జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు జిల్లాలో పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన క్రికెట్ కోచ్ శ్రీనివాస్ కుమారుడు నయన్ ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎల్బీనగర్‌కు చెందిన తొగరి శశాంక్ ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఇక కృష్ణ కాలనీకి చెందిన టీఆర్పీ పార్టీ జిల్లా నాయకుడు అంబాల నరసయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా రవి పటేల్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: