మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం లో, బుధవారం రోజున జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో, పి నారాయణ బాబు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి చేత, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది.ఈ క్లినిక్ లో రైతు సమస్యల పరిష్కారం కోసం, భూ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నకిలీ విత్తనాలు,పురుగుమందుల సమస్యలు,అధిక ధరలకు విక్రయాలు, పంట నష్టం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, మార్కెట్లో పంట అమ్మడానికి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు న్యాయపరమైన సూచనలు సలహాలు ఉచితంగా పొందవచ్చని తెలియజేశారు. ఈ క్లినిక్ కోసం పారా లీగల్ వాలెంటర్స్ ని నియమించడం జరుగుతుంది. వారు రైతుల యొక్క సమస్యను దరఖాస్తు రూపంలో సేకరించి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె జయరాం రెడ్డి సీనియర్ సివిల్ జడ్జి భూపాలపల్లి, ఎన్. రామ్చంద్ర రావు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, ఎం.విజయ భాస్కర్ జిల్లా వ్యవసాయ అధికారి, ఏదులాపురం శ్రీనివాస్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ భూపాలపల్లి, పగడాల ఆనందరావు జనరల్ సెక్రెటరీ బార్ అసోసియేషన్, ఆర్ కె శ్రీనివాసరాజు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కిరణ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహాదేవపూర్, బాన్సోడ రాణి భాయ్ ఎంపీపీ, గుడాల అరుణ జెడ్పిటిసి, బండం లక్ష్మారెడ్డి రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్, శ్రీపతి బాబు సర్పంచ్, రాజ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ప్రభావతి మండల వ్యవసాయ అధికారి, సిహెచ్ ధర్మేందర్ వ్యవసాయ విస్తరణ అధికారి, వివిధ శాఖ అధికారులు, మండల అడ్వకేట్లు, పాత్రికేయులు, రైతులు పాల్గొన్నారు.
Post A Comment: