ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ లో ఎల్బీనగర్ లో ఉర్డు భవన్, షాదీఖాన నిర్మాణానికి కార్పొరేటర్లు సురేష్ జోషి, ఫుర్ఖాన్ తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఈ ప్రాంతంలో గతపాలకులు కేవలం ప్రజల అవసరాలను ఓట్లుగా మాత్రమే మలుచుకున్నారు తప్ప అభివృద్ధి చేయలేదు.
ప్రజల పేరు చెప్పుకొని కోట్లు సంపాదించి ప్రజలను, నియోజకవర్గ అభివృద్ధిని మరిచారని ఎమ్మెల్యే అన్నారు.
తూర్పు నియోజకవర్గం సెక్యూలర్ నియోజకవర్గమని హిందు,ముస్లిం,క్రిస్టియన్ అందరూ కలిసికట్టుగా నివాసిస్తారని ఒకరి పండుగలకు ఒకరు వెళతారన్నారు
మైనారిటీ పిల్లలకు గోపిక్ విద్య అందించాలనే సంకల్పంతో మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని మొన్ననే బాలికల మరో రెండు గురుకుల పాఠశాలలు దేశాయిపేటలో శంకుస్థాపన చేసామన్నారు.
మైనారిటీలందరు సద్వినియోగం చేసుకొని వారి పిల్లలను ఉన్నతంగా ఎదిగే విదంగా బాటలు వేసుకోవాలని కోరారు
షాదీఖానకు గతంలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు పనులు మొదలు కాలేదని ఇప్పుడు త్వరిగతిన పూర్తి చేస్తామన్నారు
గతంలో పాలించిన నాయకులు రోడ్లను విస్మరించి నియోజకవర్గాన్ని అధోగతిపాలు చేసారని
ముజరంజాహి హయాంలో రోడ్లనీ మొన్నటి వరకు ప్రజలు వినియోగించుకున్నారని గతపాలకులు రోడ్లని వేయాలనే సోయి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నానని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత సీసీ రోడ్లు వేసి బహుసుందరంగా మార్చమన్నారు 1100కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య కోసం 7గురుకులాలు,2 డిగ్రీ కలశాలలు,75కోట్లతో బస్ స్టేషన్,అజంజాహి మిల్స్ గ్రౌండ్ లో నూతన కలెక్టరేట్ సముదాయం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
నియోజకవర్గంలోని కొద్దీ ప్రాంతాలు వర్షం పడితే వరద నిరు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వరద నీరు నిల్వకుండా ఇంజినీర్లతో చర్చించామని
వర్షం పడినప్పుడు వరద నీరు కొన్ని చోట్ల నిలవడం సహజమని వర్షం తగ్గుముఖం పట్టాక నీరు వెళ్ళిపోయి సాధారణ స్థితికి వస్తుందని దానికి కొందరు నాయకులు రాద్ధాంతం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తు పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.
కరోనా సమయంలో ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమించి 25వేల కుటుంబాలను తన వ్యక్తిగతంగా నెల రేషన్ అందింఛానన్నారు
ఇన్నెండ్లు ప్రజలను మరిచిన నాయకులు నేడు ఇస్త్రీ బట్టలు వేసుకొని మొఖాలు చూపిస్తున్నారని కరోనా ఆపత్కర పరిస్థితిలో కొందరు కోళ్ల ఫారాల్లో,ఫామ్ హౌసుల్లో పడుకొని ప్రజలను పట్టించుకోలేదని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మభ్యపెట్టడానికి కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారన్నారు.
మైనార్టీ సోదరుసోదరిమనులందరు ఏకమై మైనారిటీల ఎదుగుదలకు తోడ్పడని గతపాలకులను ప్రశ్నించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మైనారిటీ మత పెద్దలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: