ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గతంలో చట్టవ్యతిరేక కార్యకలపాలు నేరాలకు పాల్పడిన పాత నేరస్థులతో పాటు, రౌడీ షీటర్ల ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను అదేశించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శని వారం కెయూసి సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు.

డిసిపి, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి గతులతో పాటు, ఈ కేసుల్లోని నిందితుల అరెస్ట్ . కేసుల దర్యాప్తు, రికవరీ, కోర్టులో పెండింగ్ వున్న కేసులు వాటి స్థితి గతులపై పోలీస్ కమిషనర్ కేసుల వారీగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగితెలుసుకున్నారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మత్తు పదార్థాల విక్రయాలను కట్టడి చేసేందుకుగాను ప్రతి పోలీస్ అధికారి మరింత శ్రమించాల్సి వుంటుందని. గంజాయి రహిత పోలీస్ స్టేషన్ గా గుర్తింపు వచ్చే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గంజాయి అమ్మకాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పీడీయాక్ట్ క్రింద కేసులను నమోదు చేయాలని, ముఖ్యంగా గంజాయి విక్రయాలు, వినియోగించే హట్స్పాట్స్ను అధికారులు గుర్తించి వాటిపై నిరంతరం నిఘా పెట్టాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా నేరాల నియంత్రణకై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజుబుల్

పోలీసింగ్ భాగం నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహించాల్సిన అవసరం వుందని కమిషనర్ తెలిపారు.

బాల్య వివాహాలను నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై వుందని, ముఖ్యంగా బాల్య వివాహలను ప్రోత్సహించే వ్యక్తులపై కూడా కేసులను నమోదు చేయాలని, బాల్య వివాహలపై ఎవరు ఫిర్యాదు ఇవ్వకుంటే సంబంధిత స్టేషన్ అధికారి సుమోటో క్రింద కేసు నమోదు చేసుకోవాలి. భ్రూణ హత్యల నివారణ కై స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు మహిళలు, బాలికల అదృష్య కేసులపై అధికారులు తక్షణమే స్పందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. స్టేషన్ అధికారులు ప్రజలతో సత్ససంబంధాలు పెట్టుకోవాలని అలాగే గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలియజేసారు.

ఈ సమావేశంలో డిసిపిలు అబ్ధుల్ బారీ, కరుణాకర్, సీతారాం, అదనపు డిసిపి పుష్పా రెడ్డి, సంజీవ్, సురేష్ కుమర్ తో పాటు ఎసిపిలుపాటు ఇన్స్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: