మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాయితీలు కార్పొరేట్లకు కాకుండా పేదలకు ఇవ్వాలని, రేషన్ షాపుల ద్వారా పన్నెండు రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని పి.వై.ఎల్, పి.ఓ.డబ్ల్యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పోస్టర్ ను అంతర్గాం సెంటర్ లో పి వై ఎల్ పి ఓ డబ్ల్యూ నాయకులు ఆవిష్కరణ చేశారు. రేషన్ షాపుల్లో బియ్యం మాత్రం ఇస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పది కేజీలు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచినూనె, కందిపప్పు, చింతపండు, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, పంచదార, టీ పొడి లాంటి సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు విపరీతంగా మోడీ ప్రభుత్వం పెంచిందని, సబ్సిడీ 95% కోత విధించిందని అన్నారు. ఏప్రిల్ 1 నుండి 15 వరకు గ్రామాల్లో, బస్తీల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీ,వె ,ఎల్ రాష్ట్ర నాయకులు Bs,కృష్ణ జిల్లా అధ్యక్షులు పెండ్యాల రమేష్ జిల్లా నాయకులు తేజు పి.ఓ.డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు లక్ష్మి, జిల్లా నాయకురాలు రాధక్క కొట్టే స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: