మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంథని శాసనసభ్యులు మాజీ మంత్రి దుద్దిళ్ల *శ్రీధర్ బాబు సూచనలతో ,రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో మరియు NSUI రాష్ట్ర అధ్యక్షుడు *బల్మూరి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *SY థామస్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో NSUI జిల్లా కార్యదర్శి మేంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ వర్గం పరిధి లో పరీక్షలకు హాజరు కానున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల కి సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్ష సమయం లో ఎంతగానో ఉపయోగపడేటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు ఉచితంగా అందించడం జరిగింది .ఈ సందర్భంగా NSUI నాయకులు మాట్లాడుతూ... పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు.
1.పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, 9:35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించారు . కాబట్టి సమయాన్ని పాటించి అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లి ఉండాలని సూచించారు
2.ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎవరన్నా అధిక ఫీజులు అడుగుతూ ఫీజు కడితేనే హాల్ టికెట్లను ఇస్తాం అని ఎవరన్నా ఇబ్బంది పెడితే http://www.bse.telangana.gov.in
వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని , ఆ హాల్ టికెట్ మీద ఎటువంటి ప్రిన్సిపాల్ లేదా కరస్పాండెంట్ సంతకం కూడా అవసరం లేదని BSE స్పష్టంగా చెప్పిందని అని చెప్పారు
3.విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పది పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని NSUI నాయకులు విద్య శాఖ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో NSUI నాయకులు. కిరణ్ నందన్ , వంశీ,హరిప్రసాద్, నాని స్వరాజ్ ,సుమంత్ రాజ్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: