మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు ఏకకాలం లో 2 లక్షల రుణ మాఫీ నిరుద్యోగులకు 3016/- నిరుద్యోగ భృతి కల్పిస్తాం.
పాలకుర్తి మండల విలేకరుల సమావేశంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్.
పాలకుర్తి మండల ప్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామగుండం కాంగ్రెస్ నాయకులు జనక్ ప్రసాద్ మాట్లాడుతూ .రామగుండం నియోజకవర్గం అత్యద్భుత వనరులు నైసర్గికస్వరూపంలో ఇక్కడ 50 సంవత్సరాలకు సరిపోయే బొగ్గు నిల్వలు , నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించగల వనరులు , 250 మెగా వాట్ల ఎన్ టి పి సి విద్యుత్ ,1600 కిలో మీటర్లు పొడవు ప్రవహించే గోదావరి నది , బసంత్ నగర్ విమానాశ్రమం , మద్రాసు టూ న్యూ ఢిల్లీ రైల్వే లైను , హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ జాతీయ రహదారి ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకొని రామగుండం నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చునని కాని ఇక్కడి పాలకుల చేతకాని తనం వల్ల అనుకున్న స్థాయిలో అభివృధ్ధి జరగలేదని .
ఈ సారి అధిష్టాన నిర్ణయం ప్రకారం కార్మిక కుటుంబాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఐ ఎన్ టి యు సి కార్మిక నాయకునిగా కాంగ్రెస్ పార్టీ లో 40 ఏళ్లుగా పని చేసిన అనుభవం తో రామగుండం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని ప్రజలు ఆదరించాలని కోరారు .అలాగే ఇక్కడ అనేక అనుబంధ సంస్థలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని , సింగరేణి సంస్థ సి ఎస్ ఆర్ , డి ఎం ఎఫ్ నిధులు మన ప్రాంతం లో కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు.*అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తె రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ , నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు కల్పిస్తాం అలాగే సొంత స్థలం ఉన్న నిరుపేద ప్రజలకు 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం అని అలాగే అంతార్గాం , పాలకుర్తి మండలాల రైతులకు ప్రజలకు సాగు నీరు, తాగు నీరు వచ్చేలా కృషి చేస్తాం అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులను ప్రజలను కోరారు .రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్ గారి నాయకత్వములో జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంచార్జ్ వికాస్ కుమార్ యాదవ్ ,సెంట్రల్ సెక్రెటరీ ఎట్టం కృష్ణ ,బ్రాంచ్ సెక్రెటరీ మహేష్ బాబు , ఆంజనేయులు , అల్లావుద్దీన్ ,తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: