మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సేవ స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కర్ రావు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మడిపెల్లి మల్లేష్ చుచన మేరకు.తండ్రి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు చింతల భాస్కర్ రావు సహకారంతో రెండు బెంచీలను సేవా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం తాసిల్దార్ ఆఫీస్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆపిస్ ఆవరణలో ఒక బళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక బెంచీని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఒక బెంచీని ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ స్వర్గీయ వెంకటేశ్వర రావు మా యొక్క 38 వార్డు ఇంద్ర నగర్ కాలనీలో పెద్దమనిషిగా వ్యవరించేవాడని ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి వారి సమస్య పరిష్కారం చేసే వారని గొప్ప మానవతావాదని మల్లేష్ గుర్తు చేశారు వారు ఏ లోకంలో ఉన్న వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని వేడుకుంటున్ననాని మల్లేష్ అన్నారు భాస్కర్ రావు ను బెంచీల గురించి అడగగానే కాదనకుండా వారి తండ్రి జ్ఞాపకార్థం ప్రజలు అలసిపోయి వచ్చిన వారికి కూర్చొని సేద తీర్చుకొనేందుకు బెంచీలను ఏర్పాటు చేసినందుకు చింతల భాస్కర్ రావు కు సేవా స్పూర్తి ఫౌండేషన్ తరపున అధ్యక్షులు మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి నెల తనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ నన్ను ముందు నడిపిస్తూ పేద ప్రజల ఆకలి తీరుస్తున్న భాస్కర్ రావు దాతృత్వనికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్.తెలిపారు గోదావరిఖని ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ల్ సిబ్బంది శివకుమార్. రవి.మరియు రామగుండం తాసిల్దార్ ఆఫీస్ సిబ్బంది. బెంచీలను ఏర్పాటు చేసిన భాస్కర్ రావు ను అభినందించారు..
Post A Comment: