మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పద్మశాలీల అద్వర్యంలో ఏర్పాటుచేసిన సాధనశూరుల ప్రదర్శనకు హాజరైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి పలు ప్రదర్శనలను తిలకించి, వారు జీవనోపాధి కొరకు ఊరురా తిరుగుతూ, ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ ప్రజలను సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ, ప్రజలను ఆనంద పరుస్తూ, వారు చేస్తున్న జీవన పోరాటం నిజంగా చాలా అభినందనీయమని అన్నారు..ఇవ్వాల టెలివిజన్, మొబైల్ వచ్చి వీధుల్లో వీధి ప్రదర్శనల లేక, మరియు ఆదరణ తగ్గిపోతున్న సందర్భంలో కళాప్రదర్శకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని,
కావున అంతరించిపోతున్న ఇలాంటి కళా ప్రదర్శనలు బ్రతికుండాలంటే వారిని ఆదరించాల్సిన అవసరంఎంతైనా ఉందని, అలాగే కళాప్రదర్శన కళాకారులను అభినంధించి మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఇటువంటి కళలను నమ్మి, ప్రదర్శన ఇచ్చే వారిని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
అలాగే ఈ కళా ప్రదర్శనను ఏర్పాటు చేసిన పద్మశాలీలను అలాగే ఊరి పెద్ద మనుషులను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు మరియు కార్పొరేషన్, 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్, తాల్లపెల్లి యుగెంధర్, ఆప్పాసి శ్రీనివాస్, సింగం కిరణ్, ధూళికట్ట సతీష్, కిరణ్ గౌడ్, మాచర్ల ధరంపురి,పల్లికొండ రాజేష్, కునారపు ప్రేమ్ కుమార్,మేడి ఓదెలు,గట్టు మల్లేష్, ధర్మాజీ సాయి, మేడి రాజయ్య, ధర్మాజీ ముని, మేడి శంకర్ నారాయణ,బింగి భూమేష్, ఇందారపు శ్రీకాంత్, అల్లి శంకర్, అశ్రఫ్, యూనుస్, యాకుబ్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు...
Post A Comment: