మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తమ అక్రమ భూదందా కు అడ్డువస్తున్నరని పేదల గుడిసెలు తగుల బెట్టారు,. భూకబ్జా దారులు తమ పద్ధతి మార్చుకొకపోతే ప్రజలచే గుణ పాఠం తప్పదు.సీపీఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి. 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో గత 40రోజులు గా సీపీఎం అధ్వర్యంలో ఇండ్ల స్థలాల పోరాటo చేస్తున్న క్రమంలో భూకబ్జా దారులు తమ అక్రమ ప్లాట్స్ కు నష్టం వాటిల్లుతుందని ప్రారంభం నుండి అడ్డుపడుతున్నారు. ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని విసిగి వేసారి,ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం ప్రారంభించారు.అదే ప్రాంతం లో అక్రమ ప్లాట్స్ దందా దారులు ఉన్న కాస్త భూమిని కబ్జా చేసి లక్షల్లో అర్జించే ప్రణాళికకు అడ్డు వస్తున్నారని గుడిసెలు పీకడం భయపెట్టే విధంగా నిన్న రాత్రి గుడిసెల కు నిప్పు అంటించారు ఇది దుర్మార్గమైన చర్య అని నాయకులు అన్నారు.తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలనుండి తగు గుణ పాఠం తప్పదనీ అన్నా రు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి రామాచారి నాయకులు ఎన్ బిక్షపతి రమణ ఎం.సంపత్,స్వప్న,R మనో హర్,కైలాస్ బాగ్,భవాని,ఎడ్ల పద్మ పాల్గొన్నారు.*
Post A Comment: