మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నీడ_పెన్సషన్*ద్వారా *నిస్సహాయ, నిరుపేద పేషంట్ల *#కన్నీళ్లు తుడుస్తున్న *#నీడ_సేవలు అమోఘం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి_స్వామిరెండు కిడ్నీలు చెడిపోయిన పేషెంట్ల కోసం ఏర్పాటుచేసిన నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ రెన్యూవల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి *#జనగామ గ్రామానికి చెందిన నిలి కనకయ్య అనే నిరుపేద డయాలసిస్ పేషెంట్ కు నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ కార్డ్ మరియు ఏప్రిల్ నెల పెన్షన్ 521 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి గారు మాట్లాడుతూ సుమారు 100 మంది పేషెంట్లకు ప్రతి సంవత్సరం నీడ చేస్తున్న సేవలు ఆనిర్వచనీయమనిగత కొన్ని సంవత్సరాలుగా నీడ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే గర్వకారణమని పార్టీలకు అతీతంగా నీడ చేస్తున్న సేవలు ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గారు అన్నారు. నీడ సoస్థకు మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: