మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లింలకు భద్రత, సంక్షేమం ఉందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని శారదా నగర్, ఫోర్ ఇంక్లైన్ ఈద్గాల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటూ నిరంతరం వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.*ముస్లిం పిల్లల చదువు కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసారని, 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ నందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేదోడుగా నిలుస్తున్నారన్నారు. నిరుపేద ముస్లిం యువతుల పెళ్లిళ్ళకుగాను షాది ముబారక్ పథకం ద్వారా లక్ష116 రూపాయలను అందిస్తున్నారన్నారు. పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోని సూరా, ఆయత్ లను అనుసరించి రాష్ట్రంలో గొప్ప సంక్షేమ పాలనను అందిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామగుండంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాలను స్థాపించి, నిరుపేద ప్రజల ఆరోగ్యం కోసం శాశ్వత పరిష్కారం చూపానన్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, యువత ఉపాధి కోసం ఐటీ పార్కులను సైతం రామగుండంలో ఏర్పాటయ్యేలా కృషి చేశానన్నారు. నిరుపేద ముస్లింల కోసం ఆఖరి సఫర్ రథాలను కూడా ఇచ్చానన్నారు. జీడీకే -4 ఇంక్లయిన్ వద్ద కబరస్తాన్ కు చుట్టూ ఫెన్సింగ్, బోర్ వెల్ ఏర్పాటు చేశానన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం హిందూ ముస్లిం భాయి భాయీగా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసం రోజా లో ఉంటూ ఖురాన్ ను పఠించడంతో వారిలో స్నేహపూర్వక భావన కలుగుతుంది అన్నారు. సమాజం, కుటుంబ శ్రేయస్సు కోసం ముస్లింలు ఉపవాసం ఉండటం అభినందనీయమన్నారు. మౌలి సాబ్, ఇమాంసాబ్ ల సందేశాలతో ముస్లింలలో ఒక ఐక్యత ఉంటుందని, ముస్లిం సోదరులు క్రమశిక్షణకు నిలువుటద్దంగా నిలుస్తారని అన్నారు. ఉన్నతమైన జీవితాన్ని ఎలా పొందాలి, బంధువులు, స్నేహితులు, పెద్దలపట్ల ఎలా మెలగాలనే సమగ్ర సూచనలు ఉంటాయని అన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం ఖురాన్ అవతరించిందని అన్నారు. ఖురాన్ ను పఠించడం ద్వారా స్వార్థపూరిత విధానాలు తొలిగిపోయి.. ఇతరులకు సహాయ సహకారాలు అందించే భావన పెంపొందుతుందన్నారు. సమాజంలో గొప్పగా జీవించాలంటే ఖురాన్ ను అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు రఫిక్, నాయకులు జాహెద్ పాషా, మీర్ ఫయాజ్ అలీ, ఖాజామియా, ప్యారేమియా, హకీం, సిరాజ్జుదిన్, జాహెద్ బేగ్, వాహేద్ భేగ్, మున్వర్, హాఫిజుద్దీన్, షరీఫ్, సర్వర్, ఉమర్, ఫరీద్, గఫూర్, అలీ, రబ్బానీ, హమీద్, రియాజ్ భేగ్, జానీ, మునీర్, తాజుద్దీన్, గౌస్ తాజ్, అడప శ్రీనివాస్, వేముల శంకర్, దొమ్మేటి వాసు, కొర్రి ఓదెలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: