ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో వచ్చే వేసవిలో నిర్వహించనున్న క్రీడా శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్  మహ్మద్ అజిజ్ ఖాన్,జిల్లా కలెక్టర్ కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండ సమీకృత కలెక్టర్ కార్యాలయ  సమావేశ మందిరంలో వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాల్గవ తరగతి నుండి ఇంటర్ స్థాయి విద్యార్థులకు 15 క్రీడాంశాలలో నిష్ణాతులైన ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ ఇవ్వన్నట్లు తెలిపారు. వేసవిలో విద్యార్థులు అకాడమిక్ అంశాలకు దూరంగా ఉంటూ సామాజిక మాధ్యమాల్లో సమయాన్ని వృధా చేసుకుంటారని చెప్పారు. నెల రోజులపాటు విద్యార్థులని క్రీడల పట్ల ఆకర్షితుల్ని చేసేందుకు సరైన సమయం అన్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని క్రీడాశిక్షణకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. నగరంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో సైతం ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజిజ్ ఖాన్ మాట్లాడుతూ సుదీర్ఘ క్రీడా చరిత్ర కలిగిన హనుమకొండలో క్రీడా సంబంధిత బాధ్యులందరిచే జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కలెక్టర్ చొరవతో  వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతం చేయడంలో అన్ని క్రీడా సంఘాలు ముందుంటాయన్నారు. నగరంలోని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఏదో ఒక క్రీడాంశంలో శిక్షణ పొందేలా  తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు.

వేసవి క్రీడా శిక్షణ శిబిరము- 2023 కొరకు ఈ  క్రింద సూచించబడిన ఫోన్ నెంబర్లలో సంప్రదించగలరని అన్నారు.

9441086556, 9849276234, 9949271564, 

9010002889, 7386469301, 9182854789,9392015280,8008469219.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి జి.అశోక్ కుమార్, డిఇఓ అబ్దుల్ హై,  జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యులు బి.కైలాసం యాదవ్, కె.సారంగపాణి, పి.రమేష్ రెడ్డి, ఎండీ కరీం, లిల్లి ఫ్లోరెన్స్, అన్ని శాఖల జిల్లా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడా శాఖ కోచ్ లు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: