March 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

శుక్రవారం ఐడిఓసి  లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం జయంతి,బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ముందస్తు ఏర్పాట్ల పై డిఆర్ఓ  వాసుచంద్ర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, మరియు ఎస్సీ, ఎస్టీ  కులాల కమిటీ అధ్యక్షులు, అభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రాం జయంతి 14 వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలి అని అధికారులను  ఆదేశించారు.  మహనీయుల గురించి గ్రామ స్థాయి, మండల,జిల్లా స్థాయి వరకు కుల వివక్షలు లేకుండా చేయుటకై  ఈ మహనీయుల చరిత్రలను అధ్యయనం చేయడంలో  ఉన్నత విద్యా స్థాయి పిల్లలకు వ్యాసరచన పోటీలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించలని అన్నారు . మహనీయులు జయంతి వేడుకులకు  జగజీవన్  రామ్,అంబేద్కర్ అభిమానులు, జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వేడుకలకు హాజరైయ్యే ప్రజలకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సభా ప్రాంగణంలో త్రాగు నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు,  ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి ఉత్సావాన్ని అత్యంత వైభవంగా జరిగేలా జిల్లాలోని బాబు జగజీవన్ రామ్,అంబేద్కర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ  వాసుచంద్ర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, దళిత నేతలు  రవి, ప్రవీన్ కుమర్,  చుంచు రాజేందర్,  G. శ్రీనివాస్ తదితర కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో వచ్చే వేసవిలో నిర్వహించనున్న క్రీడా శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్  మహ్మద్ అజిజ్ ఖాన్,జిల్లా కలెక్టర్ కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయ  సమావేశ మందిరంలో వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాల్గవ తరగతి నుండి ఇంటర్ స్థాయి విద్యార్థులకు 15 క్రీడాంశాలలో నిష్ణాతులైన ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ ఇవ్వన్నట్లు తెలిపారు. వేసవిలో విద్యార్థులు అకాడమిక్ అంశాలకు దూరంగా ఉంటూ సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృధా చేసుకుంటారని చెప్పారు. నెల రోజులపాటు విద్యార్థులని క్రీడల పట్ల ఆకర్షితుల్ని చేసేందుకు సరైన సమయం అన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని క్రీడాశిక్షణకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో సైతం ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజిజ్ ఖాన్ మాట్లాడుతూ సుదీర్ఘ క్రీడా చరిత్ర కలిగిన హనుమకొండలో క్రీడా సంబంధిత బాధ్యులందరిచే జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్ చొరవతో  వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయడంలో అన్ని క్రీడా సంఘాలు ముందుంటాయన్నారు. నగరంలోని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏదో ఒక క్రీడాంశంలో శిక్షణ పొందేలా  తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరము- 2023 కొరకు ఈ  క్రింద సూచించబడిన ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరని అన్నారు.

9441086556, 9849276234, 9949271564, 

9010002889, 7386469301, 9182854789,9392015280,8008469219.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి జి.అశోక్ కుమార్, డిఇఓ అబ్దుల్ హై,  జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు బి.కైలాసం యాదవ్, కె.సారంగపాణి, పి.రమేష్ రెడ్డి, ఎండీ కరీం, లిల్లి ఫ్లోరెన్స్, అన్ని శాఖల జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడా శాఖ కోచ్ లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్న వారిని సి.పి.ఆర్ నిర్వహించడం ద్వారా  రక్షించవచ్చని, ఆ దిశగా ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ పై అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా  భవేశ్ మిశ్రా అన్నారు. శుక్రవారం  ఇల్లందు క్లబ్  సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సిపిఆర్ ట్రైనింగ్ కార్డియో పల్మనరీ రిసోసియేషన్ శిక్షణ ప్రజా ప్రతినిధులకు, వైద్య సిబ్బందికి,  అధికారులకు ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ అనంతరం చాలామంది గుండె నొప్పి కారణంగా మృతి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సిపిఆర్ ప్రక్రియ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయినప్పుడు వారికి సి పి ఆర్ ,ఏ ఈ డి చేసినట్లయితే  వారిని ప్రమాదం నుండి కాపాడగలుగుతామని అన్నారు. ఇది లేకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయని, అందువలన సి.పి.ఆర్ ట్రైనింగ్ సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ప్రథమ చికిత్స అందించాలన్నారు. దీనికై ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడ వచ్చని అన్నారు.  ప్రతి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులకు అధికారులకు శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో  ప్రత్యేక శిక్షణ పొందిన ప్రోగ్రాం ఆఫీసర్ డా. అన్వేషిని, డాక్టర్  ప్రమోద్ శిక్షణ ఇవ్వడం జరిగింది. సి పి ఆర్ కార్డియో పల్మనరీ రీసోసియేషన్ అనేది సడన్ కార్డియాక్ అరెస్టు, స్పందనలో కీలకమైనదని, గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు.

 సిపిఆర్ అనేది అత్యవసర వైద్య సేవలు వచ్చేవరకు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడే రక్షక సాంకేతికత  లక్ష్యం చాతి నొక్కడం మరియు రెస్కు శ్వాసలను అందించడం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని అందిస్తుందని  ఇది మెదడు మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుందని, నష్ట తీవ్రతను తగ్గిస్తుందని, బ్రతికే అవకాశాలను పెంచుతుందని తెలిపారు. జీవించి ఉన్న లక్షణాలు కనిపించని వ్యక్తులపై సిపిఆర్ చేయబడుతుంది. జీవించి ఉన్న లక్షణాలు కనిపించని బాధితుడిని సిపిఆర్ చేస్తే వారి జీవితాన్ని రక్షించగలం. జీవించి ఉన్న సంకేతాలు లేవని  నిర్ధారించిన తర్వాత మీరు చాతి నొక్కడం ద్వారా గుండె నుండి శరీర భాగాలకు రక్తప్రసరణ అందించడం, హెడ్ టిల్ట్ చిన్ను లిఫ్ట్ నైపుణ్యం ద్వారా వాయు మార్గాన్ని తెరవడం శ్వాస కోసం తనిఖీ చేయడం, కృత్రిమ శ్వాసను కల్పించడం, సిపిఆర్ విషయంలో 30 సార్లు చాతినొక్కడం మరియు రెండు వెంటిలేషన్ తో చేయడం జరుగుతుందని శిక్షకులకు పవర్ ప్లాంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ  శిక్షణ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ. డా. శ్రీరామ్, మున్సిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దు,  చిట్యాల , రేగొండ జెడ్పిటిసిలు  సాగర్, విజయ, మల్హార్రావు , ఎంపీపీ మల్లార్ రావు ,జిల్లా అధికారులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎం.పి.డి.ఓ. భూపాలపల్లి  ఇతర శాఖల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో భూపాలపల్లి  హెడ్ కానిస్టేబుల్ ఉచ్చిడి రాజు స్వచ్ఛంద పదవి విరమణ చేయగా ఎస్పి సురేందర్ రెడ్డి  అదనపు ఎస్పి వి. శ్రీనివాసులుతో  కలిసి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన రాజుకు  వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవి విరమణ పొందిన రాజును సత్కరించి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. పోలీసు శాఖలో రాజు   25 సంవత్సరాలు పూర్తి చేసుకుని, హెడ్ కానిస్టేబుల్ గా  పదోన్నతి పొంది,  పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి   మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి,  ఎలాంటి రిమార్క్  లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం అన్నారు. ప్రజా  రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లేక చేయక పోలీసులు పనిచేస్తారని అన్నారు.  ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పక ఉంటుందని రాజు , పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పి పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా రిటైర్డ్ పోలీసు ఉద్యోగులకు ఏలాంటి అవసరం వచ్చినా,  పోలీసు శాఖ సహాయ సహకారాలు ఉంటాయని ఎస్పి  భరోసా ఇచ్చారు.  అలాగే రాజు కు ప్రభుత్యం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని, డి.పి ఓ అధికారులను ఎస్పి  ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి వి.  శ్రీనివాసులు, ఏఓ అయూబ్ ఖాన్, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా,  ఆర్ఐ బండ సతీష్, సీసీ ఫసియోద్దిన్, పదవి విరమణ పొందిన హెడ్ కానిస్తేబుల్ కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ లో JBCCI శాశ్వత మెంబర్ గా నియమితులైన INTUC సెక్రెటరీ జనరల్  జనక్ ప్రసాద్ ను సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ మరియు RG-1 బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి పొలు మహేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి  , జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్  సెంట్రల్ సెక్రెటరీ ఎట్టం కృష్ణ , మరియు శ్రీకాంత్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం వివిధ రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను  కలిసిన పూసాల తిరుపతి                  కార్మికుల సమస్యలు వారికి చట్టపరంగా రావలసిన కనీస వేతనాలు మరియు న్యాయపరమైన హక్కులు సాధించుట కేవలం ఐఎన్టియుసి తోనే సాధ్యం అవుతుందని డాక్టర్ జి సంజీవరెడ్డి  నాయకత్వంలో  అనేక హక్కులు మనం సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా పూసాల తిరుపతి తెలిపారు. *అందరం కలిసి ఒక తాటిపై ఉండి మన హక్కులు సాధించుకునే విధంగా పోరాటా లకు సిద్ధం అయ్యి ఉద్యమించక తప్పదని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు *మీ న్యాయమైన డిమాండ్లను సాధించుట కొరకు ఐఎన్టియుసి అన్నివేళలా మీకు అండగా ఉంటుందని తెలిపారు  ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళా కార్మిక సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మంథని శాసనసభ్యులు మాజీ మంత్రి దుద్దిళ్ల *శ్రీధర్ బాబు  సూచనలతో ,రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  నేతృత్వంలో మరియు NSUI రాష్ట్ర అధ్యక్షుడు *బల్మూరి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *SY థామస్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో NSUI జిల్లా కార్యదర్శి మేంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ వర్గం పరిధి లో పరీక్షలకు హాజరు కానున్న  ప్రభుత్వ ఉన్నత పాఠశాల కి సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్ష సమయం లో ఎంతగానో ఉపయోగపడేటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు  ఉచితంగా అందించడం జరిగింది .ఈ సందర్భంగా NSUI నాయకులు మాట్లాడుతూ... పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు.

 1.ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని, 9:35 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విద్యార్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని విద్యాశాఖ వెల్లడించారు . కాబట్టి సమయాన్ని పాటించి అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఉండాలని సూచించారు

2.ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎవరన్నా అధిక ఫీజులు అడుగుతూ ఫీజు కడితేనే  హాల్ టికెట్ల‌ను ఇస్తాం అని ఎవరన్నా ఇబ్బంది పెడితే http://www.bse.telangana.gov.in

 వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని , ఆ హాల్ టికెట్ మీద ఎటువంటి ప్రిన్సిపాల్ లేదా కరస్పాండెంట్ సంతకం కూడా అవసరం లేదని BSE స్పష్టంగా చెప్పిందని అని చెప్పారు

3.విద్యార్థులు త‌మ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయుల‌కు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న ప‌ది పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని NSUI నాయకులు విద్య శాఖ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో NSUI నాయకులు. కిరణ్ నందన్ , వంశీ,హరిప్రసాద్, నాని స్వరాజ్ ,సుమంత్ రాజ్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బిజెపి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన *ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు కార్యక్రమం 39 వ డివిజన్ ప్రగతి నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా సొమారపు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ  ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుందని వారికి అనారోగ్యం కారణంగా 5 లక్షల వరకు కూడా ఫ్రీ చికిత్స పొందవచ్చు అని మరియు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని ఆరోగ్య భద్రతకల్పించుకోవాలని

ప్రతి ఒక్కరు ఈ అవకాశం సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈకార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీనివాస్,మునిచందర్, రాజమణి, సాయిలత, కొమ్మురాజు పద్మ, సబిత, సమ్మక్క, గంగమ్మ, స్వరూప, రాజేశ్వరి, లక్ష్మి, పుష్ప, సారమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రాయితీలు కార్పొరేట్లకు కాకుండా పేదలకు ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని పి.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పోస్టర్ ను  అంతర్గాం సెంటర్ లో  పి వై ఎల్ పి ఓ డబ్ల్యూ నాయకులు ఆవిష్కరణ చేశారు.  రేషన్ షాపుల్లో బియ్యం మాత్రం ఇస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది కేజీలు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచినూనె,  కందిపప్పు, చింతపండు, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, పంచదార, టీ పొడి లాంటి సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు విపరీతంగా మోడీ ప్రభుత్వం పెంచిందని, సబ్సిడీ 95% కోత విధించిందని అన్నారు. ఏప్రిల్ 1 నుండి 15 వరకు గ్రామాల్లో, బస్తీల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని వారు తెలిపారు.   ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో  పీ,వె ,ఎల్ రాష్ట్ర నాయకులు Bs,కృష్ణ  జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్ జిల్లా నాయకులు తేజు పి.ఓ.డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు లక్ష్మి, జిల్లా నాయకురాలు రాధక్క  కొట్టే స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

విందు అనంతరం రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ ఇది పవిత్రమైన ఉపవాస దీక్ష కాలం, ఆ అల్లా దృష్టిలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరు సమానమే అని ఒకరికొకరు గౌరవించు కోవాలి అని అల్లా దృష్టిలో అందరు సమానమే నని ప్రతి ముస్లిం సోదరుణ్ణి మనస్ఫూర్తిగా అలయ్ బలయ్ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసారు.  ఈ కార్యక్రమం లో రామగుండం  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇదునూరి హరిప్రసాద్  మైనార్టీ నాయకులు అక్తర్ పాషా, షేక్ సాబీర్,పొన్ను,హైమధ్ పాషా, అలీం భాయ్, వాజిద్ ,అజాం అబ్బు, చోటు భాయ్, ప్రేమ్ , బొద్దుల శంకర్ , రాజేష్,  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్/భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది.కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువు జరిగింది. వేదమంత్రోచారణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేశారు.


జగదభిరాముని కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘటం జరిగింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

35వ డివిజన్ పుప్పాల గుట్టలో శ్రీ ముత్యాలమ్మ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఆ సీతారాముల వారి ఆశీర్వాదంతో తూర్పు  నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నామని

నూతన కలెక్టర్, బస్ స్టేషన్,1100కోట్లతో హాస్పిటల్ నిర్మించుకుంటున్నామన్నారు

ప్రజల ఆశీర్వాదంతో నిరుపేదనైన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని ఇక్కడ పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత సమస్యలు అన్ని తనకి తెలుసని అందుకే ఒక్కొక్కటిగా ఈ నియోజకవర్గంలోని సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నారు.

చింతల్ లోని దేవాలయానికి ఇప్పుడే లక్ష రూపాయల  సాయం అందించామని,ఈ దేవాలయంలో కూడా ప్రదక్షిణలు చేయడానికి ఫ్లోర్ ఇబ్బందిగా ఉంది అని తెలిపారని ఎంత ఖర్చు అయిన పూర్తి చేసే తనదేనని ఎమ్మెల్యే అన్నారు

నియోజకవర్గానికి ఎందరో వస్తుంటారు పోతుంటారని పుట్టిన బిడ్డ పుట్టినబిడ్డే సాదుకున్న బిడ్డ సాదుకున్న బిడ్డే అని పుట్టిన బిడ్డకు సాదుకున్న బిడ్డకు తేడా ఉంటుంది కదా అని ఎమ్మెల్యే చమత్కరించారు

ఈ ప్రాంత బిడ్డగా సీతారాములవారితో పాటు ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరారు.

ఆ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని ఎమ్మెల్యే ఆ దేవుణ్ణి ప్రార్ధించారు.

ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, మర్రి శ్రీనివాస్, డివిజన్ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు,యూత్ నాయకులు ఉన్నారు.

కరిమాబాద్(బొమ్మల గుడి)శ్రీ కాశీ విష్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. 

ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు,కూడా డైరెక్టర్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామ నవమి సందర్భంగా మార్వాడీ సమాజ్ వారు ఏర్పాటు చేసిన సీతారాముల వారి శోభాయాత్రలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. 

ఈ యాత్ర వరంగల్ చౌరస్తా నుండి దుర్గేశ్వర స్వామి దేవాలయం, బట్టల బజార్ మీదుగా భద్రకాళి దేవాలయం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో మార్వాడీ పెద్దలు, కార్పొరేటర్ గందే కల్పన నవీన్, జెడ్ఆర్సిసి మెంబెర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు  శివ గార్డెన్ లో రామగుండం నియోజకవర్గ ముఖ్య  నాయకులతో బూత్ సశక్తీకరన్ కార్యక్రమం అంతర్గం మండలం జనరల్ సెక్రటరీ బోడగుంట సుభాష్  అధ్యక్షతన  *బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ ఛైర్మెన్  సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా విస్తరక్ సురేష్, అసెంబ్లీ ఇంచార్జి  ఆరుముళ్ల పోచం

హాజరయ్యారు.ఈసందర్బంగా సోమారపు సత్యనారాయణ  మాట్లాడుతూ బీజేపీ ని అధికారంలోకి తీసుకు రావలన్నదే ముఖ్య ఉద్దేశమన్నారు.అదేవిదంగా బూత్ స్థాయి కమిటీలు పూర్తిస్తాయిలో నిర్వహించి శక్తి కేంద్ర మీటింగ్ లు విడతల వారీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్త హాజరయ్యేవిధంగా ప్రజలకు  బీజేపీ భరోసా ఇస్తుందని ధైర్యాన్ని వారిలో నింపాలన్నారు.మోడీ నాయకత్వం లో రాష్ట్రం లో మనం పొందుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రపంచంలో అపార మేధావి నరేంద్ర మోడీ అని ప్రపంచ దేశాలే స్పష్టం చేశాయన్నారు. నరేంద్ర మోడీ లాంటి నాయకున్ని ఇదివరకు ఎప్పుడూ మనం చూడలేదని రానున్న రోజుల్లో ఒక తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటున్నా నరేంద్ర మోడీని చూసి మనం గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర మహిళా మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు  సోమారపు లావణ్య అరుణ్ కుమార్ sc మోర్చా కార్యవర్గ సభ్యులు కోదటి ప్రవీణ్,కార్పొరేటర్ ఎం.కిషన్ రెడ్డి,బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుసుమ,

అమరేశ్వర్ రావు,మండల అధ్యక్షులు,మండలం జనరల్ సెక్రటరీ లు,శక్తి కేంద్రం అధ్యక్షులు,బూత్ స్థాయి నాయకులు,అల్ప విస్తరక్ లు, మహిళ మోర్చా సభ్యులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్


మహాదేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని, ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రం శ్రీ మందరగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, శ్రీ రామ నవమి సందర్భంగా లయన్స్ క్లబ్ కాళేశ్వరం,మహాదేవపూర్ కార్యదర్శి మడక మధు ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ శ్రీపతిబాపు ప్రారంభించారు.ఆలయ ఆవరణలో, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.వాలింటర్లు గా సేవలు అందించడానికి వచ్చిన గంగ పుత్ర యువజన సంఘం సభ్యులను అభినందించారు.వేసవి దాహాన్ని తీర్చేందుకు చల్లని నీరు,ఉచిత మజ్జిగ పంపిణీ సేవలో పాల్గొన్న మహాదేవపూర్ హైస్కూల్, డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,డైరెక్టర్లు కూరతోట రాంచంద్రం,శీలం గట్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ లో ఎల్బీనగర్ లో ఉర్డు భవన్, షాదీఖాన నిర్మాణానికి కార్పొరేటర్లు సురేష్ జోషి, ఫుర్ఖాన్ తో కలిసి   ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఈ ప్రాంతంలో గతపాలకులు కేవలం ప్రజల అవసరాలను ఓట్లుగా మాత్రమే మలుచుకున్నారు తప్ప అభివృద్ధి చేయలేదు.

ప్రజల పేరు చెప్పుకొని కోట్లు సంపాదించి ప్రజలను, నియోజకవర్గ అభివృద్ధిని మరిచారని ఎమ్మెల్యే అన్నారు.

తూర్పు నియోజకవర్గం సెక్యూలర్ నియోజకవర్గమని హిందు,ముస్లిం,క్రిస్టియన్ అందరూ కలిసికట్టుగా నివాసిస్తారని ఒకరి పండుగలకు ఒకరు వెళతారన్నారు

మైనారిటీ పిల్లలకు గోపిక్ విద్య అందించాలనే సంకల్పంతో మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని మొన్ననే బాలికల మరో రెండు గురుకుల పాఠశాలలు దేశాయిపేటలో శంకుస్థాపన చేసామన్నారు.

మైనారిటీలందరు సద్వినియోగం చేసుకొని వారి పిల్లలను ఉన్నతంగా ఎదిగే విదంగా బాటలు వేసుకోవాలని కోరారు

షాదీఖానకు గతంలోనే మంత్రి కేటీఆర్  చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు పనులు మొదలు కాలేదని ఇప్పుడు త్వరిగతిన పూర్తి చేస్తామన్నారు

గతంలో పాలించిన నాయకులు రోడ్లను విస్మరించి నియోజకవర్గాన్ని అధోగతిపాలు చేసారని 

ముజరంజాహి హయాంలో రోడ్లనీ మొన్నటి వరకు ప్రజలు వినియోగించుకున్నారని గతపాలకులు రోడ్లని వేయాలనే సోయి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నానని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత సీసీ రోడ్లు వేసి బహుసుందరంగా మార్చమన్నారు 1100కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య కోసం 7గురుకులాలు,2 డిగ్రీ కలశాలలు,75కోట్లతో బస్ స్టేషన్,అజంజాహి మిల్స్ గ్రౌండ్ లో నూతన కలెక్టరేట్ సముదాయం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

నియోజకవర్గంలోని కొద్దీ ప్రాంతాలు వర్షం పడితే వరద నిరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వరద నీరు నిల్వకుండా ఇంజినీర్లతో చర్చించామని 

వర్షం పడినప్పుడు వరద నీరు కొన్ని చోట్ల నిలవడం సహజమని వర్షం తగ్గుముఖం పట్టాక నీరు వెళ్ళిపోయి సాధారణ స్థితికి వస్తుందని దానికి కొందరు నాయకులు రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తు పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమించి 25వేల కుటుంబాలను తన వ్యక్తిగతంగా నెల రేషన్ అందింఛానన్నారు

ఇన్నెండ్లు ప్రజలను మరిచిన నాయకులు నేడు ఇస్త్రీ బట్టలు వేసుకొని మొఖాలు చూపిస్తున్నారని కరోనా ఆపత్కర పరిస్థితిలో కొందరు కోళ్ల ఫారాల్లో,ఫామ్ హౌసుల్లో పడుకొని ప్రజలను పట్టించుకోలేదని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్యపెట్టడానికి కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.

మైనార్టీ సోదరుసోదరిమనులందరు ఏకమై మైనారిటీల ఎదుగుదలకు తోడ్పడని గతపాలకులను ప్రశ్నించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మైనారిటీ మత పెద్దలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై బుధవారం విద్యాశాఖ  సెక్రెటరీ  వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్  దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీ లు, విద్యాశాఖ  అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. 

ఇంటర్ పరీక్షలను అధికారులు  విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి అభినందనలు తెలిపారు.  ఏప్రిల్ 3 2023 నుంచి ఏప్రిల్ 13, 2023 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. 

10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లు కుదించామని, దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.  ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. 

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.  వేసవికాలంలో పరీక్షల నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి సూచించారు.  

విద్యార్థులకు హాల్ టికెట్ లను ఆన్ లైన్   bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు.   హాల్ టికెట్ ఉన్న విద్యార్థులు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని,  విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు. 

సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ  కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని,  ఫస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు మధ్యలో 20 నిమిషాల బ్రేక్ తో జరుగుతుందని,దీని పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, డిఈఓ  అబ్దుల్ హై, డిఎంఅండ్ హెచ్ ఓ  సాంబశివరావు, డిపిఓ  జగదీశ్వర్, కలెక్టరేట్ ఏఓ  కిరణ్ ప్రకాష్,ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమకొండ R. బాబు నాయక్, తదితర పోలీసు, మునిసిపల్, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్/హైదరాబాద్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ దూకుడు పెంచింది. పేపర్‌ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్‌ తన కస్టడీకి తీసుకుంది. 


నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్‌, సురేష్‌, రమేష్‌ను సిట్‌ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక​ ముగ్గురు నిందితుల్లో, ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్‌ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్‌ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్‌ ఆరా తీయనుంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్‌ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

కళా నిలయం స్వచ్ఛంద సేవకుడు గడ్డం సనత్ కుమార్ గౌడ్  అనారోగ్యం కారణంతో హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్  ఈకార్యక్రమంలో రాచకొండ కోటేశ్వర్ రావ్, మింగాని అశోక్, LB నగర్ మండలం జనరల్ సెక్రటరీ చంద్ర శేఖర్, కొండపర్తి సంజీవ్, దాసరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 

మహాదేవపూర్/ హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి అభ్యర్థుల తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్‌ రవాణా సంస్థలో డ్రైవర్‌, మెకానిక్‌.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది రాత పరీక్షను ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నట్లు మండలివర్గాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను మండలి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్ 


 హాదేవపూర్/వరంగల్: తన బంగారు ఉంగరం పోయిందని నిండు జీవితాన్ని బలితీసుకుంది ఓ డిగ్రీ విద్యార్థిని...ఇల్లంతా వెదికిన ఎక్కడా దొరకకపోయేసరికి నాన్న మన్నించు అంటూ, ఓ లేఖ రాసి మనోవేదనతో ఉరివేసుకుని, తిరిగిరాని లోకాలకు వెళ్లి, కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది.. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది.. 


పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నారు. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉగాది సందర్భంగా హేమలతారెడ్డి ఈ నెల 20న ఇంటికొచ్చారు. బుధవారం తన చేతి వేలుకున్న పావుతులం బంగారపు ఉంగరం ఎక్కడో జారిపోయింది. అన్నిచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆర్నెల్ల కిందట బంగారు గొలుసు సైతం పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మనోవేదనకు గురయ్యారు.


‘సారీ డాడీ...నాకు భయమేస్తోంది’ అంటూ లేఖ రాసిపెట్టి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు తలుపులు వేసి ఉండటంతో అనుమానం కలిగింది.. బలంగా తలుపులు తెరిచి ఇంట్లోకెళ్లి చూడగా ఉరి వేసుకుని ఉంది. వెంటనే కిందకు దింపి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి చరవాణిలో తోటి మిత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా తండ్రికి రాసిన లేఖ లభ్యమవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్‌ తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల బాదుడు మొదలుకానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ టోల్ రుసుములను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈసారి 5 నుంచి 10 % మేర పెరగనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1నుంచి పెరిగిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

లింగాపూర్ గ్రామంలో డాక్టర్ అభినయ్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని లింగాపూర్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం పెట్టారని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని పేదవాళ్ళకి ఎంతో లాభదాయకమైన కంటి వెలుగు కార్యక్రమం డాక్టర్ అభినయ ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలో మూడవ రోజు కొనసాగుతున్నందున లింగాపూర్ గ్రామ ప్రజలు అందరూ తొందరగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామ ప్రజలను డాక్టర్ అభినయ కోరారు ఈ కార్యక్రమంలో లింగాపూర్ ఏఎన్ఎం మంజు లింగాపూర్ కార్యదర్శి మరియు ఆశ వర్కర్లు అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది మహిళా గ్రూపు సభ్యురాలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం, మార్చి 28: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య పై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇదంతా ఆయన మీద కొంతమంది కావాలనే బద్నాం చేయాలనే  కుట్రతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరిజన్ డైరీ డైరెక్టర్లు ఆదినారాయణ, శైలజ లు ఎక్కడికక్కడ రైతుల వద్ద డబ్బులు తీసుకోవడం, మోసం చేయడం సాధారణమే అన్నట్టుగా జరుగుతోందని. రెండు రాష్ట్రాల్లో వారిద్దరిపై పోలీసులు 2012 నుంచి ఇప్పటి వరకు 22 కేసులు ఉన్నట్లు తెలిపారు

బెల్లంపల్లిలో కూడా ఆరిజన్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను సంప్రదించినప్పుడు రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంస్థ పెట్టేందుకు ఎమ్మెల్యే అంగీకారం తెలిపారని‌. రైతుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరిజన్ సంస్థ ప్రతినిధులు బిచాణా ఎత్తేశారని అన్నారు. 

దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారని. రైతులు తమకు జరిగిన ఈ మోసం గురించి ఎమ్మెల్యేకు సైతం చెప్పడంతో. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే చిన్నయ్య ఆరిజన్ ప్రతినిధులతో మాట్లాడారని తెలిపారు సాధారణంగా. ఎవరు పిలిచినా ప్రారంభోత్సవాళ్లకు ఎమ్మెల్యే వెళ్తారని అదేవిధంగా వీళ్ళు కూడా వాళ్ళ ఆరిజన్ కంపెనీ ప్రారంభోత్సవానికి పిలిస్తే ఎమ్మెల్యే వెళ్లారని అన్నారు వీళ్ళు రైతుల దగ్గర నుండి డబ్బులు తీసుకొని రైతులను మోసం చేసారని తెలిసి వాళ్లను ఎమ్మెల్యే పోలీసులకు పట్టించారని తెలిపారు . దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ఎమ్మెల్యేకు గిట్టని వాళ్లు కక్షపూరితంగా ఈ దొంగలతో చేతులు కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఎమ్మెల్యే చిన్నయ్యను  బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు

ఆ వాట్సాప్ చాట్ అంతా ఫేక్అని ఆ మొబైల్ నెంబర్ ఎమ్మెల్యే ది కాదని, ఎవరో ఆకతాయీలు సృష్టించిన దుశ్చర్య అని అన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజలతో మమేకం అవుతూ, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే, ఓర్వలేని వ్యక్తులు కావాలనే ఎమ్మెల్యేను బద్నాం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ఫేక్ చాట్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే చిన్నయ్య మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ తెలిపారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సింగరేణి సంస్థ C&MD శ్రీధర్ ని NMDCL C& MD గా ఎంపికైనందుకు గాను మొదట శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం సింగరేణి సంస్థ లోని కార్మికులు ఎదుర్కొంటున్న మరియు రామగుండం నియోజకవర్గం లోని పలు సమస్యల పై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సింగరేణి లో అనారోగ్యం తో బాధపడుతూ మెడికల్ బోర్డు కి వెళ్లాలనుకునే కార్మికులకు చివరిరెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తున్నారని దానిని 4 లేదా 5 సంవత్సరాలకు పెంచాలని దాని ద్వారా కార్మికుడు ఒక సంవత్సరం తర్వాత మరల మెడికల్ బోర్డు కి వెళ్లే అవకాశం వస్తుందని లేదా రెండు సంవత్సరాల ముందు మెడికల్ బోర్డు కు వెళ్లే ప్రతి కార్మికులను మెడికల్ ఇన్వాల్యుడేషన్ చేయాలని దీని ద్వారా దళారుల వ్యవస్థ రద్దు అవుతుందని దీని గురించి ఆలోచించాలని కోరారు .గత కొద్దరోజులుగా రామగుండం లో కలుషితమైన నీరు వల్ల కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని దానికి శాశ్వత ప్రతిపాదికథన సురక్షితమైన మంచినీరు అందించాలని కోరగా రేపు జరిగే సింగరేణి బోర్డు మీటింగ్ లో దీని గురించి అప్రూవల్ తీసుకొని సమస్య పరిష్కరిస్తామని చెప్పారు*సింగరేణి లోని డిపెండెంట్ ఉద్యోగుల వయో పరిమితి ను 35 నుండి 40 సంవత్సరాలకు పెంచాలని . పెండింగ్ లో ఉన్న మారుపేర్ల మార్పు వెంటనే అమలు చేయాలని .సింగరేణిలో పనిచేసే రిటైర్డ్ అయిన చాలా మంది రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 1000  తక్కువ ఉందని  అలాంటి వారి కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కనీసం 2000 వచ్చేలా కృషి చేయాలని .NCWA ఉద్యోగుల అలవెన్స్లపై పడే ఇన్కమ్ టాక్స్ ని యాజమాన్యమే చెల్లించేలా చూడాలని .ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని .NCWA ఉద్యోగుల ప్రమోషన్ పాలసీని క్రమబద్ధీకరించాలని కోరారు

గోదావరిఖని లోని B - గెస్ట్ హౌస్ IT పార్క్ కి ఇచ్చినందున దానికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల సౌకర్యార్థం మరొకటి నిర్మించాలని కోరారు.*సింగరేణి అనుబంధ సంస్థలు నెలకొల్పి సింగరేణి ప్రభావిత ప్రాంతాల వారి పిల్లలకు ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని దీనిలో భాగంగా రామగుండం నియోజకవర్గం లో సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పాలని కోరారు .జైపూర్ లోని 1200 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కొనసాగింపుగా పెట్టే 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

పై వాటికి సింగరేణి C& MD సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఏఐసిసి మరియు టిపిసిసి*పిలుపు మేరకు,  రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర*స్ఫూర్తితో  రామగుండం నియోజకవర్గంలోని 26వ డివిజన్ మార్కండేయ కాలనీ లో అధ్యక్షులు గుంపుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన  *హాథ్ సే హాథ్ జోడో అభియాన్*కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  పాల్గొని, ప్రతి గడప గడపకు వెళ్తూ  బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ,బిజేపి టీఆర్ఎస్ పై నిప్పులు చేరిగారు. అలాగే రాహుల్ గాంధీ సందేశాన్ని విసృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలందరితో మమేకమై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ,యాత్రను సాగిస్తూ,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు... అధికారం కోసం BRS పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన *ఈక్రింది మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేశారు..._

దళిత, గిరిజనులుకు మూడు ఎకరాలు భూమి హామీ._పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీ_

రైతు రుణమాఫీ హామీ_

పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు, కరెంట్, బస్, రిజిస్ట్రేషన్ చార్జీలు_

ధరణి పేరుతో రైతులకు దగా_నిరోద్యోగ భృతి హామీ_

ఉద్యోగులకు CPS రద్దు చేయలేదు._హస్తానికి 5వేళ్లు -అధికారంలోకి రాగానే ప్రజలకు 5మేళ్లు. హామీ తెలియజేస్తూ_

1. _ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షలు.._

 2. _ఆడబిడ్డలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్.._

3. _ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం.._

4. _ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000..._

 5._మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ..._ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు ఎస్సీ, బీసీ మహిళా, మైనారిటీ,

ఎన్.ఎస్.యు.ఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సేవ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ రావు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మడిపెల్లి మల్లేష్ చుచన మేరకు.తండ్రి వెంకటేశ్వరరావు  జ్ఞాపకార్థం కుమారుడు చింతల భాస్కర్ రావు సహకారంతో రెండు బెంచీలను సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం తాసిల్దార్ ఆఫీస్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆపిస్ ఆవరణలో ఒక బళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక బెంచీని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఒక బెంచీని ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ స్వర్గీయ వెంకటేశ్వర రావు మా యొక్క 38 వార్డు ఇంద్ర నగర్ కాలనీలో పెద్దమనిషిగా వ్యవరించేవాడని ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి వారి సమస్య పరిష్కారం చేసే వారని గొప్ప మానవతావాదని మల్లేష్ గుర్తు చేశారు వారు ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్ననాని మల్లేష్ అన్నారు భాస్కర్ రావు ను బెంచీల గురించి అడగగానే కాదనకుండా వారి తండ్రి  జ్ఞాపకార్థం ప్రజలు అలసిపోయి వచ్చిన వారికి కూర్చొని సేద తీర్చుకొనేందుకు బెంచీలను ఏర్పాటు చేసినందుకు చింతల భాస్కర్ రావు కు సేవా స్పూర్తి ఫౌండేషన్ తరపున అధ్యక్షులు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి నెల తనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ నన్ను ముందు నడిపిస్తూ పేద ప్రజల ఆకలి తీరుస్తున్న భాస్కర్ రావు దాతృత్వనికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్.తెలిపారు గోదావరిఖని ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ల్ సిబ్బంది శివకుమార్. రవి.మరియు రామగుండం తాసిల్దార్ ఆఫీస్ సిబ్బంది. బెంచీలను ఏర్పాటు చేసిన భాస్కర్ రావు ను అభినందించారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మత్స్యకారుల వలకు చిక్కిన చేప

ఇంతకీ ఆ ఫిష్ ఎంత బరువు ఉందో తెలుసా..?



వలకు చిక్కిన చేప... ఆశ్చర్యంలో మత్స్యకారులు


తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో మత్సకారుల వలలో భారీ సైజు చేప చిక్కింది. వల వేసి పడుతున్న క్రమంలో బరువుగా ఉండడంతో ఏమై ఉంటుందాని ఆశ్చర్యపడ్డ వలను బయటకు తీసిన తరువాత అందులో చిక్కిన చేపను చూసి ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్రానికి చెందిన మత్స్య కారులు సమీపంలోని ప్రాణహిత నదిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. వీరి వలలకు భారీ సైజు చేప పడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీటి నుండి బయటకు తీసిన తరువాత తూకం వేస్తే 38 కిలోల బరువు ఉందని మత్స్యకారులు తెలిపారు. నిత్యం తక్కువ బరువు ఉండే ఫిష్ హంటింగ్ చేసే మత్సకారులు ఒకే సారి భారీ సైజు చేప తమ వలలో పడడంతో ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద చేప తమ వలలకు చిక్కలేదని వారు తెలిపారు. ప్రాణహిత నదిలో భారీ సైజ్ చేప వలలకు చిక్కిందన్న సమాచారం అందుకున్న స్థానికులు ప్రత్యేకంగా వెల్లి చూసి అబ్బురపడిపోయారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న                             


       

గోదావరిఖని:మార్చి:25;పెద్దపల్లి జిల్లా,రామగిరి మండలం:ముస్త్యాల గ్రామ సర్పంచ్ అవార్డు అందుకున్నరు,శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయితీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రామగిరి మండలంలోని ముస్థ్యాలను ఉత్తమ గ్రామంగా ఎంపికచేసి సర్పంచ్ రామగిరి లావణ్యను సన్మానించి అవార్డ్ ను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు,కార్యదర్శి పరుశురాంగౌడ్,ఉప సర్పంచ్, lవార్డు మెంబర్లు,గ్రామ ప్రజల సహకారంతోనే గ్రామన్ని అన్ని విధాలుగా అభివృద్ది పరుస్తున్నామని, గ్రామా సర్పంచ్ గా నేను అందుకున్న అవార్డ్స్ లను గ్రామప్రజలకు అంకితమిస్తున్ననని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరెళ్ళీ దేవక్క,జెడ్పీటీసీ మ్యాదరవేనీ శారద,ఎంపిడిఓ ఇనుముల రమేష్,ఎంపీఓ కాటం భాస్కర్,సర్పంచ్ లు,తదిరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

   


          పెద్దపల్లి:గోదావరిఖని:మార్చి:27:రామగుండం డివిజన్ ఆర్ జీ వన్ గోదావరిఖని సింగరేణి ఓసి 5 ప్రారంభం అయిన నాటినుండి 5 ఇంక్లైన్ నుండి మంథని వెళ్లే కొత్త రోడ్డు ప్రారంభమైన నాటినుండి సుందిళ్ల,ముస్త్యాల నుండి మంథనికి వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయముగా మారింది,సుమారు,20 మూల మలుపులతో నిర్మాణమైన ఈ రోడ్డుకు రేడియంతో సరి అయిన సూచికలు,స్పీడ్ బ్రేకులు, లైట్స్ లేనందున ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు వెడల్పు కూడా తక్కువగా ఉన్నందున రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇట్టి విషయాలపై సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున గోదావరిఖని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ జీ వన్ జీఎం కల్వల నారాయణను,ఒక నాయకుడు అడగితే అన్ని సక్రమంగానే ఉన్నాయని,జర్నలిస్టుల ముందే,జీఎం అన్నట్టు సమాచారం,ఈ ప్రమాదాలకు పూర్తి బాధ్యత జి ఎం కలువల నారాయణ,రాజకీయ నాయకులదే నని పలువురు అంటున్నారు.సోమవారం రాత్రి,ముస్త్యాల మూలమలుపు వద్ద సరియైన లైట్స్ లేనందున,ద్విచక్ర వాహనంపై వెళుతున్నవారు కింద పడటంతో ఒక మహిళకు దెబ్బ తగలడంతో చెవ్వు భాగము నుండి రక్తము కారడంతో అక్కడే అందుబాటులో ఉన్న జనం,సర్పంచ్ తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్లగా,ప్రాణాపాయం తప్పింది.ఇలాంటి ప్రమాదాలకు కారణమైన,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు వేడుకుంటున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 నేరాల నియంత్రణ కోసం అసాంఘిక శక్తులతో పాటు, పాత నేరస్తుల పై దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా 

 పోలీస్ కార్యాలయం లో పోలీస్ అధికారులతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పి సూచించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా ఎస్సై , సిఐ, డీఎస్పీ లు పని చేయాలన్నారు. ఇందుకోసం కోర్టు  సంబంధిత అంశాల్లో   సమర్ధవంతంగా పని చేసి, శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా  రాత్రి పూట  బీట్‌లు, పెట్రోలింగ్‌ నిర్వహించాలని, 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో  అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, బి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పీ  కిషోర్ కుమార్, జిల్లాలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ  వాసుచంద్ర, పిడి డిఆర్డిఏ  శ్రీనివాస్ లు ఇట్టి దరఖాస్తులను తీసుకొని, వీటి పై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు. 

ఈ ప్రజావాణి లో మొత్తం     74  దరఖాస్తులు  వచ్చాయని తెలిపారు.  ప్రజావాణి కార్యక్రమం లో డిఎంఅండ్ హెచ్ ఓ  సాంబశివ రావు, డిపిఓ  జగదీశ్వర్,  డిఎం డబ్య్లు ఓ  శ్రీనివాస్, ఈడి ఎస్సీ  కార్పొరేషన్ మాధవి లత, డిటిడిఓ  ప్రేమకళా రెడ్డి, డిసిఎస్ ఓ వసంత లక్ష్మీ, సిపిఓ  సత్య నారాయణ రెడ్డి, ఎల్డీఎం శ్రీనివాస్, ఏడి  మైనింగ్ నర్సిరెడ్డి, ఏడి  సర్వే అండ్ లాండ్ రికార్డ్ ప్రభాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో రూపొందించబడి విజయవంతంగా నడుస్తున్న బలగం సినిమా నటులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. బలగం సినిమాలో కొమురయ్య తమ్ముడు అంజయ్య పాత్రలో నటించి బాగా పేరు తెచ్చుకున్న రాయపర్తి కి చెందిన గుడి బోయిన బాబుని మంత్రి సత్కరించారు. అలాగే ఈ సినిమాలో నటించిన కర్తానందం, వేముల ప్రభాకర్ లను కూడా మంత్రి సన్మానించారు. కాగా గుడి బోయిన బాబుది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రం. ఎన్నో చైతన్య నాటకాలలో నటించిన బాబు బలగం సినిమాలో ఉదాత్తమైన పాత్రను పోషించారు. తండ్రి చనిపోతే పాతి పెట్టడానికి ఆరడుగుల స్థలం కూడా లేని స్థితిలో పంచాయతీ పెట్టుకుంటున్న కొడుకుల పరిస్థితిని చూసి జాలిపడిన బాబాయి పాత్రలో బాబు బాగా రాణించారు. అని మంత్రి ఎర్రబెల్లి బాబుని అభినందించారు అలాగే మిగతా పాత్రలు పాత్రధారులు అద్భుతంగా వ్యక్తి కట్టాయని అందుకే సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని సక్సెస్ఫుల్గా నడుస్తోందని మంత్రి తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ముఖ్యమంత్రి కేసిఆర్  ఆదేశాల మేరకు

వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న 24 అంతస్థుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో కలిసి పరిశీలించారు.

నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. హాస్పిటల్ డిజైన్లు,వర్క్స్ ప్రోగ్రెస్ పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు పనులు నిరంతరాయంగా జరగాలని అధికారులు, వర్క్ ఏజెన్సీని అదేశించారు. పనులు వేగంగా జరగాలని అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు. పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి అంతస్తు, కోర్ట్ యార్డ్,ఎలివేషన్ ఏరియా పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. 

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అందాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వరంగల లో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 42 ఎకరాల్లో,19లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు 1200 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ హాస్పిటల్ వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం,మహబూబాబాద్,ములుగు జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే చికిత్స అందిస్తారో అదే స్థాయిలో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా మెరుగైన చికిత్స లభిస్తుందని తెలిపారు. ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని విభాగాల్లోనే ప్రత్యేక చికిత్స అందిస్తాయి. కానీ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30 నుంచి 35 విభాగాల ట్రీట్మెంట్ సేవలు అందనున్నాయని తెలిపారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే హాస్పిటల్ నిర్మాణ స్ట్రక్చర్ పనులు 60శాతం పూర్తి అయ్యాయని, ఈ సెప్టెంబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నరని తెలిపారు. 

అట్లాగే సీఎం కెసిఆర్  సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ చుట్టూ నాలుగు మల్టి స్పెషాల్టీ హాస్పటల్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. తూర్పు జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఎల్బి నగర్ లో,ఉత్తర జిల్లాల నుంచి వచ్చే వారికి అల్వాల్ లో,సిటీలో సనత్ నగర్లో, మరో వైపు గచ్చిబౌలిలోని టిమ్స్ లలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో హాస్పిటల్ 900 కోట్ల వ్యయంతో 1000 బెడ్ల సదుపాయంతో నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్ హాస్పటల్లో కూడా 1600 కోట్లతో కొత్తగా 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా.. పేదల ఆరోగ్యం కోసం వైద్య రంగనాకి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా అన్ని జిల్లాలో సీఎం కెసిఆర్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 

మంత్రి వెంట ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ నరేందర్ రావు,పలువురు అధికారులు,ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సింగరేణి సంస్థని ప్రైవేటీకరణ  చేసే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి:రాజ్ ఠాకూర్*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరుస్తాం:మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*మీ ఇంటి కార్మికుని బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం ఇవ్వండి:రాజ్ ఠాకూర్ గోదావరిఖని హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా   పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఇంక్లైన్  మైన్స్ కి వెళ్లి సింగరేణి కార్మికులను కలిసి మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని, దేశానికి రాష్ట్రాలకు రక్తాన్ని చెమట గా మార్చి ప్రాణాలను లెక్కచేయకుండా వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న, సైనికులతో సమానం సింగరేణి కార్మికులు సింగరేణి బొగ్గు బాయి ఈ ప్రాంతంలో పుట్టినందుకు గర్వంగా ఉంది,గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో 18,000 పట్టాలు ఇచ్చాం, సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ కూడా లేకుండా చేయుటకు, ప్రతి కార్మికుడికి సొంత ఇంటికి తల నెరవేర్చాలని ప్రపోజల్ పెట్టినాము  దురదృష్టవశత్తు స్వర్గస్తులైనారు,ఎమ్.ఎమ్.డీ.ఆర్ యాక్ట్ 2015 వ సంవత్సరం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సింగరేణి ని ప్రైవేట్ పరం చేయాలని ఒక కుట్ర కొనసాగిస్తున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది,కార్మికుల కష్టార్జితంతో ఏర్పాటైన మెడికల్ కాలేజీను సింగరేణి కార్మిక మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలి.అందులో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్ల విషయంలో 40% రిజర్వేషన్ కల్పించాలి,అదే మాదిరిగా హాస్పిటల్ సిబ్బంది నియామకాల్లో స్థానిక  సింగరేణి  కార్మిక పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి, గత 30 సంవత్సరాలుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పదవి ఉన్నా, లేకున్నా , నా శక్తి మేర ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నానని, మీ ఇంటి బిడ్డగా ఈ ఒక్క సారి అవకాశం ఇస్తే, అధికారికంగా ప్రజాసేవ చేసే అవకాశం వస్తుందని కాబట్టి, కార్మిక సొదరులు ఈ సారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్స్  మహంకాళి స్వామి, కార్పొరేటర్స్ ఎండీ ముస్తఫా, పెద్దల్లి తేజస్విని -ప్రకాష్, రవి కుమార్,బిజి సెల్ అధ్యక్షులు  గట్ల రమేష్,రవి యాదవ్,sc సెల్ తల్లపల్లి యుగేందర్,తిప్పరపు శ్రీనివాస్,గడ్డం శేఖర్,nsui దాసరి విజయ్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు,INTUC నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్

ఆలయ ఫౌండేషన్

దాతల సహకారం తో 17900 రూపాయలు ఆర్థిక సహాయం,75కేజీ ల బియ్యం పంపిణీ.... చేశారు 

నిరుపేద కుటుంబం అయినా బాపుసాయి బాబా మందిరం లో సేవకుడు గా ఆలయ ఫౌండేషన్ సభ్యుడు అయినా

బాపు సతీమణి అనారోగ్యం తో లక్ష్మి మృతి చెందడం చాలా బాధాకరం

బాపు కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని  

నరహరి ఐఏఎస్  సూచన మేరకు

మంథని లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నార్ల రమేష్ 

49 వ డివిజన్ కార్పొరేటర్ సనఫక్రుద్దీన్,32 వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్  చేతుల మీదగా 17900 రూపాయలు మరియు 75 కేజీ ల బియ్యం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి

స్పందించిన దాతలు 

నార్ల రమేష్ -50కేజీ బియ్యం

కొత్త నాగ మల్లయ్య - 25కేజీ బియ్యం

సామల సురేందర్ -2000

అయిత శ్రీధర్ -1500

ఎంబాడి రవి వర్మ -1000

బండ కుమార్ -1000

బద్రి సతీష్ -1000

ఎనగంటి శ్రీనివాస్ -1000

మీడివెల్లి శ్రీనివాస్- 1000

నవ కిషోర్ -1000

గాలిపెల్లి శ్రీకాంత్ -1000

కార్తీక్ -1000

Dr. ప్రదీప్ -1000

టీట్ల రమేష్ బాబు సార్ -500

రాగుల కిరణ్ -500

కడమండ శ్రీహరి -500

ప్రకాష్ -500

పడాల దిలీప్ -500

గోపాగాని రమేష్ -500

బాబితా -500

రాఘవేంద్ర -500

గొట్టే వంశీ -500

గాండ్ల శ్రీనివాస్ -200

రంగు శ్రీనివాస్ -200

సాయి కిరణ్ -200

విక్రమ్ -200

సామ్రాట్ srk -100

Total /17900 అందించిన అందరికీ ఆలయ ఫౌండేషన్ తరపున ధన్యవాదములు తెలియజేశారు 


__

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సంగారెడ్డి జిల్లా పి పి ఎల్ ప్రోగ్రెస్సివ్ పేరెంట్స్ లీగ్(ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం)రాష్ట మహిళవింగ్ అధ్యక్షురాలు పత్రి లలితారాణి ఇటివల కాలంలో రోడ్ ప్రమాదంలో గాయపడినందున  ఇంటికి వెళ్లి పరమార్శించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పి పి ఎల్ రాష్ట ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏట్ నాగంపేట్ బాలికల పేరెంట్స్ కమిటి ప్రధానకార్యదర్శి రామంచ రాజేందర్,సీనియర్ నాయకులు మరియు బి ఎస్ పి పార్టీ మానకొండూర్ మండలం అధ్యక్షులు దాసరి కొమురన్న పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లోని రాయదండి గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించిన పోచమ్మ బోనాలకు ముఖ్య అతిథులుగా హాజరై  ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం అభివృద్ధి ప్రదాత బిజెపి నాయకులు, మాజి ఎమ్మెల్యే, మాజి ఆర్టీసీ చెర్మెన్ సోమరపు సత్యనారాయణ  మరియు బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్  ఈకార్యక్రమంలో ఎత్తరి కుమారస్వామి,రాయదండి గ్రామ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ,ఉప సర్పంచ్ తాని పవన్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు భాజపా అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రామగుండం నియోజకవర్గం లోని కార్పోరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో సంజయ్ గాంధీ నగర్ లో డివిజన్ ఇంచార్జ్ సీనియర్ నాయకులు మేకల పోశం, అధ్యక్షతన,అధ్యక్షులు ఒర్సు అనిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంచర్ల మహేష్, ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్  రాజ్ ఠాకూర్  పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఒక్కరినీ కలుస్తూ దేశంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,బీఆరెస్ అసమర్థ పాలనను వివరించారు.. *కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సొంతింటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామని, 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా అయిదు లక్షల రూపాయల వైద్య ఖర్చులతో పాటు రూ.500లకే వంటింటి సిలిండర్ ను అందిస్తామని అన్నారు ._

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు._

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

నేడు జరిగిన గంగపుత్రుల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేపించి రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువస్తే కచ్చితంగా పని చేసి పెడతా అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారo లోకి వచ్చాక

1.కేవలం 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్,

2.ఇంటి స్థలం ఉన్న వారికి  500000/-రూపాయలు

3. రైతు రుణమాఫీ వెంటనే చెపడతామని

4.ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేస్తామని

5.బి పవర్ హౌస్ పునరుద్దరణ జరగాలని అందుకోసం నా శాయశక్తుల పని చేస్తానని మీలో ఒక్కడిగా మీ కుటుంబ సభ్యుడుగా మీ బిడ్డగా మీ కోసం పని చేస్త అని

గతంలో సోమరాపుని అలాగే కోరుకంటిని గెలిపించారని వారు ప్రజలకు ఏమైనా చేసారా అంటే అదే శూన్యమేనని నిత్యం ప్రజా క్షేత్రంలో తిరుగున్న సమస్యల మీద కొట్లాడుతున్న పలుమార్లు జైలు కెళ్తున్న ఏది ఏమైనా నేను మీకు పని చేయడానికే ఉన్నానని మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా వారి బంధువుల వారి ద్వారా నాకు మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేయoడని ఈ సందర్బంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమములో 1st డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ , బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాలా మహేష్  పట్టణ అధ్యక్షులు ఇదునూరి హరిప్రసాద్ ,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు సాదు రమేష్ యువ నాయకులు కునారపు ప్రేమ్ , మండల కార్యదర్శి మేడి ఓదెలు  చాంద్ భాయ్  మైనారిటీ అధ్యక్షులు గౌస్ భాయ్, తాజ్ భాయ్  తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్  ఈసందర్బంగా తెలంగాణ వచ్చాక, తెలంగాణ నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరసన తెలపడం జరిగింది కేబినెట్ నుండి కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలి అని మరియు TSPSC రాసిన నిరుద్యోగులకు రు.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి అని మరియు TSPSC పేపర్ లికేజి పై సిట్టింగ్ జడ్జితో జరిపించాలి అని ప్రభుత్వం ని డిమాండ్ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిజెపి రాష్ట్ర నాయకులు, మహిళా మోర్చాపదాధికారులు,స్టూడెంట్ యూనియన్స్, బిజెపి కార్యకర్తలు,మహిళలు ఈ నిరసన కి మద్దతు తెలిపారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


 :కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ అనర్హత వేటు వేయడాన్ని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్  ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చిన 24 గంట‌ల లోపే ఈ నిర్ణయాన్ని ప్రక‌టించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది అప్రజాస్వామికమని ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని అన్నారు. ఇలాంటి అమానుష చర్యలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వర్గీయ ఠాకూర్ శైలేందర్ సింగ్ స్మారక చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్  ప్రారంభించారు అనంతరం శైలేందర్ సింగ్  ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం రాజ్ ఠాకూర్  మాట్లాడుతూ చిన్న వయసులోనే మా నుంచి దూరమైన సోదరుడు శైలేందర్ స్మారకంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ మాజీ ఎంపీటీసీలు గోపాల్ యాదవ్ బొడ్డు లింగమూర్తి రామ్మూర్తి గౌడ్ అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సందన వెని శేఖర్ ఒల్లెపు సాయి రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇదునూరి హరిప్రసాద్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి కిరణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెద్దంపేట గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు పల్లె రవీందర్ సీనియర్ నాయకులు నాడెం అంజయ్య తమ్మనవేని కుమార్ బోయబోతు మల్లేష్ వేముల రమేష్ బీరెల్లి ప్రశాంత్ బైరి సురేష్ గౌడ్ పైడిపల్లి ప్రసాద్ గౌడ్ పల్లె నాగేష్ తమ్మనవేని మధు కేశవేణి స్వామి పెద్దల రమేష్ వేల్పుల కుమార్ యాదవ్ గాదె శ్రీకాంత్ గాదే రాము అగిల రవి పందుల కొమరయ్య కోడిపుంజుల చంద్రయ్య పరకాల వెంకన్న పొన్నగంటి సాయి కుందన పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణ బీసీ సెల్ నాయకులు స్వామి సుంకరి రవి ఫస్ట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొద్దుల శంకర్ బిసి సెల్ పట్టణ అధ్యక్షులు సాదు రమేష్ రామగుండం పట్టణ సీనియర్ నాయకులు చాంద్ పాషా తాజ్ భాయ్  రామగుండం పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి గౌస్ బాబా మాదినేని వెంకటేష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గతంలో చట్టవ్యతిరేక కార్యకలపాలు నేరాలకు పాల్పడిన పాత నేరస్థులతో పాటు, రౌడీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను అదేశించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శని వారం కెయూసి సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు.

డిసిపి, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ . కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగితెలుసుకున్నారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింత శ్రమించాల్సి వుంటుందని. గంజాయి రహిత పోలీస్ స్టేషన్ గా గుర్తింపు వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయాలని, ముఖ్యంగా గంజాయి విక్రయాలు, వినియోగించే హట్స్పాట్స్ను అధికారులు గుర్తించి వాటిపై నిరంతరం నిఘా పెట్టాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్

పోలీసింగ్ భాగం నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహించాల్సిన అవసరం వుందని కమిషనర్ తెలిపారు.

బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై వుందని, ముఖ్యంగా బాల్య వివాహలను ప్రోత్సహించే వ్యక్తులపై కూడా కేసులను నమోదు చేయాలని, బాల్య వివాహలపై ఎవరు ఫిర్యాదు ఇవ్వకుంటే సంబంధిత స్టేషన్ అధికారి సుమోటో క్రింద కేసు నమోదు చేసుకోవాలి. భ్రూణ హత్యల నివారణ కై స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు మహిళలు, బాలికల అదృష్య కేసులపై అధికారులు తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. స్టేషన్ అధికారులు ప్రజలతో సత్ససంబంధాలు పెట్టుకోవాలని అలాగే గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలియజేసారు.

ఈ సమావేశంలో డిసిపిలు అబ్ధుల్ బారీ, కరుణాకర్, సీతారాం, అదనపు డిసిపి పుష్పా రెడ్డి, సంజీవ్, సురేష్ కుమర్ తో పాటు ఎసిపిలుపాటు ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.