మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని పట్టణంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డ నేతకానిలకు సంక్షేమ భవనం నిర్మించాలని, నేత వృత్తి ధ్వంసమై ఎటువంటి ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేతకాని దళితులకు నూటికి నూరు శాతం దళిత బంధు అమలు చేయాలని టిఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కి సమత సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకానిలు చేతి వృత్తి ధ్వంసమై ఎటువంటి ఉపాధి లేక ఆర్థికంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆవేదన చెందారు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యాదవులకు గొర్రెలు మత్స్యకారులకు చేపలు ఇలా వారి వారి కులాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లే నేతకాని దళితులకు దళిత బంధు పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా అందరికీ సంక్షేమ భవనాలు నిర్మించినట్లు గోదావరిఖని పట్టణ కేంద్రంలో నేతకాని సంక్షేమ భవనం నిర్మించాలని కోరారు. అందుకు టిఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే అమలు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు...
Post A Comment: