జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పల్గుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వార్డు సభ్యుడు జిల్లాల సంతోష్, సీనియర్ నాయకుడు కోడిపే బుచ్చయ్యలు గురువారం మంథని పట్టణంలోని రాజగృహలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నిట్టూరి రమాదేవి రమేష్, నిట్టూరి రమేష్, కొట్టే రాజయ్య, రాగం వెంకటమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు బర్ల కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం రాజేందర్, మచ్చ రాజేష్, యూత్ నాయకులు కొట్టే సంపత్, పసుల రమేష్, రాగం రజనీకాంత్, కొట్టే మధు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: