మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్ సి సి డబ్ల్యూ యు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గోదావరిఖనిలో పవర్ హౌస్ జోన్ లో గేట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో మే డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. *ఈ సందర్భంగా పాల్గొన్న ఐ ఎఫ్ టి యు నాయకులు తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మే డే స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. 8 గంటల పని ధినం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాన్ని అవమానపరుస్తున్నది. దానిలో భాగంగానే 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెడుతుంది. కార్మిక చట్టాలను సవరించి కార్మిక హక్కులపై దాడిని కొనసాగిస్తున్నది. కనీస వేతనాల జీవోలను సైతం సవరించకుండా ఏండ్ల తరబడి పెండింగ్లో పెడుతుంది. మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాలే. చికాగో అమరుల స్ఫూర్తితో మేడే వారసత్వాన్ని కొనసాగించాలని, కనీస వేతనాల అమలుకై పోరాడాలని పిలుపునిచ్చారు మే ఒకటో తేదీన వాడవాడలా కార్మిక క్షేత్రంలో ఎర్రజెండాలు ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. *ఈ కార్యక్రమంలోఎస్ సి సి డబ్ల్యూయు ఐఎఫ్టియు నాయకులు డి రాంబాబు, బొంత హరి, సిహెచ్ రాజేశ్వరి, కే లక్ష్మి, బి సంపత్, శేఖర్, మమత , లక్ష్మి, స్వరూప, రాజు, పోచమ్మ, మీనా, కొమురయ్య, మంగ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: