మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని, ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రం శ్రీ మందరగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, శ్రీ రామ నవమి సందర్భంగా లయన్స్ క్లబ్ కాళేశ్వరం,మహాదేవపూర్ కార్యదర్శి మడక మధు ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ శ్రీపతిబాపు ప్రారంభించారు.ఆలయ ఆవరణలో, కాళేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ గుడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు.వాలింటర్లు గా సేవలు అందించడానికి వచ్చిన గంగ పుత్ర యువజన సంఘం సభ్యులను అభినందించారు.వేసవి దాహాన్ని తీర్చేందుకు చల్లని నీరు,ఉచిత మజ్జిగ పంపిణీ సేవలో పాల్గొన్న మహాదేవపూర్ హైస్కూల్, డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,డైరెక్టర్లు కూరతోట రాంచంద్రం,శీలం గట్టయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: