మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
cpi ml ప్రజా పంథా జిల్లాకమిటీ 2016లో గ్రామాలలో డ్రా ద్వారా లబ్ధిదారులను డబల్ బెడ్ రూమ్ ల కోసం ఎంపిక చేయడం జరిగింది అధికారులు ప్రజాప్రతినిధుల సమీక్షంలో గ్రామ సభలో పేర్లు ప్రకటించడం జరిగింది. వారికి ముందు డబుల్ బెడ్ రూమ్ కేటాయించకుండా మళ్లీ దరఖాస్తులు పెట్టుకోమని అందరి పేర్లు కలిపి డ్రా తీస్తామని చెప్పడంతో ముందుగా పేర్లు వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతూ గత ఐదు రోజులుగా సంబంధించిన లబ్ధిదారులు అంతరగాములో డబల్ బెడ్ రూమ్ ల వద్ద దీక్ష నిర్వహిస్తున్నారు ముందు మాకే ఇవ్వాలి తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో దీక్ష నిర్వహిస్తున్నారు వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జిల్లా నాయకులు జూపాక శ్రీనివాస్ గుమ్మడి వెంకన్న పెండ్యాల రమేష్ గొల్లపల్లి చంద్రన్న కట్ట తేజేశ్వర్ శంకరన్నలు లక్ష్మీ, భూషణ వేణి కృష్ణ మాట్లాడుతూ 2016లో గ్రామాలలో డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ముందుగా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని తర్వాత ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. 2016 నుండి నీటి వరకు ఇల్లు నిర్మించి ఇవ్వకపోవడమే వారిని మోసం చేయడము తప్ప మరి ఏమి కాదు ఎన్నికల ముందు పేద ప్రజలను మళ్లీ మోసం చేయడానికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని డ్రా తీస్తామని దారితీస్తున్నారు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి పేదల పైన లేదు అనేది మనకు అర్థం అవుతుంది బంగారు తెలంగాణ అంటే పేదల బతుకులు బజారున పడేయడమేనని వారన్నారు మంత్రులకు ఎమ్మెల్యేలకు నిర్మించుకునే క్వాటర్లు ఆరు నెలలనే కట్టించుకున్నారు ప్రగతి భవనం యుద్ధ ప్రాతిపదిక మీద నిర్మించుకున్నారు సెక్రటేరియట్ కడుతున్నారు కానీ ఏడు సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఎందుకు కట్టలేదని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కట్టినవి కూడా మౌలిక సదుపాయాలు లేకుండా నాణ్యత లేకుండా ఊరు బయట ఎక్కడో కాడ వర్షం వస్తే కూలిపోయే విధంగా కట్టి పేదలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును ప్రజాప్రతినిధులు దోసుకుంటూ పేదలకు ఉచితమైన మాటలు వాగ్దానాలు చేస్తున్నారు మూటలు మాత్రం ధనవంతులు ప్రజాప్రతినిధులే మింగుతున్నారు అని అన్నారు తక్షణమే అంతర్గామ మండలంలో 2016లో డ్రా తీసిన లబ్ధిదారులందరికీ డబల్ బెడ్ రూమ్ కేటాయించి అక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇందులేని నిరుపేదలందరికీ కూడా తక్షణమే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల ప్రజాపంథా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మార్తరాద గోపగాని శంకరు పల్లె రవి హరీష్ రమేష్ తిరుపతి రాజేష్ వేముల రాధా శంకరయ్య దొంతుల అన్నమయ్య తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: