖండిస్తున్నామని, రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు భయపడి రాకుండా దాక్కున్న ఈటల రాజేందర్ తాను మాట్లాడిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని ముక్కు నేలకు రాస్తూ, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై కానీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన కానీ ఎవరైనా 

ఏ పార్టీ నాయకులైన ఎటువంటి అసత్య , నిరూపణలేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలు కోరుకుంటున్న సామాజిక బంగారు తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా, గాదం విజయనంద్ తేజస్వి ప్రకాష్ , గట్ల రమేష్ తాళ్లపల్లి యుగేంధర్, నజీముద్దీన్, చుక్కల శ్రీనివాస్, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, వీరబోయిన రవి యాదవ్, యాకుబ్, ధూళికట్ట సతీష్, నజీం, పీక అరుణ్, మెంటం ఉదయ్, కనుకుంట్ల అశోక్, విజయ్, కల్వల రంజిత్, మాదరబోయిన కిరణ్, గంగ మల్లేష్, గాధమ్ శాంతి, ఉప్పరపల్లి లక్ష్మయ్య, పీక శివ, సిరిపురం మహేష్ లతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిణామాల దృశ్య 25.04.2023 రోజు నుండి జరిగే సమ్మెను నిర్వీర్యం చేయాలని యాజమాన్యం ఒక కుట్ర పూరిత వాతావరణ చేయడం ఒక దుర్మార్గమైన చర్య అని మా కంపనీ నాయకులను h.82 యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్లావుల రాము Npdcl కంపనీ కార్య నిర్వహణ అధ్యక్షులు నాగుల తిరుపతిరెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ జిల్లా సెక్రటరీ N. రాజేంద్రప్రసాద్ ధనుష్ నాయకులు యల్లాసురేందర్ రెడ్డి, మోత్కురికోటి,యాకుబ్ పాషా,బాల కృష్ణ రవి చెన్నారావు రామకృష్ణ లను కాన్సెలింగ్ పేరట Npdcl Apts విజిలెన్స్ ci కార్యాలయం వరంగల్ లో పగలంత కూర్చోబెట్టి సుభేదారి పోలీస్ స్టేషన్ కు సాయంత్రంపోలీస్ జీప్ లో తరలించి స్టేషన్లో బై నుండోవర్ కేసులుపెట్టి సమ్మెను నీరుకార్చే విధంగా భయబ్రాంతులకు గురి చేసి 23 తేదీ రాత్రి వొదిలి పెట్టడం ఒక దుర్మమైన చర్య అని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్ పి డి. సి.యల్ కంపనీ కార్యనిర్వహన అధ్యక్షులు నాగుల తిరుపతిరెడ్డి తెలియజేశారు. ఎన్ని కేసులు పెట్టి ఎస్మా ప్రయోగించిన ఈ నెల25తేదీ నుండి జరిగే సమ్మెను ఏదో విధంగా ఎంత నిర్బంధం చేసిన కొనసాగించాలని అన్నారు. జూనియర్ లైన్ మెన్స్ ఆన్ మెన్ గ్యాంగ్ కార్మికులు, ఆర్టిజన్ ఉద్యోగులు ట్రాన్స్కో&జెన్కో కార్మికులు సమ్మెలో పాల్గొనాలని తెలియ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 సెల్ఫోన్ పోయిందా..అయితే టెన్షన్ పడకండి. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి కొన్ని వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా.. ఎక్కడైనా పోగొట్టు కున్నా.. ఎవరైనా దొంగిలించినా.. ఆ బాధ వర్ణణాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైటను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్). సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోలీస్ కమిషనర్ తెలిపారు. సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి?

కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి. www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏ రోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ మొబైల్ అయినా సీఈఐఆర్ విధానం 24 గంటల్లోపు ఫోన్ పని చేయకుండా చేస్తుంది. సెల్ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి అక్/ ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేసి ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. 


సీఈఐఆర్ వెబ్సైట్ పై అవగాహన కార్యక్రమాలు


సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఐఈఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్లో, సర్కిల్ పరిధిలో, డివిజన్ పరిధిలో బ్లూ కోర్ట్స్, పెట్రో కార్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని. సెల్ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈ ఐఆర్ అప్లికేషనన్ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం అవసరమయిన పోస్టర్లు, వీడియోను విడుదల చేసారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జిల్లా  పోలీస్ ప్రధాన కార్యాలయంలో  మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి చిత్రపటానికి పూలమాలలతో ఆదివారం  ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అన్నారు. లింగాయత ధర్మం స్థాపించారని, చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకొని, రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసారన్నారు. బోధనలలోని సమదృష్టితో ఎందరినో ఆకర్షించి, వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వర స్వామి ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి చెందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్ లు  రాజెశ్వేర్ రావు, బండ సతీష్, శ్రీకాంత్, భూపాలపల్లి ఎస్సై  ప్రశాంత్, ఆర్ ఎస్సై  సురేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం పద్మశాలీల అద్వర్యంలో ఏర్పాటుచేసిన సాధనశూరుల ప్రదర్శనకు హాజరైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి పలు ప్రదర్శనలను తిలకించి, వారు జీవనోపాధి కొరకు ఊరురా తిరుగుతూ, ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ ప్రజలను సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ, ప్రజలను ఆనంద పరుస్తూ, వారు చేస్తున్న జీవన పోరాటం నిజంగా చాలా అభినందనీయమని అన్నారు..ఇవ్వాల టెలివిజన్, మొబైల్ వచ్చి వీధుల్లో వీధి ప్రదర్శనల లేక, మరియు ఆదరణ తగ్గిపోతున్న సందర్భంలో కళాప్రదర్శకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని,

కావున అంతరించిపోతున్న ఇలాంటి కళా ప్రదర్శనలు బ్రతికుండాలంటే వారిని ఆదరించాల్సిన అవసరంఎంతైనా ఉందని, అలాగే కళాప్రదర్శన కళాకారులను  అభినంధించి మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఇటువంటి కళలను నమ్మి, ప్రదర్శన ఇచ్చే వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

అలాగే ఈ కళా ప్రదర్శనను ఏర్పాటు చేసిన పద్మశాలీలను అలాగే  ఊరి పెద్ద మనుషులను అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు మరియు కార్పొరేషన్, 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్, తాల్లపెల్లి యుగెంధర్, ఆప్పాసి శ్రీనివాస్, సింగం కిరణ్, ధూళికట్ట సతీష్, కిరణ్ గౌడ్, మాచర్ల ధరంపురి,పల్లికొండ రాజేష్, కునారపు ప్రేమ్ కుమార్,మేడి ఓదెలు,గట్టు మల్లేష్, ధర్మాజీ సాయి, మేడి రాజయ్య, ధర్మాజీ ముని, మేడి శంకర్ నారాయణ,బింగి భూమేష్, ఇందారపు శ్రీకాంత్, అల్లి శంకర్, అశ్రఫ్, యూనుస్, యాకుబ్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా ను వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ బిసి సెల్ జిల్లా కన్వీనర్ మరిదు మురళీకృష్ణ గౌడ్ యూత్ కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ బీసీ సెల్ జిల్లా నాయకులు ఉప్పుల సురేష్ ఇందారం సాయి హరి లు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు భద్రత, సంక్షేమం ఉందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని శారదా నగర్, ఫోర్ ఇంక్లైన్ ఈద్గాల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటూ నిరంతరం వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.*ముస్లిం పిల్లల చదువు కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసారని, 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ నందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేదోడుగా నిలుస్తున్నారన్నారు. నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ళకుగాను షాది ముబారక్ పథకం ద్వారా లక్ష116 రూపాయలను అందిస్తున్నారన్నారు. పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోని సూరా, ఆయత్ లను అనుసరించి రాష్ట్రంలో గొప్ప సంక్షేమ పాలనను అందిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామగుండంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాలను స్థాపించి, నిరుపేద ప్రజల ఆరోగ్యం కోసం శాశ్వత పరిష్కారం చూపానన్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, యువత ఉపాధి కోసం ఐటీ పార్కులను సైతం రామగుండంలో ఏర్పాటయ్యేలా కృషి చేశానన్నారు. నిరుపేద ముస్లింల కోసం ఆఖరి సఫర్ రథాలను కూడా ఇచ్చానన్నారు. జీడీకే -4 ఇంక్లయిన్ వద్ద కబరస్తాన్ కు చుట్టూ ఫెన్సింగ్, బోర్ వెల్ ఏర్పాటు చేశానన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం హిందూ ముస్లిం భాయి భాయీగా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.  

పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసం రోజా లో ఉంటూ ఖురాన్ ను పఠించడంతో వారిలో స్నేహపూర్వక భావన కలుగుతుంది అన్నారు. సమాజం, కుటుంబ శ్రేయస్సు కోసం ముస్లింలు ఉపవాసం ఉండటం అభినందనీయమన్నారు. మౌలి సాబ్, ఇమాంసాబ్ ల సందేశాలతో ముస్లింలలో ఒక ఐక్యత ఉంటుందని, ముస్లిం సోదరులు క్రమశిక్షణకు నిలువుటద్దంగా నిలుస్తారని అన్నారు. ఉన్నతమైన జీవితాన్ని ఎలా పొందాలి, బంధువులు, స్నేహితులు, పెద్దలపట్ల ఎలా మెలగాలనే సమగ్ర సూచనలు ఉంటాయని అన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం ఖురాన్ అవతరించిందని అన్నారు. ఖురాన్ ను పఠించడం ద్వారా స్వార్థపూరిత విధానాలు తొలిగిపోయి.. ఇతరులకు సహాయ సహకారాలు అందించే భావన పెంపొందుతుందన్నారు. సమాజంలో గొప్పగా జీవించాలంటే ఖురాన్ ను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు రఫిక్, నాయకులు జాహెద్ పాషా, మీర్ ఫయాజ్ అలీ, ఖాజామియా, ప్యారేమియా, హకీం, సిరాజ్జుదిన్, జాహెద్ బేగ్, వాహేద్ భేగ్, మున్వర్, హాఫిజుద్దీన్, షరీఫ్, సర్వర్, ఉమర్, ఫరీద్, గఫూర్, అలీ, రబ్బానీ, హమీద్, రియాజ్ భేగ్, జానీ, మునీర్, తాజుద్దీన్, గౌస్ తాజ్, అడప శ్రీనివాస్, వేముల శంకర్, దొమ్మేటి వాసు, కొర్రి ఓదెలు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కర్ణాటకలో రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా విభాగం నుంచి బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టీ సోమారపు లావణ్యను గుల్బర్గా సౌత్ నియోజకవర్గ అభ్యర్థి దత్తాత్రేయ పాటిల్ తరుపున ప్రచారానికి గాను గుల్బర్గి సౌత్ మండల ఇన్చార్జిగా నియమించడం జరిగింది

ఇట్టి అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ

తనకిచ్చిన బాధ్యతను మరియు దత్తాత్రేయ పాటిల్ అభ్యర్థి గెలుపుకు సాయశక్తుల కృషి చేస్తానని వారు ఒక ప్రకటనలో తెలిపారు.