మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనా రెడ్డి పిలుపుమేరకు స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో యువజన కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు *కౌటం సతీష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి దగ్ధం చేయడం జరిగింది..
ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ & కౌటం సతీష్ మాట్లాడుతూ,దేవుని మాన్యాల భూముల్ని అక్రమంగా కబ్జా చేసిన ఈటల రాజేందర్ ను టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన, అనంతరం తన భూకబ్జాల నుండి మరియు అక్రమ కోళ్ల ఫారాల నిర్వహణల నుండి తప్పించుకొనుటకు బిజెపి పార్టీలో చేరి, నేటి వరకు తనకు బిజెపి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదని అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో కొట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై నిరూపణలేని, అర్ధరహితమైన వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం మరియు ప్రజల పక్షాన ఖండిస్తున్నామని, రేవంత్ రెడ్డి విసిరిన సవాలుకు భయపడి రాకుండా దాక్కున్న ఈటల రాజేందర్ తాను మాట్లాడిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని ముక్కు నేలకు రాస్తూ, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై కానీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన కానీ ఎవరైనా
ఏ పార్టీ నాయకులైన ఎటువంటి అసత్య , నిరూపణలేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలు కోరుకుంటున్న సామాజిక బంగారు తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని,రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు మహంకాళి స్వామి,ఎండి ముస్తఫా, గాదం విజయనంద్ తేజస్వి ప్రకాష్ , గట్ల రమేష్ తాళ్లపల్లి యుగేంధర్, నజీముద్దీన్, చుక్కల శ్రీనివాస్, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, వీరబోయిన రవి యాదవ్, యాకుబ్, ధూళికట్ట సతీష్, నజీం, పీక అరుణ్, మెంటం ఉదయ్, కనుకుంట్ల అశోక్, విజయ్, కల్వల రంజిత్, మాదరబోయిన కిరణ్, గంగ మల్లేష్, గాధమ్ శాంతి, ఉప్పరపల్లి లక్ష్మయ్య, పీక శివ, సిరిపురం మహేష్ లతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: