మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజెపి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన *ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు కార్యక్రమం 39 వ డివిజన్ ప్రగతి నగర్ లో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా సొమారపు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుందని వారికి అనారోగ్యం కారణంగా 5 లక్షల వరకు కూడా ఫ్రీ చికిత్స పొందవచ్చు అని మరియు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని ఆరోగ్య భద్రతకల్పించుకోవాలని
ప్రతి ఒక్కరు ఈ అవకాశం సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈకార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీనివాస్,మునిచందర్, రాజమణి, సాయిలత, కొమ్మురాజు పద్మ, సబిత, సమ్మక్క, గంగమ్మ, స్వరూప, రాజేశ్వరి, లక్ష్మి, పుష్ప, సారమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: