ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జిల్లా  పోలీస్ ప్రధాన కార్యాలయంలో  మహాత్మా బసవేశ్వర స్వామి జయంతి నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి చిత్రపటానికి పూలమాలలతో ఆదివారం  ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అన్నారు. లింగాయత ధర్మం స్థాపించారని, చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకొని, రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసారన్నారు. బోధనలలోని సమదృష్టితో ఎందరినో ఆకర్షించి, వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వర స్వామి ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి చెందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, ఇన్స్పెక్టర్ లు  రాజెశ్వేర్ రావు, బండ సతీష్, శ్రీకాంత్, భూపాలపల్లి ఎస్సై  ప్రశాంత్, ఆర్ ఎస్సై  సురేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: