మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం, మార్చి 28: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య పై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇదంతా ఆయన మీద కొంతమంది కావాలనే బద్నాం చేయాలనే కుట్రతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరిజన్ డైరీ డైరెక్టర్లు ఆదినారాయణ, శైలజ లు ఎక్కడికక్కడ రైతుల వద్ద డబ్బులు తీసుకోవడం, మోసం చేయడం సాధారణమే అన్నట్టుగా జరుగుతోందని. రెండు రాష్ట్రాల్లో వారిద్దరిపై పోలీసులు 2012 నుంచి ఇప్పటి వరకు 22 కేసులు ఉన్నట్లు తెలిపారు
బెల్లంపల్లిలో కూడా ఆరిజన్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను సంప్రదించినప్పుడు రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంస్థ పెట్టేందుకు ఎమ్మెల్యే అంగీకారం తెలిపారని. రైతుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరిజన్ సంస్థ ప్రతినిధులు బిచాణా ఎత్తేశారని అన్నారు.
దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారని. రైతులు తమకు జరిగిన ఈ మోసం గురించి ఎమ్మెల్యేకు సైతం చెప్పడంతో. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే చిన్నయ్య ఆరిజన్ ప్రతినిధులతో మాట్లాడారని తెలిపారు సాధారణంగా. ఎవరు పిలిచినా ప్రారంభోత్సవాళ్లకు ఎమ్మెల్యే వెళ్తారని అదేవిధంగా వీళ్ళు కూడా వాళ్ళ ఆరిజన్ కంపెనీ ప్రారంభోత్సవానికి పిలిస్తే ఎమ్మెల్యే వెళ్లారని అన్నారు వీళ్ళు రైతుల దగ్గర నుండి డబ్బులు తీసుకొని రైతులను మోసం చేసారని తెలిసి వాళ్లను ఎమ్మెల్యే పోలీసులకు పట్టించారని తెలిపారు . దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ఎమ్మెల్యేకు గిట్టని వాళ్లు కక్షపూరితంగా ఈ దొంగలతో చేతులు కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఎమ్మెల్యే చిన్నయ్యను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు
ఆ వాట్సాప్ చాట్ అంతా ఫేక్అని ఆ మొబైల్ నెంబర్ ఎమ్మెల్యే ది కాదని, ఎవరో ఆకతాయీలు సృష్టించిన దుశ్చర్య అని అన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రజలతో మమేకం అవుతూ, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే, ఓర్వలేని వ్యక్తులు కావాలనే ఎమ్మెల్యేను బద్నాం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ఫేక్ చాట్ క్రియేట్ చేసి ఎమ్మెల్యే చిన్నయ్య మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ తెలిపారు..
Post A Comment: