మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇటీవల విడుదలై ప్రజలందరి గుండెల్లో గూడు కట్టుకున్న సినిమా బలగం సినిమా ఉచిత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అంతరించిపోతున్న మానవతా విలువలను గుర్తు చేస్తూ మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేపథ్యంలో ఐక్యమత్యమే మహాబలం అని అదే బలగమని నిరూపించిన సినిమా ప్రదర్శన ఉచితంగా చేపట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని సందర్భంగా హనుమంత్ రెడ్డ్ ని అభినందించారు గోలివడ గ్రామ అక్కలు చెల్లెలు అమ్మలు గడప గడప నుండి తండోపతండాలుగా తరలివచ్చి సుమారు 500 మంది సినిమా చూస్తుండగా వారితో పాటే కూర్చొని బలగం సినిమా చూస్తా ఉంటే మీరంతా నా బలగం అని ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన హనుమంత్ రెడ్డి ను మరొకసారి అభినందిస్తున్నారని తెలియజేశారు*
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పలు గ్రామ నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గోలివడ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post A Comment: