మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఈదురు గాలులు వచ్చి బట్టారి రవి. ఇల్లు కరెంట్ షాట్ సర్కూట్ తో ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇంట్లోనే వస్తువులు బియ్యం నిత్యవసరకులు మరియు బట్టలు పూర్తిగా మంటల్లో కాలిపోయి నట్లు స్థానికులు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా మంటల్లో దగ్ధం అయిన ఇంటి కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుపగానే వెంటనే స్పందించి సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కరరావు గారి సహకారంతో బాధిత కుటుంబానికి బుధవారం రోజున 25 కిలో బియ్యం ఫౌండేషన్ సభ్యులు నిమ్మరాజుల రవి ద్వారా. బట్టారి రవి కుటుంబానికి అందజేసినట్లు మడిపెల్లి మల్లేష్ తెలిపారు అనంతరం ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి నిమ్మ రాజుల రవి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఏ పేదవారికి ఆపద వచ్చిన ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు ఈనాటి దాత చింతల భాస్కరరావు కు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరోనా కష్టాకాలంలో కూడా మా గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చి వండుకోలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు 14 రోజులపాటు బాధిత కుటుంబాలకు భోజనాలు అందజేశారని అలాగే మా గ్రామం లోని ఉపాధి హామీ కూలీలకు మాస్క్ లను కూడా పంపించి మా గ్రామ ప్రజలను ఆదుకున్నారని నిమ్మ రాజుల రవి గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో నుంచి ఇప్పటివరకు అలుపెరుగని సేవలందిస్తున్న సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నకు మరియు నాతోటి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా మరొక్కసారి మా లింగాపూర్ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని
నిమ్మ రాజుల రవి తెలిపారు ఈ కార్యక్రమంలో పులి శ్రీనివాస్. కన్నం మోహన్. ఆర్కుటి తిరుపతి. కనుమల్ల నర్సయ్య. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: