మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తమ తోటి కేబుల్ ఆపరేటర్ కూతురు ఆపదలో ఉన్న విషయం తెలుసుకుని 26వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ సేవా గుణాన్ని ఔదార్యాన్ని చాటుకున్నారు ఉమ్మడి రామగుండం మండలం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు. అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామ కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు మానస గత మూడు నెలలుగా నరాలు సంబంధిత వ్యాధితో ఆర్థిక భారంతో వైద్యం చేయించుకోలేక, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ LOC ఇప్పించినప్పటికీ దారి, వసతి ఖర్చులు కూడా లేక ఇబ్బందులు పడుతుండడంతో విషయం తెలుసుకున్న రామగుండం సిటీ కేబుల్ ఎండి, 28 డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులెందర్, ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు, ఇతర జిల్లాలు, హైదరాబాద్ నుండి కేబుల్ ఆపరేటర్లు సైతం స్పందించి అందించిన 26 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రమణయ్య, మానసలకు అందజేశారు. ఈసందర్భంగా సిటీకేబుల్ ఎండి ఇంజపురి పులెందర్, ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సమస్య తెలిసిన వెంటనే సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలపడంతోపాటు, కేబుల్ ఆపరేటర్లు, దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని ఆర్థిక సహాయాన్ని అందించే దాతలు 9700333385 ఫోన్ పే లేదా జిపే ద్వారా అందించాలని కోరారు
Post A Comment: