మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
వేల్పుల కుమారస్వామి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్.టి.పి.సి.లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది.దీకికి వేల్పుల కుమారస్వామి హాజరై మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మార్చి 18 నుండి సిపిఎం అధ్వర్యంలో 4 కేంద్రాల్లో భూ పోరాటం కొనసాగుతుందని అన్నారు.సుమారు రెండు వేల మంది తో మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించి 6050 దరఖాస్తులు అందివ్వడం జరిగింది.ఈ క్రమంలో 2వ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ కాలనీ,పి.కే.రామయ్య కాలనీ లల్లో కూడా భూ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
39 రోజుల నుండి పేదలు భూ పోరాటం చేస్తూ నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే స్థానిక బి.అర్.ఎస్.పార్టీ కార్పొరేటర్ రమణా రెడ్డి తన అనుచరులుగా చెప్పుకుంటూ తిరుగుతున్న సుద్దాల గోపాల్, సౌజన్య, వసంత, కవితారెడ్డి, శ్రీను,దుర్గ తదితరులు కలిసి గుడిసెలు పీకేసారని అన్నారు. పేద ప్రజలకు పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న రమణా రెడ్డి గుడిసెలు తీసేయించడం ఎంటని ప్రశ్నించారు.
ఇప్పటికే ఇందిరమ్మ కాలనీ లో వీరు సుమారు 3 వందల ప్లాట్లు కబ్జా చేశారని అన్నారు.రెవెన్యూ స్టాంప్ లు తయారు చేసి నకిలీ పట్టాలు సృష్టించి ఒక ప్లాట్ నలుగురికి అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అన్నారు.అసలు ప్లాటు దారుల వచ్చి ఇది నా ప్లాటు అంటే వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అన్నారు.పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుదామంటే పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా భయపడుతున్నారు అంటే
రమణా రెడ్డి ఎంత భయ బ్రంతులకు గురిచేస్తున్నడో అర్దం చేసుకోవాలని అన్నారు.సిపిఎం పార్టీ చేస్తున్న భూ పోరాటాలకు భయపడి తనకు రావాల్సిన ఆదాయం ఎక్కడ పోతుందో అనే భయంతోనే భూ పోరాటాలను అడ్డుకుంటున్నారని అన్నారు.సిపిఎం లేకపోతే తను ఇందిరమ్మ కాలనీ లో ఎతెచ్చగా భూ కబ్జా చేసి లక్షలు సంపాదించవచ్చని భావిస్తున్నారని అన్నారు. రమణా రెడ్డి మరియు అతని అనుచరల ఆటలు సాగనివ్వమని అన్నారు.ఇప్పటి కైనా రమణా రెడ్డి అతని అనుచరులు తమ తప్పుడు విదానాలను మానుకోకపోతే గుడిసెలు వేసుకున్న పేదలతో రమణా రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.తహశీల్దారు నకిలీ పట్టాలు ఉన్నాయని వాటిని గుర్తించడం,తప్పుడు పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికైనా ప్రకటించడం సంతోషం అన్నారు.
పేదల గుడిసెలు పీకేసిన రమణా రెడ్డి మరియు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.రామాచారి.జిల్లా కమిటీ సభ్యులు ఎన్.శంకర్,నాయకులు బిక్షపతి,లక్ష్మారెడ్డి,ఉపేందర్,రమణ,మల్లేష్,కనుకయ్యా,దేవి,భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: