ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
శుక్రవారం ఐడిఓసి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రాం జయంతి,బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ముందస్తు ఏర్పాట్ల పై డిఆర్ఓ వాసుచంద్ర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, మరియు ఎస్సీ, ఎస్టీ కులాల కమిటీ అధ్యక్షులు, అభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రాం జయంతి 14 వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేయాలి అని అధికారులను ఆదేశించారు. మహనీయుల గురించి గ్రామ స్థాయి, మండల,జిల్లా స్థాయి వరకు కుల వివక్షలు లేకుండా చేయుటకై ఈ మహనీయుల చరిత్రలను అధ్యయనం చేయడంలో ఉన్నత విద్యా స్థాయి పిల్లలకు వ్యాసరచన పోటీలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించలని అన్నారు . మహనీయులు జయంతి వేడుకులకు జగజీవన్ రామ్,అంబేద్కర్ అభిమానులు, జిల్లాలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వేడుకలకు హాజరైయ్యే ప్రజలకు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల సభా ప్రాంగణంలో త్రాగు నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఏర్పాటు చేయాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి ఉత్సావాన్ని అత్యంత వైభవంగా జరిగేలా జిల్లాలోని బాబు జగజీవన్ రామ్,అంబేద్కర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వాసుచంద్ర, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నిర్మల, దళిత నేతలు రవి, ప్రవీన్ కుమర్, చుంచు రాజేందర్, G. శ్రీనివాస్ తదితర కమిటీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: