ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

35వ డివిజన్ పుప్పాల గుట్టలో శ్రీ ముత్యాలమ్మ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఆ సీతారాముల వారి ఆశీర్వాదంతో తూర్పు  నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నామని

నూతన కలెక్టర్, బస్ స్టేషన్,1100కోట్లతో హాస్పిటల్ నిర్మించుకుంటున్నామన్నారు

ప్రజల ఆశీర్వాదంతో నిరుపేదనైన నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని ఇక్కడ పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత సమస్యలు అన్ని తనకి తెలుసని అందుకే ఒక్కొక్కటిగా ఈ నియోజకవర్గంలోని సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నారు.

చింతల్ లోని దేవాలయానికి ఇప్పుడే లక్ష రూపాయల  సాయం అందించామని,ఈ దేవాలయంలో కూడా ప్రదక్షిణలు చేయడానికి ఫ్లోర్ ఇబ్బందిగా ఉంది అని తెలిపారని ఎంత ఖర్చు అయిన పూర్తి చేసే తనదేనని ఎమ్మెల్యే అన్నారు

నియోజకవర్గానికి ఎందరో వస్తుంటారు పోతుంటారని పుట్టిన బిడ్డ పుట్టినబిడ్డే సాదుకున్న బిడ్డ సాదుకున్న బిడ్డే అని పుట్టిన బిడ్డకు సాదుకున్న బిడ్డకు తేడా ఉంటుంది కదా అని ఎమ్మెల్యే చమత్కరించారు

ఈ ప్రాంత బిడ్డగా సీతారాములవారితో పాటు ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరారు.

ఆ సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని ఎమ్మెల్యే ఆ దేవుణ్ణి ప్రార్ధించారు.

ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, మర్రి శ్రీనివాస్, డివిజన్ ముఖ్య నాయకులు, డివిజన్ అధ్యక్షులు,యూత్ నాయకులు ఉన్నారు.

కరిమాబాద్(బొమ్మల గుడి)శ్రీ కాశీ విష్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. 

ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు,కూడా డైరెక్టర్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ రామ నవమి సందర్భంగా మార్వాడీ సమాజ్ వారు ఏర్పాటు చేసిన సీతారాముల వారి శోభాయాత్రలో  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. 

ఈ యాత్ర వరంగల్ చౌరస్తా నుండి దుర్గేశ్వర స్వామి దేవాలయం, బట్టల బజార్ మీదుగా భద్రకాళి దేవాలయం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో మార్వాడీ పెద్దలు, కార్పొరేటర్ గందే కల్పన నవీన్, జెడ్ఆర్సిసి మెంబెర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: