పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:మార్చి:27:రామగుండం డివిజన్ ఆర్ జీ వన్ గోదావరిఖని సింగరేణి ఓసి 5 ప్రారంభం అయిన నాటినుండి 5 ఇంక్లైన్ నుండి మంథని వెళ్లే కొత్త రోడ్డు ప్రారంభమైన నాటినుండి సుందిళ్ల,ముస్త్యాల నుండి మంథనికి వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయముగా మారింది,సుమారు,20 మూల మలుపులతో నిర్మాణమైన ఈ రోడ్డుకు రేడియంతో సరి అయిన సూచికలు,స్పీడ్ బ్రేకులు, లైట్స్ లేనందున ప్రమాదాలు జరుగుతున్నాయి.రోడ్డు వెడల్పు కూడా తక్కువగా ఉన్నందున రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇట్టి విషయాలపై సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున గోదావరిఖని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ జీ వన్ జీఎం కల్వల నారాయణను,ఒక నాయకుడు అడగితే అన్ని సక్రమంగానే ఉన్నాయని,జర్నలిస్టుల ముందే,జీఎం అన్నట్టు సమాచారం,ఈ ప్రమాదాలకు పూర్తి బాధ్యత జి ఎం కలువల నారాయణ,రాజకీయ నాయకులదే నని పలువురు అంటున్నారు.సోమవారం రాత్రి,ముస్త్యాల మూలమలుపు వద్ద సరియైన లైట్స్ లేనందున,ద్విచక్ర వాహనంపై వెళుతున్నవారు కింద పడటంతో ఒక మహిళకు దెబ్బ తగలడంతో చెవ్వు భాగము నుండి రక్తము కారడంతో అక్కడే అందుబాటులో ఉన్న జనం,సర్పంచ్ తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్లగా,ప్రాణాపాయం తప్పింది.ఇలాంటి ప్రమాదాలకు కారణమైన,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు వేడుకుంటున్నారు.
Post A Comment: