ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో భూపాలపల్లి హెడ్ కానిస్టేబుల్ ఉచ్చిడి రాజు స్వచ్ఛంద పదవి విరమణ చేయగా ఎస్పి సురేందర్ రెడ్డి అదనపు ఎస్పి వి. శ్రీనివాసులుతో కలిసి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన రాజుకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవి విరమణ పొందిన రాజును సత్కరించి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు. పోలీసు శాఖలో రాజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని, హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది, పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం అన్నారు. ప్రజా రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లేక చేయక పోలీసులు పనిచేస్తారని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని రాజు , పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పి పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా రిటైర్డ్ పోలీసు ఉద్యోగులకు ఏలాంటి అవసరం వచ్చినా, పోలీసు శాఖ సహాయ సహకారాలు ఉంటాయని ఎస్పి భరోసా ఇచ్చారు. అలాగే రాజు కు ప్రభుత్యం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని, డి.పి ఓ అధికారులను ఎస్పి ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, ఏఓ అయూబ్ ఖాన్, సూపరింటెండెంట్ సోఫియా సుల్తానా, ఆర్ఐ బండ సతీష్, సీసీ ఫసియోద్దిన్, పదవి విరమణ పొందిన హెడ్ కానిస్తేబుల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: