మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సింగరేణి సంస్థ C&MD శ్రీధర్ ని NMDCL C& MD గా ఎంపికైనందుకు గాను మొదట శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం సింగరేణి సంస్థ లోని కార్మికులు ఎదుర్కొంటున్న మరియు రామగుండం నియోజకవర్గం లోని పలు సమస్యల పై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

సింగరేణి లో అనారోగ్యం తో బాధపడుతూ మెడికల్ బోర్డు కి వెళ్లాలనుకునే కార్మికులకు చివరిరెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే అనుమతిస్తున్నారని దానిని 4 లేదా 5 సంవత్సరాలకు పెంచాలని దాని ద్వారా కార్మికుడు ఒక సంవత్సరం తర్వాత మరల మెడికల్ బోర్డు కి వెళ్లే అవకాశం వస్తుందని లేదా రెండు సంవత్సరాల ముందు మెడికల్ బోర్డు కు వెళ్లే ప్రతి కార్మికులను మెడికల్ ఇన్వాల్యుడేషన్ చేయాలని దీని ద్వారా దళారుల వ్యవస్థ రద్దు అవుతుందని దీని గురించి ఆలోచించాలని కోరారు .గత కొద్దరోజులుగా రామగుండం లో కలుషితమైన నీరు వల్ల కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని దానికి శాశ్వత ప్రతిపాదికథన సురక్షితమైన మంచినీరు అందించాలని కోరగా రేపు జరిగే సింగరేణి బోర్డు మీటింగ్ లో దీని గురించి అప్రూవల్ తీసుకొని సమస్య పరిష్కరిస్తామని చెప్పారు*సింగరేణి లోని డిపెండెంట్ ఉద్యోగుల వయో పరిమితి ను 35 నుండి 40 సంవత్సరాలకు పెంచాలని . పెండింగ్ లో ఉన్న మారుపేర్ల మార్పు వెంటనే అమలు చేయాలని .సింగరేణిలో పనిచేసే రిటైర్డ్ అయిన చాలా మంది రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 1000  తక్కువ ఉందని  అలాంటి వారి కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కనీసం 2000 వచ్చేలా కృషి చేయాలని .NCWA ఉద్యోగుల అలవెన్స్లపై పడే ఇన్కమ్ టాక్స్ ని యాజమాన్యమే చెల్లించేలా చూడాలని .ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని .NCWA ఉద్యోగుల ప్రమోషన్ పాలసీని క్రమబద్ధీకరించాలని కోరారు

గోదావరిఖని లోని B - గెస్ట్ హౌస్ IT పార్క్ కి ఇచ్చినందున దానికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల సౌకర్యార్థం మరొకటి నిర్మించాలని కోరారు.*సింగరేణి అనుబంధ సంస్థలు నెలకొల్పి సింగరేణి ప్రభావిత ప్రాంతాల వారి పిల్లలకు ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని దీనిలో భాగంగా రామగుండం నియోజకవర్గం లో సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పాలని కోరారు .జైపూర్ లోని 1200 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కొనసాగింపుగా పెట్టే 800 మెగావాట్ల ప్లాంట్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

పై వాటికి సింగరేణి C& MD సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: