ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేరాల నియంత్రణ కోసం అసాంఘిక శక్తులతో పాటు, పాత నేరస్తుల పై దృష్టి సారించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా
పోలీస్ కార్యాలయం లో పోలీస్ అధికారులతో ఎస్పి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పి సూచించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా ఎస్సై , సిఐ, డీఎస్పీ లు పని చేయాలన్నారు. ఇందుకోసం కోర్టు సంబంధిత అంశాల్లో సమర్ధవంతంగా పని చేసి, శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట బీట్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాలని, 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై, వారి కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, బి రామ్మోహన్ రెడ్డి, వర్టికల్ డిఎస్పీ కిషోర్ కుమార్, జిల్లాలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Post A Comment: