మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి సంస్థని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి:రాజ్ ఠాకూర్*కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేరుస్తాం:మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*మీ ఇంటి కార్మికుని బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం ఇవ్వండి:రాజ్ ఠాకూర్ గోదావరిఖని హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 ఇంక్లైన్ మైన్స్ కి వెళ్లి సింగరేణి కార్మికులను కలిసి మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని, దేశానికి రాష్ట్రాలకు రక్తాన్ని చెమట గా మార్చి ప్రాణాలను లెక్కచేయకుండా వెలుగునిస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న, సైనికులతో సమానం సింగరేణి కార్మికులు సింగరేణి బొగ్గు బాయి ఈ ప్రాంతంలో పుట్టినందుకు గర్వంగా ఉంది,గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో 18,000 పట్టాలు ఇచ్చాం, సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్ కూడా లేకుండా చేయుటకు, ప్రతి కార్మికుడికి సొంత ఇంటికి తల నెరవేర్చాలని ప్రపోజల్ పెట్టినాము దురదృష్టవశత్తు స్వర్గస్తులైనారు,ఎమ్.ఎమ్.డీ.ఆర్ యాక్ట్ 2015 వ సంవత్సరం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సింగరేణి ని ప్రైవేట్ పరం చేయాలని ఒక కుట్ర కొనసాగిస్తున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది,కార్మికుల కష్టార్జితంతో ఏర్పాటైన మెడికల్ కాలేజీను సింగరేణి కార్మిక మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలి.అందులో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్ల విషయంలో 40% రిజర్వేషన్ కల్పించాలి,అదే మాదిరిగా హాస్పిటల్ సిబ్బంది నియామకాల్లో స్థానిక సింగరేణి కార్మిక పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి, గత 30 సంవత్సరాలుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పదవి ఉన్నా, లేకున్నా , నా శక్తి మేర ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నానని, మీ ఇంటి బిడ్డగా ఈ ఒక్క సారి అవకాశం ఇస్తే, అధికారికంగా ప్రజాసేవ చేసే అవకాశం వస్తుందని కాబట్టి, కార్మిక సొదరులు ఈ సారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్స్ మహంకాళి స్వామి, కార్పొరేటర్స్ ఎండీ ముస్తఫా, పెద్దల్లి తేజస్విని -ప్రకాష్, రవి కుమార్,బిజి సెల్ అధ్యక్షులు గట్ల రమేష్,రవి యాదవ్,sc సెల్ తల్లపల్లి యుగేందర్,తిప్పరపు శ్రీనివాస్,గడ్డం శేఖర్,nsui దాసరి విజయ్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు,INTUC నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: