మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలంలోని, ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
గురువారం ఉదయం
చెట్ పల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు. నిందితుల నుండి ఒక కత్తి, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన మహేష్ తో యువతికి కొన్నాళ్ల క్రితం ప్రేమ వ్యవహారం నడిచింది. ఏడాది క్రితం యువతికి మరో యువకుడితో వివాహం జరిగింది. సోషల్ మీడియాలో యువతి ప్రైవేటు ఫోటోలు, వీడియోలను మహేష్ వైరల్ చేసాడని చెప్పారు. వీడియోలు బహిర్గతం కావడంతో మనస్తాపంతో శృతి భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. భర్త ఆత్మహత్య తర్వాత యువతి పుట్టింటికి వచ్చి ఉంటోంది. మళ్లీ కొన్నాళ్లుగా యువతిని మహేష్ వేధిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు మహేష్ ను బండరాళ్లతో కొట్టి, గొంతు కోసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హత్యకు పాల్పడిన పెద్దపల్లి కనకయ్య, పెద్దపల్లి పద్మ, పెద్దపల్లి సాయి, పెద్దపల్లి శ్రుతి, పెద్దపల్లి శ్వేతను అరెస్ట్ చేసినట్లు ఎసిపి నరేందర్ వెల్లడించారు.
Post A Comment: