మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వ *మస్త్య శాఖ సంచాలకులు "లచ్చిరాజం భూక్య కు వినతి పత్రం అందజేసిన గంగపుత్రులు
రామగుండం గంగపుత్రులు పలు సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ కమిషనర్ హైదరాబాద్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది.
వినతి పత్రంలో పొందుపరిచిన విషయాలు ఏమనగా
1. చాలా రోజుల తరబడి పెండింగ్లో ఉన్న సొసైటీలను వెంటనే పూర్తి చేయాలని.
2. ఇటీవల సంభవించిన వరదల్లో గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టుల్లో చేపల వేట కోసం వేసిన వలలు, తెప్పెలు, ఐస్ బాక్స్ లు కొట్టుకొని పోయినవి కావున స్కీం లాంటిది త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే సబ్సిడీ పై వలలు వస్తే ఉపయోగకరంగా ఉంటుందని.
3. ఇప్పుడు ఉన్న జీవన విధానాల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న సందర్భంలో షుగర్ గాని బీపీ గాని పలు హృద్రోక సమస్యలతో గోదావరిలో చేపల వేటకు వెళ్ళిన వారు కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి చేరుకొని అందులోనే పడి మృతి చెందుతున్న సందర్భంలో వారికి లైవ్ జాకెట్లు పంపిణీ చేయడం వల్ల వారి కి ఎలాంటి ప్రాణ హనీ ఉండదని తెలియజేశారు.
4. సొసైటీ సభ్యులు వృత్తిరీత్యా అకాల మరణం చెందినట్లయితే వారికి అందే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ని త్వరగా పూర్తి చేసి నెలరోజుల లోపే వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయాలని తెలియజేశారు.
5. పేద మహిళలకు ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చే విధంగా మహిళా మార్కెట్ సొసైటీని ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలదొక్కునే వెసులుబాటును కల్పించాలని తెలియజేశారు.
డీసీసీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సూచన మేరకు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మత్య శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ప్రేమ్ కుమార్ రవి
Post A Comment: