జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని చిట్యాల మండలంలో ఇటీవల బీసీకి చెందిన ఆకుతోట కుమారస్వామిపై జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కుమారస్వామి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రవి పటేల్, రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా బీసీలపై అగ్రకులాల వ్యక్తులు భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో, బీసీ సంఘాల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా ప్రత్యేకంగా అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, అలా జరిగితేనే ఆధిపత్య కులాల దౌర్జన్యాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని రవి పటేల్ పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి యథేచ్ఛగా తిరుగుతూ ఇంకా ఎన్ని మందిపై దాడులు చేసిన తరువాత చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. భూకబ్జాలు, మట్టి మాఫియా వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని, వెంటనే అరెస్టు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సాదు మల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, గతంలో కూడా అనేక క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: