మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల కోసం పోటీ పడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు మండలివర్గాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు మంగళవారం రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను మండలి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు. డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Post A Comment: