మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పరిధిలోని సోమనపల్లి గ్రామానికి చెందిన ఐట్ల వేణు ప్రైవేట్ జాబ్ చేస్తూ భార్య, ఒక్క అబ్బాయి తో జీవనం సాగిస్తున్న,
ఆకెనపల్లి బస్టాండ్ నుండి గ్రామం లోపలికి వస్తుండగా వాటర్ ట్యాంక్ దగ్గర మూలమలుపు వద్ద బ్రేకులు అదుపుతప్పి గేటు వాల్ కుండీలో పడి తలకు తీవ్రమైన గాయాలు అయి, ప్రమాదం స్థలంలో పడడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వేణు మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించగా,
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఐట్ల వేణును పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు #రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ హాస్పిటల్ కు వెళ్లి బాధితుడిని పరామర్శించి,
ధైర్యం చెప్పి, మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ల తో మాట్లాడి మరియు
హాస్పిటల్ బిల్లులను కూడా తగ్గించాలని నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు..
అనంతరం వేణు కుటుంబ సభ్యులకు నేను మీకు అండగా ఉన్నాను మీరు అధైర్య పడద్దని బాధితులకు భరోసా కల్పించారు..
Post A Comment: