మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం లోని తబిత ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి లగిశెట్టి చంద్రమౌళి కుటుంబ సభ్యులు నూతన వస్త్రాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి మాట్లాడుతూ, వీరేందర్ తన కూతురు తబితను కోల్పోయినా ఎందరో అనాధలను తన పిల్లలుగా పెంచుతున్న మానవతామూర్తి ,స్పూర్తి ప్రదాతలని కొనియాడారు.ఎవ్వరూ లేని అనాధలైన ఆ పిల్లలకు తన వంతు బాధ్యతగా వారందరికి దాదాపు 200 డ్రెస్ లను అందించడం చంద్రమౌళి సహృదయంకు నిదర్శనమని, సహకరించిన కుటుంబ సభ్యులను అభినందించారు . తల్లితండ్రులు లేని ఇ లాంటి వారికి ప్రతి ఒక్కరం మన పిల్లలుగా భావించి తమ వంతుగా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సదాశయ బాద్యులు నారాయణ, లింగమూర్తి, చంద్రమౌళి పాల్గొన్నారు,.ఇట్టి సమాజహితమైన కార్యక్రమం నిర్వహించిన . చంద్ర మౌళి కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సలహాదారులు నూక రమేష్, సాన రామకృష్ణ రెడ్డి,మారెల్లి రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.తబిత ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ చంద్రమౌళి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: