రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమునిపట్నం కు చెందిన సార్ల అంజయ్య ట్రాలీ నడుపుతూ భార్య ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న అంజయ్య ఆదివారం రోజున.మంచిర్యాల కు వెళుతుండగా ఇందారం ప్లైఓవర్ బ్రడ్జి దగ్గర అంజయ్య నడుపుతున్న ఆటో ట్రాలీ వెనుకాల కారు డీ కొట్టడంతో అంజయ్య చెయ్యి ప్రమాదం స్థలంలో తెగి పడడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న అంజయ్య ను మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అంజయ్య ను పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ హాస్పిటల్ కు వెళ్లి బాధితుని పరామర్శించి ధైర్యం చెప్పి మెరుగైన చికిత్స అందించాలని యశోద డాక్టర్ల తో మాట్లాడి హాస్పిటల్ బిల్లు కూడా తగ్గించాలని యశోద హాస్పిటల్ వారికి చూసించారు అనంతరం అంజయ్య కుటుంబ సభ్యులకు నేను మీకు అండగా ఉన్నాను మీరు ఆదర్యా పడద్దు అని బాధితులకు భరోసా ఇచ్చారు.రామగుండం నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ లో ఏ పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ ఉన్నా వెళ్లి చూసి ఔదార్యం చాటుతూ బాధితులకు అండగా ఉంటారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. చికిత్స పొందుతున్న బాధితున్నీ పరామర్శించిన వారిలో సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అనుముల వేణు మాధవ్ పాల్గొన్నారు
Post A Comment: