మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఏఐసిసి మరియు టిపిసిసి*పిలుపు మేరకు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర*స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గంలోని 26వ డివిజన్ మార్కండేయ కాలనీ లో అధ్యక్షులు గుంపుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన *హాథ్ సే హాథ్ జోడో అభియాన్*కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని, ప్రతి గడప గడపకు వెళ్తూ బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ,బిజేపి టీఆర్ఎస్ పై నిప్పులు చేరిగారు. అలాగే రాహుల్ గాంధీ సందేశాన్ని విసృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలందరితో మమేకమై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ,యాత్రను సాగిస్తూ,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు... అధికారం కోసం BRS పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన *ఈక్రింది మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేశారు..._
దళిత, గిరిజనులుకు మూడు ఎకరాలు భూమి హామీ._పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీ_
రైతు రుణమాఫీ హామీ_
పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు, కరెంట్, బస్, రిజిస్ట్రేషన్ చార్జీలు_
ధరణి పేరుతో రైతులకు దగా_నిరోద్యోగ భృతి హామీ_
ఉద్యోగులకు CPS రద్దు చేయలేదు._హస్తానికి 5వేళ్లు -అధికారంలోకి రాగానే ప్రజలకు 5మేళ్లు. హామీ తెలియజేస్తూ_
1. _ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షలు.._
2. _ఆడబిడ్డలకు రూ. 500లకే గ్యాస్ సిలిండర్.._
3. _ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం.._
4. _ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000..._
5._మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ..._ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు ఎస్సీ, బీసీ మహిళా, మైనారిటీ,
ఎన్.ఎస్.యు.ఐ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: