ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో వస్తున్న దరఖాస్తులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ ప్రజావాణిలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ఓ వాసుచంద్ర, పిడి డిఆర్డిఏ శ్రీనివాస్ లు ఇట్టి దరఖాస్తులను తీసుకొని, వీటి పై స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఈ ప్రజావాణి లో మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం లో డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివ రావు, డిపిఓ జగదీశ్వర్, డిఎం డబ్య్లు ఓ శ్రీనివాస్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ మాధవి లత, డిటిడిఓ ప్రేమకళా రెడ్డి, డిసిఎస్ ఓ వసంత లక్ష్మీ, సిపిఓ సత్య నారాయణ రెడ్డి, ఎల్డీఎం శ్రీనివాస్, ఏడి మైనింగ్ నర్సిరెడ్డి, ఏడి సర్వే అండ్ లాండ్ రికార్డ్ ప్రభాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: