మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పత్రిక ప్రకటన ఎన్టీపీసీ జ్యోతి నగర్ హమాలి కార్మికుల చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల. హమాలి కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే దర్ణలో హమాలి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం రామాచారి కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హమాలి కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. భవన నిర్మాణ కార్మికుల లాగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 55స.లు దాటిన హమాలీలకు రూ.6000/- పెన్సన్ అమలుచేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు వర్తింప చేయాలని ఐ ఎల్ ఓ నిర్ణయం ప్రకారం 50కి.బరువు కలిగిన బస్తాలు రాకూడదని తదితర డిమాండ్లతో ఏప్రిల్ 29న హైదరా బాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా లో బజారు,మార్కెట్ ,ఐకేపీ తదితర రకాల హమాలి కార్మికులు పాల్గొని విజయ వంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి హమాలీ సంఘం నాయకులు అంజయ్య కొమరయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: