మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం, మరియు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ల ఆధ్వర్యంలో అంతర్గాం మండలంలో ఏ క్లాస్ పూర్, వీసంపేట్ పొట్యాల ఆకే నపల్లి సోమన్ పల్లి గ్రామాలలో ఐకెపి సెంటర్లను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోకుండా నట్టేట ముంచుతున్నాయన్నారు వాతావరణ కేంద్రాలు బారీ వర్షాలు ఉన్నాయని ముందుగానే హెచ్చరిక చేస్తున పట్టించుకోవడం లేదు

 15 రోజులకు పైగా ఐకెపి సెంటర్లకు వరి ధాన్యం వచ్చి నిలువలు ఉండడంతో అకాల వర్షం రావడం వలన వరి పూర్తిగా తడిసి నీళ్లల్లో ముద్దగా మారి మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడింది అయినా నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు ప్రారంభించిన ఒక లారీ కూడా కాంట పెట్టి బయటకు పంపలేదు అప్పులు సప్పులు చేసి అనేక రోగాల బారి నుండి వరి పంటను కాపాడుకొని తీరా చేతికి వచ్చే సమయానికి వర్షం పాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు ఉరిమిన మెరిసిన కంటిమీద కునుక్కు లేకుండా కల్లాల మీద పండుకొని వర్షంలో తడుసుకుంట కూడా వరి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు కానీ అధికారులు ప్రభుత్వం మాత్రం నేటికీ రైతుల దగ్గరకొచ్చి వరి పొలాల దగ్గరికి వచ్చి భరోసానిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని మిల్లర్లు ఆడుతున్న నాటకాలకు అడ్డుకట్ట వేయాలని ఐకెపి సెంటర్లకు వచ్చిన వడ్లను వచ్చినట్టే కాంటపెట్టుకొని తీసుకుపోవాలని మద్దతు ధర ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరియు పూర్తిగా వర్షములో మునిగిన వరి రైతుకు వివిధ పంటలు పండించే రైతులకు నష్టపరిహారం అధికారులు అం చన వేసి కాలయాపన చేయకుండా తక్షణమే రైతుల కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం బ్యాంకు రుణాలు కూడా నేటికీ మాపి కాలేదు వాటిని తక్షణమే మాఫీ చేయాలని కోరుతున్నాం

ఈ కార్యక్రమంలో ప్రజాపంథా డివిజన్ నాయకులు టీగుట్ల రాములు శ్రీనివాస్ రాజయ్య సాగర్ లచ్చయ్య సుధాకర్ మల్లయ్య రవి తిరుపతి సత్తయ్య లింగమూర్తి పోశయ్య రాజేశం లతోపాటు రైతులు పాల్గొన్నారు,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: