మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మంథని: పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో అడవి సోమనపల్లి కి చెందిన పలువురు, బిజెపి రాష్ట్ర నాయకులు, మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో, నేటి బుధవారం రోజు బిజెపి పార్టీలో చేరారు. వీరికి సునీల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన, దేశ అభివృద్ధిని చూసి, యువ నాయకుడు సునీల్ రెడ్డితో కలిసి పార్టీ కోసం పని చేస్తూ, మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలనే లక్ష్యం తోనే బిజెపి పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. అనంతరం ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజలు విసుగుచెంది మార్పు కోరుకుంటున్నారని, 40 సంవత్సరాలు కాంగ్రెస్, 9 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలించిన ఈ మంథని ప్రాంతం అంతా అవినీతిమయమే తప్ప, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, తెల్లారి లేస్తే ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు విమర్శనస్త్రాలు, తిట్టు కోవడం తప్ప, మంథని కి చేసిన అభివృద్ధి ఏమిటి.? ప్రజలు బిజెపి పార్టీని ఆదరిస్తున్నారని, కొద్ది నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మంథనితో పాటు రాష్ట్రంలో కూడా బిజెపి గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మండల ఇంచార్జ్ వీరబోయిన రాజేందర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లిక్,చెరుకుతోట సురేష్,బూడిద తిరుపతి,ఎల్క సదానందం, కనుకుంట్ల సుధాకర్,కుర్మ శేఖర్,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: