పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                           



                              పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:24:సొంత జాగ...నిలువ నీడ లేదు,అద్దె కొంపలు ఇవ్వట్లే..ఇస్తే డబుల్ కిరాయిలు.మొరాలకించి..ఇంటి స్థలాలు ఇవ్వాలి.ట్రాన్స్ జెండర్ల వేడుకోలు.మాకు సొంత జాగల్లేవ్..నిలువడానికి నీడ లేదు...ఉండడానికి అద్దె కొంపలు ఇవ్వట్లేదు..ఇస్తే రెండింతల కిరాయి కావాలంటున్నారు...మా మోరాలకించించి..ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు కేటాయిస్తే..ఏదో ఉండడానికి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని..ధర్మ భిక్షాటనతో బతుకుతాం..ఇది పెద్దపల్లి జిల్లా(రామగుండం)గోదావరిఖని ప్రాంతనికి చెందిన 20 మంది,ట్రాన్స్ జెండర్ల ఆవేదన.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చినట్లే మాకు కూడా ఇండ్ల జాగ ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీతకు వినతిపత్రం అందజేశారు.ధర్మ భిక్షాటన చేసి బతికే మాకు డబ్బులు పెట్టి జాగలు కొనుక్కునే స్థోమత లేదని(గోదావరిఖని)మా ప్రాంతంలో ఉచితంగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తే అందులో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటామని మీడియాకు వెల్లడించారు.అద్దె ఇండ్లలో ఉండడానికి ఇంటి యజమానులు అద్దెకివ్వడం లేదని వాపోయారు.కొందరు డబుల్ కిరాయిలు చెల్లిస్తేనే ఇండ్లిస్తున్నారని ఆ ఆవేదన వ్యక్తంచేశారు.సమాజంలో మాపట్లచిన్న చూపు చూస్తున్నారని,ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయిస్తే గౌరవంగా బతుకుతామని పేర్కోన్నారు.మా పట్ల అధికారులు,ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ట్రాన్స్ జెండర్లు విజ్ఞప్తి చేశారుక.ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు ఈ.కామేశ్వరి,ఎన్.కావ్య,ఆర్.ధరణి దుర్గ,జీ.షైనీ,డి.లక్ష్మీ,నీలిమ,లాస్య,అనూష, అనుశ్రీ,ప్రియమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: